మిరాయ్ డైరెక్టర్ కు 'మెగా' ఛాన్స్.. ట్విస్ట్ ఏంటంటే?
టాలీవుడ్ మెగాస్టార్ తో వర్క్ చేయనున్నారు. అయితే అది డైరెక్టర్ గా కాదు.. చిరంజీవి అప్ కమింగ్ ప్రాజెక్టకు సినిమాటోగ్రాఫర్ గా పని చేయనున్నారు.
By: M Prashanth | 14 Sept 2025 4:31 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా లీడ్ రోల్ లో నటించిన మిరాయ్ మూవీతో డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఎలాంటి హిట్ అందుకున్నారో అందరికీ తెలిసిందే. ఫాంటసీ ఫిల్మ్ గా రూపొందించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అంతకుముందు మాస్ మహారాజా రవితేజతో వర్క్ చేసి ఈగల్ మూవీ తీశారు కార్తీక్.
ఆ సినిమాకు మంచి ప్రశంసలు వచ్చినా.. కమర్షియల్ గా నిరాశపరిచింది. ఆ మూవీ కన్నా ముందు తెరకెక్కించిన సూర్య వర్సెస్ సూర్య సినిమా కూడా ప్రశంసలు తెచ్చినా కలెక్షన్స్ తీసుకురాలేదు. ఇప్పుడు ఆ లోటు మొత్తాన్ని మిరాయ్ మూవీతో భర్తీ చేశారు కార్తీక్. సినిమా విజయంలో ఆయనే ప్రధాన పాత్ర పోషించారని చెప్పాలి.
తక్కువ బడ్జెట్ లో బెస్ట్ క్వాలిటీ ఇచ్చి సినీ ప్రియులను ఫిదా చేశారు. అయితే మిరాయ్ కు డైరెక్టర్ గానే కాదు.. సినిమాటోగ్రాఫర్ గా కూడా ఆయన వర్క్ చేశారు. తన కెమెరా పనితనంతో అద్భుతమైన అవుట్ పుట్ ఇచ్చారు. దీంతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న కార్తీక్.. ఇప్పుడు మెగా ఛాన్స్ ను సొంతం చేసుకున్నారు.
టాలీవుడ్ మెగాస్టార్ తో వర్క్ చేయనున్నారు. అయితే అది డైరెక్టర్ గా కాదు.. చిరంజీవి అప్ కమింగ్ ప్రాజెక్టకు సినిమాటోగ్రాఫర్ గా పని చేయనున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడితో మన శివశంకర వరప్రసాద్ గారు మూవీ చేస్తున్న చిరు.. నెక్స్ట్ మరో దర్శకుడు బాబీ కొల్లితో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే వారి కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ కాగా.. ఇప్పుడు మరోసారి జత కట్టనున్నారు. కొన్ని రోజుల క్రితం అనౌన్స్మెంట్ కూడా రాగా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తుండగా.. ఇప్పుడు ఆ మూవీకి కార్తీక్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయనున్నారు.
ఇప్పటికే ప్రేమ ఇష్క్ కాదల్, కార్తికేయ, ఎక్స్ ప్రెస్ రాజా, నిన్ను కోరి, చిత్రలహరి, కార్తికేయ 2 వంటి వివిధ సినిమాలకు ఆయన వర్క్ చేసిన విదితమే. ఇప్పుడు చిరును ఎలా చూపిస్తారన్నది ఆసక్తికరం. అయితే మెగాస్టార్- బాబీ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. ప్రస్తుతం పలు భారీ పాన్ ఇండియా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఆ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టనుంది.
