శనివారం డైరెక్టర్ తో స్టార్ హీరో!
అలాగే 'మార్షల్' మాత్రం ఆన్ సెట్స్ లో ఉంది. ఇవి గాక కమిట్ అయిన చిత్రాలు కొన్ని ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 'ఖైదీ 2' పట్టాలెక్కించాలి.
By: Srikanth Kontham | 21 Nov 2025 11:38 AM ISTకోలీవుడ్ స్టార్ కార్తీ నటుడిగా ఎంత బిజీగా ఉన్నాడు? అన్నది చెప్పాల్సిన పనిలేదు. కొన్ని సినిమాలు సెట్స్ లో ఉండగానే కొత్త సినిమా కమిట్ మెంట్లు అంతే జరుగుతున్నాయి. ప్రస్తుతం 'వావాతయార్', 'సర్దార్-2', 'మార్షల్' చిత్రాల్లో నటిస్తున్నాడు. 'వా వాతయార్' ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని డిసెంబర్లో రిలీజ్ కానుంది. 'సర్దార్ -2' కూడా షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర పనుల్లో ఉంది. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాలి. కానీ విజువల్ ఎఫెక్స్ట్ కారణంగా డిలే అవుతుంది. దీంతో ఈ సినిమా రిలీజ్ వచ్చే ఏడాది వరకూ ఉండదని తెలుస్తోంది.
బిజీగా ఉన్నా? జోరు తగ్గడం లేదే!
అలాగే 'మార్షల్' మాత్రం ఆన్ సెట్స్ లో ఉంది. ఇవి గాక కమిట్ అయిన చిత్రాలు కొన్ని ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 'ఖైదీ 2' పట్టాలెక్కించాలి. అలాగే టాలీవుడ్ డైరెక్టర్ శైలేష్ కొలనుతో 'హిట్ 3' లోనూ భాగమయ్యాడు. ఈ సారి కేసు విచారణ అధికారి బాధ్యతలు కార్తీ తీసుకున్నాడు. ఈ రెండు పూర్తి చేసి రిలీజ్ చేయడానికి ఎలా లేదన్నా? ఏడాది సమయం పడుతుంది. అదీ అన్ని అనుకున్నట్లు జరిగితేనే ఆ సమయం లేదంటే? అంతకు మించి ఎక్కువగానే సమయం పట్టొచ్చు. ఇలా ఇంత బిజీగా ఉన్నా? కార్తీ కొత్త కమిట్ మెంట్ల జోరు మాత్రం తగ్గించడం లేదు.
కార్తీ నుంచి పాజిటివ్ రెస్పాన్స్:
తాజాగా మరో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఇటీవలే వివేక్ ఓ స్టోర్ నేరేట్ చేసాడట. దానిపై కార్తీ పాజిటివ్ గా ఉన్నాడని తెలిసింది. బౌండెడ్ స్క్రిప్ట్ సిద్దం చేసుకుని మరోసారి మీట్ అవ్వమని చెప్పాడుట. ఈ చిత్రాన్ని నిర్మించడానికి టాలీవుడ్ నుంచి ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ముందుకొస్తుంది. ఆ సంస్థ ద్వారానే వివేక్ కార్తీ వరకూ చేరాడట. లేదంటే కార్తీ తో సినిమా అంటే తమిళ నిర్మాతలే కర్చీప్ వేస్తారు. అన్ని ఒకే అయితే గనుక ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్ లో తెరకెక్కించే అవకాశం ఉంటుంది. అయితే ఇది ఇప్పటికప్పుడు పట్టాలెక్కుతుందా? లేదా? అన్నది దర్శకుడి సామర్ధ్యం మీద అధరా పడి ఉంటుంది.
క్లారిటీ వచ్చేది అప్పుడే?
'మార్షల్' అనంతరం కార్తీ 'ఖైదీ 2'ని మొదలు పెడతాడు. ఇప్పటికే ఈ సినిమా మొదలవ్వాలి. కానీ లోకేష్ కనగరాజ్ నటుడిగా కూడా ఎంట్రీ ఇవ్వడంతో డిలే అవుతుంది. ఆ సినిమా షూటింగ్ ముగించిన వెంటనే `ఖైదీ2` మొదల వుతుంది. ఇందులో కార్తీ మెయిన్ లీడ్ పోషిస్తున్నాడు. పాత్ర కాస్త కఠినంగానే ఉంటుంది. దీంతో షూటింగ్ డేస్ కూడా ఎక్కువగానే తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ పాత్రకు సంబంధించి చిత్రీకరణ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత కొత్త చిత్రాలకు సంబంధించి పూర్తి క్లారిటీ వస్తుంది.
