కార్తీ 'అన్నగారు వస్తారు' ట్రైలర్.. ఏదో కొత్తగా ఉందే..
యాక్టింగ్ ఫీల్డ్ లో ఉన్న హీరో చివరికి పోలీసు అధికారిగా మారడం.. ఆ తర్వాత నేర అంశాలను ఎదుర్కోవడం వంటి సన్నివేశాలతోపాటు ఎమోషనల్ సీన్స్ తో ట్రైలర్ క్రేజీగా సాగిందని చెప్పాలి.
By: M Prashanth | 6 Dec 2025 7:39 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో కార్తీకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆయన సినిమాలు ఎప్పటికప్పుడు మన దగ్గర రిలీజ్ అవుతుంటాయి. లేటెస్ట్ గా ఆయన నటించిన వా వాతియార్ కూడా అన్నగారు వస్తారు టైటిల్ తో తెలుగులో విడుదల అవ్వనుంది. చాలా కాలంగా వార్తల్లో నిలిచిన చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది.
నిజానికి అన్నగారు వస్తారు మూవీ డిసెంబర్ 5వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ అఖండ 2 తాండవం చిత్రంతో పోటీ ఎందుకని తప్పుకుంది. అయితే ఆ సినిమానే వాయిదా పడగా.. ఇప్పుడు అన్నగారు వస్తారు డిసెంబర్ 12వ తేదీన విడుదల అవ్వనుంది. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ తెలుగు ట్రైలర్ ను తీసుకొచ్చారు. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో రిలీజ్ చేయించారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో అన్నగారు వస్తారు ట్రైలర్ వైరల్ గా మారింది. అందరినీ ఆకట్టుకుంటూ.. ఆసక్తి రేపుతూ.. సందడి చేస్తోంది. ట్రైలర్ ప్రకారం.. సినిమాలో ప్రస్తుత కథతో పాటు పీరియాడిక్ కథ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ రిఫరెన్స్ తో మూవీలో హీరో పాత్ర ఉండబోతుందని అర్థమవుతోంది. అదే ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా కనిపిస్తోంది.
యాక్టింగ్ ఫీల్డ్ లో ఉన్న హీరో చివరికి పోలీసు అధికారిగా మారడం.. ఆ తర్వాత నేర అంశాలను ఎదుర్కోవడం వంటి సన్నివేశాలతోపాటు ఎమోషనల్ సీన్స్ తో ట్రైలర్ క్రేజీగా సాగిందని చెప్పాలి. ఏదేమైనా అన్నగారు వస్తారు మూవీ.. డార్క్ కామెడీతో పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండనుందని క్లియర్ గా తెలుస్తోంది.
అయితే సినిమాలో కార్తీ స్టైలిష్ లుక్ తోపాటు వైవిధ్యంగా కనిపించనున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతుంది. కృతి శెట్టితో కూడిన సన్నివేశాలు అటు రొమాంటిక్ గా.. ఇటు ఫన్నీగా అట్రాక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమస్యలు, ప్రజలను దృష్టిలో ఉంచుకుని కథలను తనదైన శైలిలో చెప్పే దర్శకుడు నలన్ కుమారస్వామి .. ఇప్పుడు ఈ సినిమాపై కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.
ట్రైలర్ కొత్తగా ఉందని.. బాగుందని నెటిజన్లు, సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. ఇక సినిమా విషయానికొస్తే.. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా.. సత్యరాజ్, రాజ్ కిరణ్, ఆనందరాజ్, శిల్పా మంజునాథ్, కరుణాకరన్, జీఎం సుందర్, వడివుక్కరసి, మధుర్ మిట్టల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.
