Begin typing your search above and press return to search.

అంచనాలకు మించి 'మిరాయ్'.. ఏడేళ్లు వర్క్ చేశా: కార్తీక్

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా లీడ్ రోల్ లో టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న మూవీ మిరాయ్ మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   6 Sept 2025 9:06 PM IST
అంచనాలకు మించి మిరాయ్.. ఏడేళ్లు వర్క్ చేశా: కార్తీక్
X

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా లీడ్ రోల్ లో టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న మూవీ మిరాయ్ మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. సూపర్ హీరో జోనర్ లో ఫాంటసీ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఆ మూవీ రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మంచు మనోజ్ విలన్ రోల్ లో కనిపించనున్నారు.


జగపతిబాబు, శ్రియా శరణ్ కీలక పాత్రలు పోషిస్తున్న మిరాయ్ ను భారీ బడ్జెట్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 12వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. వరసుగా ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేస్తూ ఆడియన్స్ లో భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు.

ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో సినీ ప్రియుల్లో మంచి ఆసక్తి నెలకొనగా.. ఇప్పుడు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మీడియాతో మాట్లాడి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. సామ్రాట్ అశోక తొమ్మిది నంబర్ మిస్టరీని భారతీయ పురాణాలకు అనుసంధానించాలనే ఆలోచన తనకు ఉందని తెలిపారు. దానిని మిరాయ్‌ గా తీసుకురావడానికి 7 సంవత్సరాలు పనిచేశానని చెప్పారు.

తేజ సజ్జ నటించిన హనుమాన్ మూవీ విజయం తర్వాత తానేం కొత్తగా మిరాయ్ స్క్రిప్ట్ లో యాడ్ చేయలేదని తెలిపారు. స్కేల్‌ ను కూడా మార్చలేదని అన్నారు. కానీ పురాణాలతో చరిత్ర సమతుల్యత గురించి మరింత నమ్మకంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. సినిమా కోసం తేజ సజ్జా చాలా కష్టపడ్డారని కార్తీక్ ఘట్టమనేని ప్రశంసించారు.

మిరాయ్ కోసం 100 శాతం కన్నా ఎక్కువ ఎఫర్ట్ పెట్టారని తెలిపారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారని చెప్పారు. రియల్ లొకేషన్స్ షూటింగ్ కోసం ఆసియా మొత్తం ప్రయాణించారని చెప్పుకొచ్చారు. మంచు మనోజ్, జటాయు లాంటి ఒక రకమైన పెద్ద డేగతో స్టంట్స్, ఫేస్ టు ఫేస్ సన్నివేశాలు ప్రేక్షకులను ఓ రేంజ్ లో అలరిస్తాయని కార్తీక్ పేర్కొన్నారు.

జగపతి బాబు, జయరామ్ వంటి సీనియర్లు తమ ఉత్తమ ప్రతిభను కనబరిచారని కొనియాడారు. శ్రియ శరణ్ చిత్రానికి భావోద్వేగంగా నిలిచారని అన్నారు. రాముడి విజువల్స్ ప్రత్యేకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. తన దార్శనికతను నమ్మి ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లినందుకు నిర్మాతలు టీజీ విశ్వ ప్రసాద్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన అన్నారు.

మిరాయ్ తాను ఊహించిన దానికంటే చాలా మెరుగ్గా వచ్చిందని, ప్రేక్షకులు ప్రధాన భావోద్వేగాలతో కనెక్ట్ అవుతారని తాను నమ్మకంగా ఉన్నానని కార్తీక్ అన్నారు. పెద్ద స్క్రీన్లపై అద్భుతమైన ప్రదర్శనకు హామీ ఇచ్చే చిత్రం సెప్టెంబర్ 12న భారీ అంచనాలతో విడుదలవుతోందని గుర్తు చేశారు. మరి ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.