Begin typing your search above and press return to search.

కార్తీ అన్న‌గారు రిస్క్ చేస్తారా?

ఆ సినిమానే అన్న గారు వ‌స్తారు. కార్తీ న‌టించిన వా వాతియార్ సినిమాను తెలుగులో అన్న గారు వ‌స్తారు అనే టైటిల్ తో రిలీజ్ చేద్దామ‌నుకున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   21 Jan 2026 3:40 PM IST
కార్తీ అన్న‌గారు రిస్క్ చేస్తారా?
X

కొన్ని సినిమాలు ఒరిజిన‌ల్ రిలీజ‌య్యాక బాక్సాఫీస్ వ‌ద్ద వాటి రిజ‌ల్ట్ చూసి, వేరే భాష‌లో రిలీజ్ చేయాల‌నుకోరు. అప్ప‌టికే డ‌బ్బింగ్ వెర్ష‌న్ పూర్తైన‌ప్ప‌టికీ రిజ‌ల్ట్ ను దృష్టిలో పెట్టుకుని రిలీజ్ చేయ‌రు. దానికి కార‌ణం రిలీజ్ ఖ‌ర్చుల‌కు స‌రిపోయే క‌లెక్ష‌న్లు కూడా రావ‌నే ఉద్దేశంతోనే. ఇప్ప‌టికే ఎన్నో సినిమాల విష‌యంలో అలా జ‌ర‌గ్గా, ఇప్పుడు ఓ సినిమా ప‌రిస్థితేంట‌నేది అర్థ‌మ‌వడం లేదు.

తెలుగులో కార్తికి మంచి ఫాలోయింగ్

ఆ సినిమానే అన్న గారు వ‌స్తారు. కార్తీ న‌టించిన వా వాతియార్ సినిమాను తెలుగులో అన్న గారు వ‌స్తారు అనే టైటిల్ తో రిలీజ్ చేద్దామ‌నుకున్నారు. కార్తీ పేరుకే త‌మిళ హీరో కానీ అత‌నికి తెలుగులో కూడా మంచి క్రేజ్, ఫాలోయింగ్ ఉన్నాయి. అందుకే అత‌ని ప్ర‌తీ సినిమా దాదాపుగా తెలుగులో కూడా రిలీజ‌వుతుంటుంది. వా వాతియార్ ను కూడా అలానే రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు.

ఆర్థిక సమ‌స్యల వ‌ల్ల ప‌లుమార్లు వాయిదా

అంతా అనుకున్న‌ట్టు జ‌రిగి ఉంటే వా వాతియార్ డిసెంబ‌ర్ నెల‌లోనే త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో రిలీజయ్యేది. కానీ ఫైనాన్షియ‌ల్ ప్రాబ్ల‌మ్స్, కోర్టు జోక్యం వ‌ల్ల ఈ సినిమా వాయిదా ప‌డింది. మొన్న సంక్రాంతికి విజ‌య్ జ‌న‌నాయ‌గ‌న్ త‌ప్పుకోవ‌డంతో స‌డెన్ గా ఎలాంటి ప్లాన్ లేకుండా వా వాతియార్ ను త‌మిళంలో రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమాకు ఆడియ‌న్స్ నుంచి అనుకున్న రెస్పాన్స్ రాలేదు.

డిఫ‌రెంట్ కాన్సెప్ట్ అయిన‌ప్ప‌టికీ సినిమా ఆడియ‌న్స్ ను ఆక‌ట్టుకోలేక‌పోయింది. మ్యూజిక్, ఎంజీఆర్ సెంటిమెంట్, న‌లన్ డైరెక్ష‌న్.. ఇలా ఏదీ సినిమాను కాపాడ‌లేక‌పోయింది. మొత్తానికి వా వాతియార్ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద కార్తీ టాప్3 డిజాస్ట‌ర్ల‌లో ఒక‌టిగా నిలిచే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో మ‌రి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తారా లేదా అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. నిర్మాత‌ల ఆలోచ‌న ఏంట‌నేది చూడాలి.