Begin typing your search above and press return to search.

కార్తి అన్నగారు వస్తారు టీజర్.. ఎనర్జీ అదిరింది..!

కోలీవుడ్ స్టార్ కార్తి హీరోగా వస్తున్న కొత్త సినిమా టీజర్ రిలీజైంది. ఈ సినిమాకు తమిళ్ లో వా వాతియార్ అనే టైటిల్ పెట్టగా తెలుగులో అన్నగారు వస్తారు అనే పేరుని ఫిక్స్ చేశారు.

By:  Ramesh Boddu   |   29 Nov 2025 9:36 AM IST
కార్తి అన్నగారు వస్తారు టీజర్.. ఎనర్జీ అదిరింది..!
X

కోలీవుడ్ స్టార్ కార్తి హీరోగా వస్తున్న కొత్త సినిమా టీజర్ రిలీజైంది. ఈ సినిమాకు తమిళ్ లో వా వాతియార్ అనే టైటిల్ పెట్టగా తెలుగులో అన్నగారు వస్తారు అనే పేరుని ఫిక్స్ చేశారు. నలన్ కుమారస్వామి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ వా వాతియార్ అదే అన్నగారు వస్తారు సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కే.యి జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. అన్నగారు వస్తారు సినిమాలో కార్తి సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా టీజర్ ని ఒక సాంగ్ బిట్ రూపంలో రిలీజ్ చేశారు.

అన్నగారు వస్తారు కార్తి గ్రేస్ ఫుల్ స్టెప్స్..

సినిమాలో పోలీస్ గా నటిస్తున్న కార్తీ అలా కార్ దిగి రాగానే అతనికి వెల్కం చెబుతున్న సందర్భంలో వెనుక మ్యూజిక్.. కార్తి గ్రేస్ ఫుల్ స్టెప్స్ అబ్బా ఫ్యాన్స్ కి అయితే సూపర్ అనిపించేస్తుంది. ఇక మ్యూజిక్ వస్తూనే కార్తి డ్యాన్స్ చేస్తూనే మధ్య మధ్యలో సినిమా కాన్సెప్ట్ కి సంబందించిన కొన్ని కట్ షాట్స్ వేశారు. ఫైనల్ గా మణిసార్ అనుకుంటూ కార్తి వెళ్తాడు. సో మరో క్రేజీ పోలీస్ స్టోరీతో కార్తి అన్నగారు వస్తారు సినిమాతో వస్తున్నారు.

ఈ సినిమాలో కార్తి ఎనర్జిటిక్ గా కనిపించేలా ఉన్నారు. అఫ్కోర్స్ అన్ని సినిమాలకు ఆయన ఎనర్జీ అదిరిపోతుంది. కానీ పోలీస్ గెటప్ లో కార్తి హెయిర్ కట్, ఆయన స్టైల్ అంతా కొత్తగా ఉంది. అదే ఎనర్జీగా మారి స్క్రీన్ మీద అందంగా కనిపిస్తుంది. ఇక జస్ట్ టీజర్ తోనే సినిమా ఎలా ఉంటుందో శాంపిల్ చూపించారు మేకర్స్. తప్పకుండా అన్నగారు వస్తారు కార్తి ఫ్యాన్స్ కి ఒక మంచి మాస్ ఫీస్ట్ అందించేలా ఉందనిపిస్తుంది.

కృతి శెట్టి ఈ సినిమాపై చాలా హోప్స్..

ఉప్పెన బేబమ్మ కృతి శెట్టి తెలుగులో ఎలాగు ఛాన్స్ లు లేవన్ తమిళ్ లో విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కార్తితో అన్నగారు వస్తారు సినిమా చేస్తున్న కృతి శెట్టి ఈ సినిమాపై చాలా హోప్స్ తో ఉంది. ఎప్పటిలానే టీజర్ లో కృతి శెట్టి లుక్స్ ఇంప్రెస్ చేశాయి. వా వాతియార్ అదే అన్నగారు వస్తారు సినిమాను డిసెంబర్ 5న రిలీజ్ లాక్ చేశారు మేకర్స్.

తమిళ్ తో పాటు తెలుగు ఆడియన్స్ కి కార్తి చాలా దగ్గరయ్యాడు. సూర్య తర్వాత ఎప్పటికో హీరో అయిన కార్తి తెలుగు స్పష్టంగా మాట్లాడుతూ ఇక్కడ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తున్నాడు. కార్తితో స్ట్రైట్ తెలుగు సినిమా ఆఫ్టర్ ఊపిరి ప్రాజెక్ట్ కావాలని ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఐతే ఆయన తెలుగులో డైరెక్ట్ సినిమాలు చేయకపోయినా తన ప్రతి సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు కార్తి.