Begin typing your search above and press return to search.

కార్తీ టైటిల్ తోనే క‌ట్టిప‌డేశాడుగా!

కానీ ఇప్పుడు కార్తీ మాత్రం త‌న అప్ క‌మింగ్ మూవీ వా వాతియార్ ను తెలుగులో అన్న‌గారు వ‌స్తారు అనే టైటిల్ తో రిలీజ్ చేయ‌బోతున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   19 Nov 2025 4:48 PM IST
కార్తీ టైటిల్ తోనే క‌ట్టిప‌డేశాడుగా!
X

కంటెంట్ బావుంటే ఏ జాన‌ర్ సినిమాలైనా, ఏ భాష‌కు సంబంధించిన సినిమాలైనా తెలుగు ఆడియ‌న్స్ గుండెల్లో పెట్టుకుంటారు. ఈ మాట‌ను ఒక‌రు కాదు, ప‌రాయి భాష‌ల‌కు చెందిన ఎంతోమంది సెల‌బ్రిటీలే చెప్పారు. ఈ నేప‌థ్యంలోనే త‌మిళ సినిమాల‌ను తెలుగులోకి డ‌బ్బింగ్ చేసి రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే సినిమాను డ‌బ్బింగ్ చేసినా మేక‌ర్స్ మాత్రం అదే టైటిల్ తో ఆ సినిమాల‌ను తెలుగులోకి రిలీజ్ చేస్తూ రావ‌డం ఈ మ‌ధ్య చాలా కామ‌న్ అయిపోయింది.





ఇప్ప‌టికే అలా ఎన్నో సినిమాలు ఒకే టైటిల్ తో త‌మిళం, తెలుగులో రిలీజయ్యాయి. తెలుగులో రిలీజ్ చేస్తూ త‌మిళ టైటిల్ ఏంట‌ని అడిగితే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న సినిమా కాబ‌ట్టి ఒకటే టైటిల్ ఉండాల‌ని, లేక‌పోతే ఆడియ‌న్స్ క‌న్‌ఫ్యూజ్ అయిపోతార‌ని త‌మ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించుకుంటారు కానీ తెలుగు ఆడియ‌న్స్ కు అనుకూలంగా టైటిల్ ను మాత్రం మార్చే ప్ర‌య‌త్నం ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రూ చేయ‌లేదు.

మంచి టైటిల్ ను ప‌ట్టేసిన కార్తీ

కానీ ఇప్పుడు కార్తీ మాత్రం త‌న అప్ క‌మింగ్ మూవీ వా వాతియార్ ను తెలుగులో అన్న‌గారు వ‌స్తారు అనే టైటిల్ తో రిలీజ్ చేయ‌బోతున్నారు. యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమాలో కార్తీకి జోడీగా కృతి శెట్టి హీరోయిన్ గా న‌టిస్తున్నారు. కార్తీ త‌మిళ హీరో అయిన‌ప్ప‌టికీ అత‌నికి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ వ‌ల్ల‌నే కార్తి తెలుగులో సొంతంగా డ‌బ్బింగ్ కూడా చెప్పుకుని ఆడియ‌న్స్ కు త‌న ప్రేమ‌ను వ్య‌క్త‌పరుస్తూ వ‌స్తున్నారు.

రెండేళ్లుగా నిర్మాణంలోనే..

ఇప్పుడు త‌న టైటిల్ ను కూడా తెలుగులోకి మార్చ‌డ‌మే కాకుండా అన్న‌గారు వ‌స్తారు అని తెలుగుద‌నం ఉట్టిప‌డే టైటిల్ ను వాడి తెలుగు ఆడియ‌న్స్ ను ఆక‌ట్టుకుంటున్నారు కార్తీ. రెండేళ్లుగా నిర్మాణంలోనే ఉన్న ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తైంది కానీ సినిమా ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదా ప‌డుతూనే వ‌స్తుంది. న‌ల‌న్ కుమార్ స్వామి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా డిసెంబ‌ర్ లో రిలీజ‌వుతుంద‌ని మేక‌ర్స్ చెప్తున్న‌ప్ప‌టికీ తాజాగా రిలీజైన పోస్ట‌ర్ లో రిలీజ్ డేట్ ను ప్ర‌స్తావించక‌పోవ‌డం ప‌లు అనుమానాల‌కు దారి తీస్తుంది. గ‌త కొంత‌కాలంగా స‌రైన స‌క్సెస్ లేక ఇబ్బంది ప‌డుతున్న కార్తీ ఈ సినిమాతో మంచి హిట్ ను అందుకుంటే ఈ హిట్ కార్తీ నుంచి త‌ర్వాత రాబోయే స‌ర్దార్2 కు ఉప‌యోగ‌ప‌డే ఛాన్సుంది. మ‌రి చూడాలి అన్న‌గారు వ‌స్తారు ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటుందో.