కార్తీక్ దండు మరో డార్క్ మిస్టిక్ వరల్డ్.. వృషకర్మతో సెన్సేషన్‌కు రెడీ!
తాజాగా ముగిసిన రాజస్థాన్ షెడ్యూల్‌కు సంబంధించిన BTS స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 16 May 2026 11:22 AM ISTయువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మైథికల్ థ్రిల్లర్ వృషకర్మపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. తండేల్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నాగచైతన్య చేస్తున్న ఈ ప్రాజెక్ట్ అతని కెరీర్‌లోనే అత్యంత భారీ, రిస్కీయెస్ట్ సినిమాగా ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా విరూపాక్షతో మిస్టిక్ థ్రిల్లర్ జానర్‌కు కొత్త డెప్త్ ఇచ్చిన డైరెక్టర్ కార్తీక్ దండు ఇప్పుడు వృషకర్మ కోసం మరింత విస్తృతమైన మిస్టిక్ వరల్డ్‌ను సృష్టిస్తున్నారన్న టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు 20 మిలియన్‌కు పైగా వ్యూస్ రావడం ఈ సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచింది.
తాజాగా ముగిసిన రాజస్థాన్ షెడ్యూల్‌కు సంబంధించిన BTS స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజస్థాన్‌లోని భారీ ప్యాలెస్‌లు, పురాతన నిర్మాణాలు, రాయల్ ఆర్కిటెక్చర్ మధ్య తెరకెక్కించిన కీలక సన్నివేశాలు సినిమాకు ప్రత్యేకమైన విజువల్ గ్రాండియర్‌ను తీసుకువస్తున్నాయని తెలుస్తోంది. బయటకు వచ్చిన ఫోటోల్లో నాగచైతన్య, మీనాక్షి చౌదరి ప్రధానంగా కనిపించగా, సెట్స్ డిజైన్ మరియు ఫ్రేమింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా సినిమాలో మైథాలజీ మరియు థ్రిల్లర్ ఎలిమెంట్స్ మిళితమై ఉండబోతున్నాయన్న ఊహాగానాలు సినిమాపై ఆసక్తిని డబుల్ చేస్తున్నాయి.
ఇక టెక్నికల్ పరంగా కూడా వృషకర్మను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. భారీ స్థాయిలో గ్రాఫిక్స్ మరియు వీఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతున్నాయని, ఇండియన్ ఆడియన్స్ ఇప్పటివరకు చూడని మిస్టికల్ సినీమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వడమే టార్గెట్‌గా టీమ్ పనిచేస్తోందని సమాచారం. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ప్రస్తుతం వేగంగా సాగుతున్నాయి. అజనీష్ బి. లోక్‌నాథ్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో ప్రధాన బలంగా మారనుందని భావిస్తున్నారు. కాంతార తర్వాత అజనీష్ మ్యూజిక్‌కు దేశవ్యాప్తంగా వచ్చిన గుర్తింపు వృషకర్మపై కూడా భారీ అంచనాలు పెంచుతోంది. సినిమాటోగ్రాఫర్ రఘుల్ డి హెరియన్ విజువల్ టోన్‌ను డార్క్ మిస్టిక్ స్టైల్‌లో డిజైన్ చేస్తుండగా, ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర తంగాలా భారీ వరల్డ్ బిల్డింగ్‌పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ భారీ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్‌తో దేశవ్యాప్తంగా మంచి బజ్ తీసుకువచ్చిన మేకర్స్, త్వరలో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసే అవకాశముందని సమాచారం. మొత్తానికి భారీ స్కేల్, మిస్టిక్ కాన్సెప్ట్, విజువల్ గ్రాండియర్, టెక్నికల్ హై స్టాండర్డ్స్ తో వృషకర్మను టాలీవుడ్‌లోనే కాదు ఇండియన్ సినీమాలో కూడా ఒక ప్రత్యేక ప్రాజెక్ట్‌గా నిలబెట్టేలా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
