“అన్నయ్యలను ఎక్స్చేంజ్ చేసుకుందామా?”.. మనోజ్ కామెంట్‌కు కార్తీ సూపర్ రిప్లై!
ముఖ్యంగా మనోజ్, కార్తి మధ్య అన్నయ్యల గురించి జరిగిన సరదా సంభాషణ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
By: Madhu Reddy | 7 Sept 2026 6:45 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో కార్తి నటిస్తున్న లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్ 2'. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా తెలుగు ప్రమోషనల్ ఈవెంట్‌లో మంచు మనోజ్ సందడి చేశారు. కార్తి, ఎస్.జె. సూర్య మరియు మంచు మనోజ్ కలిసి చేసిన ఫన్నీ ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా మనోజ్, కార్తి మధ్య అన్నయ్యల గురించి జరిగిన సరదా సంభాషణ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
అన్నయ్యల ఎక్స్చేంజ్ ఆఫర్:
ఇంటర్వ్యూలో మనోజ్ మాట్లాడుతూ.. "కార్తిని ఆయన అన్నయ్య సూర్య ఎంత ప్రేమగా, ఒక చిన్న పిల్లాడిలా చూసుకుంటారో ప్రస్తావించారు. దానికి కార్తి వెంటనే మనోజ్, మంచు విష్ణుల మధ్య ఉన్న బాండింగ్‌ను గుర్తుచేశారు. మీరు ఇలానే వుంటారా? విష్ణు, మీకు బాండింగ్ అని అడగ్గానే మనోజ్ తక్షణమే స్పందిస్తూ, "మనం ఒకసారి మన అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా?" అని సరదాగా ఆఫర్ ఇచ్చారు. దానికి కార్తి కూడా నవ్వుతూ "డీల్" అని రిప్లై ఇవ్వడంతో అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు.
విష్ణుపై పడిన ఇన్ డైరెక్ట్ సెటైర్:
గత కొంతకాలంగా మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య విభేదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మనోజ్ సరదాగా "అన్నయ్యలను మార్చుకుందాం" అని అనడం, దానికి తోడు "అయితే మనోడికి ఉంది లే" అని కామెంట్ చేయడంతో ఈ టాపిక్ ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సరదా కామెంట్‌పై విష్ణు ఎలా రియాక్ట్ అవుతారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆర్టీసీ బస్సు గుద్దినట్లే:
అలాగే నటుడు ఎస్. జె. సూర్య ఎనర్జిటిక్ యాక్టింగ్ గురించి చెబుతూ మనోజ్ ఒక క్రేజీ కౌంటర్ వేశారు. "నా యాక్టింగ్ తమిళ ఆటో వచ్చి గుద్దినట్లు ఉంటే.. మీ యాక్టింగ్ మాత్రం తెలుగు ఆర్టీసీ బస్సు వచ్చి గుద్దినట్లు ఉంటుంది" అని మనోజ్ అనడంతో ఎస్. జె. సూర్య ఇచ్చిన ఫన్నీ రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది.
మొత్తానికి పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగులో తీసుకురానుంది. సెప్టెంబర్ 10న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. 'సర్దార్ 2' ప్రమోషన్స్ లో మంచు మనోజ్, కార్తి, ఎస్.జే. సూర్యల కాంబినేషన్ ఈవెంట్‌కు సరికొత్త ఎనర్జీని తెచ్చింది. కార్తి ద్విపాత్రాభినయం, ఎస్.జే. సూర్య విలనిజంతో రాబోతున్న ఈ సీక్వెల్ పై ఈ సరదా ఇంటర్వ్యూతో అంచనాలు మరింత పెరిగాయి.
