'శంబాల' టీమ్ నెక్స్ట్.. స్పెషల్ సెట్ లోనే 'కరికాల' జర్నీ స్టార్ట్..
హైదరాబాద్ లో ఆ సినిమా పూజా కార్యక్రమాలు స్పెషల్ వాటర్ ఫాల్ సెట్స్ లో గ్రాండ్ గా జరగ్గా.. మూవీ స్టోరీ, అందులోని రోల్స్ పై ఆడియన్స్ లో హైప్ అప్పుడే మొదలైంది.
By: M Prashanth | 15 Oct 2026 2:44 PM ISTటాలీవుడ్ లో కొత్త కథలతో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసే ప్రయత్నాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఫాంటసీ సినిమాలకు భారీ విజువల్స్ తోడైతే ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పెరుగుతోంది. ఇప్పుడు ఇదే తరహాలో మరో కొత్త వరల్డ్ ను పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది సూపర్ హిట్ మూవీ 'శంబాల' టీమ్. యంగ్ హీరో సందీప్ కిషన్ తో కలిసి దర్శకుడు యుగంధర్ ముని భారీ పాన్ ఇండియా సినిమా 'కరికాల' ప్రారంభించారు.
హైదరాబాద్ లో ఆ సినిమా పూజా కార్యక్రమాలు స్పెషల్ వాటర్ ఫాల్ సెట్స్ లో గ్రాండ్ గా జరగ్గా.. మూవీ స్టోరీ, అందులోని రోల్స్ పై ఆడియన్స్ లో హైప్ అప్పుడే మొదలైంది. 'శంబాల' సినిమాతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించిన దర్శకుడు యుగంధర్ ముని.. ఇప్పుడు మరో భిన్నమైన కథతో ముందుకొస్తున్నారు. ఈసారి సోషల్ ఎలిమెంట్స్ తో పాటు పురాణాలు, ఫాంటసీ, సాహసాలను కలిపి ఓ కొత్త వరల్డ్ ను చూపించనున్నారు.
సందీప్ కిషన్ ను నెవ్వర్ బిఫోర్ అనేలా పవర్ ఫుల్ యోధుడి రోల్ లో చూపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఆయన రాజసం ఉట్టిపడే గెటప్ లో కనిపించారు. ఆయన పక్కనే ఉన్న సింహం కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. చిన్నప్పుడు చందమామ కథల్లో చదువుకున్న రాజులు, సాహసాలు, వింత ప్రపంచాలను గుర్తుచేసేలా 'కరికాల' ఉండబోతోంది.
ఊహలకు అందని ప్రపంచంలో సాగే కథలో ఫాంటసీ, సాహసాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వనున్నారు. భారీ ప్రొడక్షన్ వాల్యూస్, అట్రాక్ట్ చేసే సీన్స్ తో ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ అందించాలనేది మూవీ టీమ్ ఆలోచన. అందుకే సినిమాను బిగ్ రేంజ్ లో రూపొందిస్తున్నారు. ఇక 'కరికాల' ను రెండు పార్టులుగా తీసుకురానున్నారు. మొదటి భాగాన్ని 2027 జులై 2న, రెండో భాగాన్ని అదే ఏడాది అక్టోబర్ 28న రిలీజ్ చేయనున్నారు.
అంటే కేవలం నాలుగు నెలల గ్యాప్ లోనే రెండు పార్టులు కూడా థియేటర్లలోకి రానున్నాయి. ఒకే కథను రెండు భాగాలుగా చెప్పడంతో పాటు, వాటి విడుదల మధ్య ఎక్కువ గ్యాప్ లేకుండా చూసుకోవడం ఇంట్రెస్టింగ్ విషయమే. ఇక సినిమాలో కేథరిన్ ట్రెసా, సాక్షి మడోల్కర్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా యాక్ట్ చేస్తుండగా.. వారి లుక్స్ కూడా అట్రాక్ట్ చేశాయి. ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల బాణీలు అందిస్తున్నారు.
'శంబాల' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యుగంధర్ ముని దర్శకత్వంలో ఆ మూవీ తెరకెక్కుతోంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. కథలోని ఫాంటసీ అంశాలు, సందీప్ కిషన్ యోధుడి రోల్, రెండు భాగాల విడుదల తేదీలు ఇప్పటికే ప్రాజెక్టుపై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ పెంచుతున్నాయి. 'శంబాల' తర్వాత అదే టీమ్ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో సినిమాపై అంచనాలు
పెరుగుతున్నాయి.
