'సర్దార్ 2' టీజర్ టాక్: థ్రిల్లింగ్ యాక్షన్ మూవీలో ఎస్.జె. సూర్య మార్క్ విలనిజం
తమిళ హీరో కార్తి ప్రధాన పాత్రలో పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ మూవీ `సర్దార్ 2` టీజర్ విడుదలవుతూనే సినీ ప్రియులలో ఒక ప్రత్యేకమైన ముద్రను వేసింది.
By: Sivaji Kontham | 31 July 2026 11:36 PM ISTతమిళ హీరో కార్తి ప్రధాన పాత్రలో పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ మూవీ `సర్దార్ 2` టీజర్ విడుదలవుతూనే సినీ ప్రియులలో ఒక ప్రత్యేకమైన ముద్రను వేసింది. సర్ధార్ మొదటి భాగం బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించడంతో ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొనగా.. అందుకు ఏమాత్రం తగ్గకుండా టీజర్ సరికొత్త యాక్షన్ విజువల్స్.. పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ప్రేక్షకులను మెప్పించింది.
ఈ టీజర్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎస్.జె. సూర్య పాత్ర.. అతడు చెప్పే వాయిస్ ఓవర్ రక్తి కట్టిస్తోంది. ఇద్దరు స్పైలు.. తండ్రి, కొడుకు. తండ్రి ఒక కంట్రీ బ్రూట్, కానీ చాలా బలవంతుడు.. జీనియస్. కొడుకు కూల్ గాయ్.. కానీ చాలా టఫ్ గాయ్! అంటూ కార్తి పోషించిన రెండు విభిన్న పాత్రల స్వభావాన్ని ఎస్.జె. సూర్య వాయిస్ ద్వారా రివీల్ చేసిన తీరు ఆకట్టుకుంది.
అంతేకాకుండా, ``ఈ షో నడిపించేది వాళ్లే కావచ్చు.. కానీ షో స్టీలర్ మాత్రం నేనే. టెక్నికల్ గా నేనే మంచివాడిని ... వాళ్లే చెడ్డవాళ్లు .. మరి ఈ పోరులో నెగ్గేది ఎవరు? అంటూ ఎస్.జె. సూర్య అందించిన విలనిజం షేడ్స్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేశాయి. కార్తి - ఎస్.జె. సూర్య మధ్య సాగే మైండ్ గేమ్‌తో పాటు హై-వోల్టేజ్ పోరాట ఘట్టాలు సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి.
సాంకేతిక పరంగా చూస్తే.. మూవీలో సంపూర్ణంగా స్పై ఆరాను ప్రతిబింబించేలా సామ్ సి.ఎస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. విజువల్స్ టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. కార్తి డిఫరెంట్ గెటప్‌లు.. హై-స్పీడ్ ఛేజింగ్‌లు.. భారీ పేలుళ్ల దృశ్యాలు ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత హైగా ఉన్నాయో చూపిస్తున్నాయి. మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, యోగి బాబు వంటి ప్రముఖ నటీనటులు కూడా కాస్టింగ్‌లో భాగం కావడం ప్రాజెక్ట్ స్థాయిని పెంచింది.
మొత్తానికి `ది హంట్ జస్ట్ గాట్ బిగ్గర్` అనే క్యాప్షన్‌కు తగ్గట్లే `సర్దార్ 2` టీజర్ ప్రతిక్షణం ఉత్కంఠభరితంగా సాగింది. పి.ఎస్. మిత్రన్ మార్క్ స్పై ఎలిమెంట్స్‌తో పాటు పవర్ ప్యాక్డ్ యాక్షన్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 10 సెప్టెంబర్ 2026న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
