Begin typing your search above and press return to search.

కోర్టు మెట్లెక్కిన కరిష్మా కపూర్ పిల్లలు.. న్యాయస్థానం తీర్పు ఏంటంటే?

సంజయ్ కపూర్ మరణంతో మొదటి భార్య పిల్లలకి రెండో భార్యకి మధ్య ఆస్తి తగాదాలు భగ్గుమన్నాయి.

By:  Madhu Reddy   |   25 Sept 2025 10:00 PM IST
కోర్టు మెట్లెక్కిన కరిష్మా కపూర్ పిల్లలు.. న్యాయస్థానం తీర్పు ఏంటంటే?
X

బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త రీసెంట్ గా మరణించడంతో ఆస్తి విభేదాలు కుటుంబంలో భగ్గుమన్నాయి. కరిష్మా కపూర్ మొదట వ్యాపారవేత్త అయినటువంటి సంజయ్ కపూర్ ని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త వేధింపులు భరించలేక కరిష్మా భర్త నుండి విడిపోయింది. విడాకులు తీసుకున్నాక సంజయ్ కపూర్ మరో మహిళను పెళ్లి చేసుకున్నారు. అయితే రీసెంట్గా ఆయన గుండె పోటుతో మరణించారు. సంజయ్ కపూర్ మరణంతో మొదటి భార్య పిల్లలకి రెండో భార్యకి మధ్య ఆస్తి తగాదాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలోనే సంజయ్ కపూర్ మొదటి భార్య కరిష్మా కపూర్ పిల్లలు కోర్టులో కేసు వేశారు.

కరిష్మా కపూర్ భర్త సంజయ్ కపూర్ కి దాదాపు 30 వేల కోట్ల ఆస్తి ఉంది. ఈ ఆస్తిలో సగభాగం మాకు వాటా వస్తుందని కరిష్మా కపూర్ ఇద్దరు పిల్లలు కోర్టులో కేసు వేశారు.. కానీ ఈ విషయంలో సంజయ్ కపూర్ రెండో భార్య ప్రియా సచ్ దేవ్ సంజయ్ కపూర్ రాసినట్లుగా ఒక ఫేక్ వీలునామని రాయించి సంజయ్ కపూర్ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి ఆస్తిలో ఎవరికి ఎలాంటి హక్కు లేదు పూర్తిగా తనకే హక్కు ఉంది అన్నట్లుగా రాయించుకుంది. కానీ ఇదంతా ఫేక్ అని తమ తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్రియా సచ్ దేవ్ ఒక దొంగ వీలునామని రాయించింది అంటూ కరిష్మా కపూర్ పిల్లలు కోర్టులో కేసు వేశారు. అలాగే తమ తండ్రి మరణించే సమయానికి ఆయనకు సంబంధించిన చరాస్తులు, స్థిరాస్తులు ఏవీ తమకు తెలియదని, ఆయనకున్న ప్రతి ఒక్క ఆస్తి వివరాలను తెలియజేయాలంటూ సవతి తల్లి ప్రియాసచ్ దేవ్ పై కరిష్మా కపూర్ పిల్లలు కోర్టు లో పిటిషన్ వేయడంతో న్యాయస్థానం స్పందించి.. ఆస్తుల వివరాలన్నీ సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

కానీ భర్తకు సంబంధించిన ఆస్తులన్నీ బయటపడితే ఎక్కడ మొదటి భార్య పిల్లలకి వాటా వెళ్లిపోతుందోనని ముందుగానే గ్రహించిన సంజయ్ కపూర్ రెండో భార్య ప్రియా సచ్ దేవ్ తన భర్త ఆస్తి విషయాలు బయట పెట్టాలంటే తనకు నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంటు(NDA) కుదుర్చుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరింది. అంతేకాదు సైబర్ సెక్యూరిటీ వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కరిష్మా కపూర్ పిల్లలు, సంజయ్ కపూర్ తల్లి రాణి కపూర్ వాటిపై సంతకం చేయాలని కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కానీ ప్రియా వేసిన పిటిషన్ ని విచారించిన న్యాయస్థానం ఆమె పిటిషన్ ని కొట్టి పారేసింది.. ప్రియా తన పిటిషన్ లో తన భర్తకు సంబంధించిన ఆస్తులు కొన్ని బయటికి చెప్పుకోలేనివని, ఒకవేళ ఆ ఆర్థిక వివరాలు బయటపెడితే ఇబ్బందులు తలెత్తుతాయని తన పిటిషన్ లో చెప్పుకొచ్చింది. కానీ దీనిపై కరిష్మా కపూర్ పిల్లలు వ్యతిరేకించారు.

అలాగే కరిష్మా కపూర్ తరఫు న్యాయవాది నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటే వీలునామ గురించి ప్రశ్నలు అడిగే వీలు ఉండదని తేల్చి చెప్పారు.అంతేకాకుండా సంజయ్ కపూర్ రాసినట్లు క్రియేట్ చేసిన ఆ వీలునామాలో ఉన్న సంజయ్ కపూర్ అకౌంట్ లో అసలు డబ్బులు కూడా లేవని అది ఫేక్ వీలునామా అంటూ కరిష్మా పిల్లలు కొట్టిపారేశారు. అయితే కరిష్మా కపూర్ పిల్లల వాదన అలాగే సంజయ్ కపూర్ రెండో భార్య ప్రియా వాదనలు విన్న న్యాయవాది ప్రియా సచ్ దేవ్ కి షాక్ ఇచ్చారు.. మీరు మొత్తం సీల్డ్ కవర్ లో ఇస్తే మీ అవతలి పక్షం వారు సమాధానాలు ఎలా ఫైల్ చేయగలుగుతారు.ఇలాంటి నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ కి సంబంధించిన ఆదేశాలు ఇవ్వడం కుదరదు అంటూ ప్రియా సచ్ దేవ్ కి న్యాయస్థానం తేల్చి చెప్పింది.అలాగే దీనిపై జరిగే తదుపరి విచారణ శుక్రవారం రోజుకి వాయిదా వేసింది.