కార్తీక్ - శ్రీలీల కుటుంబాల కలయిక.. అసలేం జరుగుతోంది?
బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ తో చాలా కాలంగా తెలుగు నటి శ్రీలీల డేటింగ్ లో ఉందంటూ పుకార్లు ఉన్నాయి.
By: Sivaji Kontham | 8 Sept 2025 9:25 AM ISTబాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ తో చాలా కాలంగా తెలుగు నటి శ్రీలీల డేటింగ్ లో ఉందంటూ పుకార్లు ఉన్నాయి. ఈ జంట ప్రస్తుతం అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తోంది. అదే సమయంలో ఇరువురి నడుమా కెమిస్ట్రీ ఒక రేంజులో వర్కవుట్ అవుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కార్తీక్ తో శ్రీలీల జంట షికార్లు, ఆఫ్ ద స్క్రీన్ కెమిస్ట్రీ గురించి బాలీవుడ్ మీడియా నిరంతర కథనాలు వండి వారుస్తోంది.
ఏడాది కాలంగా కార్తీక్ ఆర్యన్ కుటుంబంలో అన్ని వేడుకలకు శ్రీలీల కుటుంబం హాజరవుతోంది. ఇటీవల కార్తీక్ కుటుంబ వేడుకలో శ్రీలీల ప్రత్యక్షం కావడంతో ఆ ఇద్దరి డేటింగ్ ఖరారైందంటూ వార్తలు వచ్చాయి. ఇంతకుముందు కార్తీక్ ఇంట్లో జరిగిన పార్టీలో శ్రీలీల పుష్ప 2 పాట కిస్సిక్ కి హుక్ స్టెప్స్ వేస్తుండగా, కార్తీక్ ఆ వీడియోను షూట్ చేస్తూ కనిపించాడు. ఇప్పుడు మరోసారి ముంబైలోని కార్తీక్ ఇంట్లో జరిగిన గణేష్ చతుర్థి వేడుకల సందర్భంగా ఈ జంట కలిసి కనిపించారు. ఇరు కుటుంబ సభ్యులు పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవే ఫోటోలు ఇప్పుడు రెడ్డిట్‌లోను వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోగ్రాఫ్స్ లో కార్తీక్ - శ్రీలీల తెలుపు దుస్తులలో కవలలుగా కనిపించారు. ఒక ఫోటోలో కార్తీక్ శ్రీలీల తల్లి పక్కన కనిపించగా, శ్రీలీల కార్తీక్ తల్లి మాలా తివారీ పక్కన నిలబడి కనిపించింది. మరొక ఫోటోలో కార్తీక్ తన తల్లి మాలా, తండ్రి మనీష్ తివారీ, శ్రీలీల, ఆమె తల్లి అందరూ కలిసి ఫోటో కోసం పోజులిచ్చాడు. ఈ ఫోటోలు జంట డేటింగ్ పై ఊహాగానాలకు మరింత ఆజ్యం పోశాయి.
గత మార్చిలో ఐఫా అవార్డ్స్ ఉత్సవాల నుంచి షేర్ అయిన ఓ వీడియోలో కార్తీక్ తల్లి మాలా తివారీని కాబోయే కోడలు ఎలా ఉండాలి? అని ప్రశ్నించగా, తన కొడుకు భార్య మంచి డాక్టర్ కావాలని వెల్లడించింది. మంచి డాక్టరమ్మ కోడలు కావాలని కుటుంబం కోరుకుంటోందని మాలా తివారీ అన్నారు. ఈ ప్రకటనతో అప్పటికే డాక్టర్ అయిన శ్రీలీలకు లైన్ క్లియర్ అయినట్టేనని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే డేటింగ్ పుకార్లపై ఇప్పటివరకూ శ్రీలీల కానీ, కార్తీక్ కానీ స్పందించలేదు. మొత్తానికి ఆ ఇద్దరి మధ్యా ఏదో జరుగుతోందన్న సందేహాల్ని తాజా పరిణమాలు మరింతగా రాజేస్తున్నాయి.
