Begin typing your search above and press return to search.

మిరాయ్ 2.. క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్!

తేజ సజ్జా హీరోగా వస్తున్న తాజా మూవీ మిరాయ్.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తున్న మిరాయ్ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో విడుదలవుతున్న సంగతి మనకు తెలిసిందే.

By:  Madhu Reddy   |   8 Sept 2025 12:00 AM IST
మిరాయ్ 2.. క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్!
X

తేజ సజ్జా హీరోగా వస్తున్న తాజా మూవీ మిరాయ్.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తున్న మిరాయ్ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో విడుదలవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం మంచు మనోజ్ ని ఎంపిక చేశారు. ఇందులో మనోజ్ విలనిజం వేరే లెవెల్ లో ఉంటుందని ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. అయితే అలాంటి మిరాయ్ మూవీ మరో నాలుగు రోజుల్లో విడుదల కాబోతుండడంతో సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని.

ఆయన తాజాగా పాల్గొన్న ప్రెస్ మీట్ లో ఈ సినిమాకి సంబంధించి కీలక విషయాలు బయట పెట్టారు. అంతేకాదు మిరాయ్ మూవీ సీక్వెల్ పై కూడా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. మరి మిరాయ్ మూవీకి సీక్వెల్ ఉండబోతుందా? డైరెక్టర్ ఏం చెప్పారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. హనుమాన్ సినిమాలో తేజ సజ్జా సూపర్ హీరో పాత్రలో నటించారు. అయితే మిరాయ్ సినిమాలో కూడా తేజ సూపర్ యోధ పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పురాణాలను బేస్ చేసుకొని వస్తున్న కొన్ని కల్పిత కథల ఆధారంగా మిరాయ్ మూవీని తెరకెక్కించారట. పురాణాల్లో అశోక చక్రవర్తి దగ్గర 9 గ్రంథాలు ఉన్నాయని, ఆ తొమ్మిది గ్రంథాలలో మానవాళికి ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించే మార్గాలు ఉంటాయని ఎప్పటినుండో ప్రచారం ఉంది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు.

కానీ ఈ తొమ్మిది గ్రంథాలని హిట్లర్ కూడా చేజిక్కించుకోవడం కోసం ఎన్నో ప్లాన్ లు వేసినట్టు ప్రచారం అయితే ఉంది. అయితే ఈ కల్పిత కథను ఆధారంగా చేసుకొని మిరాయ్ అనే సినిమాను తెరకెక్కించారు కార్తీక్ ఘట్టమనేని.

ఎంతో విలువైనటువంటి జ్ఞాన గ్రంథాలను ఒక దుష్ట ఆలోచనలు ఉన్న వ్యక్తి చేజిక్కించుకోవాలని చూస్తాడు. అయితే దుష్ట ఆలోచనలు ఉన్న వ్యక్తిని ఇతిహాసాల సహాయంతో ఆపగలరా..? ఆ దుష్ట ఆలోచనలున్న వ్యక్తి చేతిలోకి ఈ గ్రంథాలు వెళ్లాయా..?ఒకవేళ వెళ్తే మానవాళి ఎలా ఉండబోతుంది..? అనే దాని గురించి ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా గురించి కార్తీక్ ఘట్టమనేని మాట్లాడుతూ.."గత ఆరేళ్ల నుండి ఈ సినిమాకి స్క్రిప్ట్ వరకు జరుగుతోంది.ఈ కథని ఇతిహాసాలతో ముడిపెడుతూ రాయడం వల్ల కాస్తా ఎక్కువ సమయం పట్టింది.

ఈ సినిమాని మరో స్థాయిలో నిలబెట్టడం కోసం మంచి విజువల్స్ తో ఎక్కువ సమయం తీసుకొని చిత్రీకరించాం.

ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. 100 రోజులపాటు మంచు కొండల్లో, ఎడారిలో, అడవుల్లో తెరకెక్కించాం. అయితే ఈ సినిమా విజువల్ అద్భుతంగా రావడానికి ఒకటి డబ్బు ఎక్కువైనా ఖర్చు పెట్టాలి లేక సమయం ఎక్కువైనా తీసుకోవాలి. అందుకే మేము ఎక్కువ సమయం తీసుకొని కొన్ని యానిమేట్రిక్స్ విజువల్స్ ఉపయోగించి ప్రతి ఒక్క సన్నివేశం ఆశ్చర్యపరిచేలా తెరకెక్కించాం. ఇక మనోజ్ ని ఈ సినిమాలో విలన్ పాత్రకి తీసుకోవడానికి విలన్ పాత్రలో నటించే నటుడు పాజిటివ్ వేలో కనిపించాలి.అందుకే పాజిటివ్ గా కనిపించే మనోజ్ ని విలన్ గా ఈ సినిమాకి తీసుకున్నాం. అలాగే తేజ కూడా ఈ సినిమా కోసం స్పెషల్గా థాయిలాండ్ వెళ్లి కటౌట్ మార్చుకున్నారు" అంటూ కార్తీక్ ఘట్టమనేని చెప్పుకొచ్చారు.

అలాగే ఇందులో సూపర్ యోధ పాత్ర భవిష్యత్తులో కూడా కొనసాగే అవకాశం ఉందా అనే ప్రశ్న డైరెక్టర్ కి ఎదురవగా.. "డెఫినెట్ గా ఉంటుంది.ఎందుకంటే కొనసాగింపుకు ఆస్కారం ఉన్న కథ ఇది. కాబట్టి కచ్చితంగా భవిష్యత్తులో సూపర్ యోధ నేపథ్యంలో మరిన్ని సినిమాలు వస్తాయి" అంటూ మిరాయ్ మూవీ సీక్వెల్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. అలా భవిష్యత్తులో మిరాయ్ మూవీకి కొనసాగింపుగా మరిన్ని సినిమాలు రాబోతున్నాయని కార్తీక్ ఘట్టమనేని స్పష్టం చేశారు.