ఆలస్యమైనా అద్భుతమైన సమయానికే!
కోలీవుడ్ స్టార్ కార్తీ హీరోగా నటించిన `వా వాతయార్` డిసెంబర్ లో రిలీజ్ అవ్వాల్సిన చిత్రం. కానీ కోర్టు వివాదం నేపథ్యంలో తాత్కాలికంగా రిలీజ్ వాయిదా పడింది.
By: Srikanth Kontham | 11 Jan 2026 11:45 AM ISTకోలీవుడ్ స్టార్ కార్తీ హీరోగా నటించిన `వా వాతయార్` డిసెంబర్ లో రిలీజ్ అవ్వాల్సిన చిత్రం. కానీ కోర్టు వివాదం నేపథ్యంలో తాత్కాలికంగా రిలీజ్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో రిలీజ్ పై స్టే విధించడం...విచారణలు వాయిదా పడటం జరిగింది. దీంతో రిలీజ్ ఇప్పట్లో ఉంటుందా? ఉండదా? అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. కోట్ల రూపాయల పైనాన్స్ తో ముడిపడిన వ్యవహారం కావడంతో చిత్ర నిర్మాత జ్ఞాన్ వేల్ రాజా సెటిల్ చేసుకుంటాడా? కోర్టు గొడవల్లో నలుపుతాడా? అన్న సందిగ్దంలో ఇప్పట్లో రిలీజ్ అయ్యే చిత్రంగా కనిపించలేదు.
అయితే అన్ని వ్యవహారాలు ఊహించని విధంగా ఓ కొలిక్కి వచ్చాయి. రిలీజ్ ఆలస్యమైనా? సరైన సమయానికే ప్రేక్షకుల ముందుకొస్తుంది. అన్ని అవాంతరాలు దాటుకుని చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన `జన నాయగన్` రిలీజ్ కు సెన్సార్ బోర్డ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కింది. కోర్టు నుంచి క్లియరెన్స్ వస్తే తప్ప `జన నాయగన్` రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. జనవరి 9న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా తాత్కాలికంగా వాయిదా పడింది.
ఇదే సమయంలో జనవరి 8 `వావాతయార్` రిలీజ్ కు సంబంధించి కోర్టు రిలీజ్ అడ్డంకులను తొలగించి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. దీంతో భోగి పండుగ రోజునే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన శివ కార్తికేయన్ నటించిన `పరాశక్తి` కూడా డివైడ్ టాక్ వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం తేలిపోవడం ఖాయంటున్నారు. దీంతో తమిళనాడు పొంగల్ విజేత `వా వాతయార్` అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోటీగా మరే సినిమా కూడా లేకపోవడంతో సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే పండి పండినట్లే.
కార్తీ సినిమాలంటే తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆరాదిస్తారు. `అన్నగారు వస్తారు` టైటిల్ తో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే `రాజాసాబ్` కూడా డిజాస్టర్ టాక్ తో తేలిపోయింది. మరో మూడు తెలుగు సినిమాలున్నా? కార్తీ ప్యాన్ బేస్ తో తెలుగింట పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే గట్టెక్కిపోతుంది. అయితే తెలుగు వెర్షన్ రిలీజ్ కు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక అప్ డేట్ లేదు.
