కపూర్ సిస్టర్స్ ముందు ఆ హాలీవుడ్ తారలు సరిపోరా?
కరీనా కపూర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటో డంప్‌లో అక్క కరిష్మా కపూర్‌తో కలిసి సంప్రదాయ చీరల్లో మెరిసిన పాత ఫొటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరిని కిమ్ కర్దాషియన్, కెండల్ జెన్నర్‌లతో పోలుస్తూ ఓ అభిమాని చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. కుటుంబ వేడుకలు, భర్త సైఫ్, పిల్లలతో గడిపిన క్షణాలను కూడా కరీనా పంచుకున్నారు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ 'కింగ్', 'గుట్కా' సినిమాల్లో నటిస్తున్నారు.
By: Srikanth Kontham | 25 Nov 2026 1:43 PM ISTసోషల్ మీడియాలో బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఎంత యాక్టివ్ గా ఉంటుందో? చెప్పాల్సిన పనిలేదు. వృత్తి.. వ్యక్తిగత జీవితంలోని అందమైన క్షణాలను అభిమానులతో పంచుకోవడంలో ఎంతో ఉత్సాహంగా కనిపిస్తారు. అప్పుడప్పుడూ ఫోన్ గ్యాలరీలోని అరుదైన చిత్రాలతో ఫోటో డంప్ పోస్ట్ చేసి నెటిజన్లకు కనువిందు చేస్తారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి అలాంటి ఆసక్తికర ఫోటోల కలెక్షన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కుటుంబ వేడు కలు.. సెలవుల జ్ఞాపకాలతో పాటు కొన్ని పాత జ్ఞాపకాలను కూడా జత చేశారు. అయితే ఈ ఫోటోలన్నింటిలో కరీనా అక్క కరిష్మా కపూర్‌తో కలిసి సంప్రదాయ చీరల్లో మెరిసిన ఓ త్రోబ్యాక్ చిత్రం అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది.
భారీ ఎంబ్రాయిడరీ చీరల్లో కపూర్ సిస్టర్స్ ఎంతో రాజసంగా కనిపిస్తున్న పాత ఫోటోకు ఓ అభిమాని పెట్టిన క్యాప్షన్‌ను కరీనా యథాతథంగా షేర్ చేశారు. `కిమ్, కెండల్ ఎవరు?`అంటూ ప్రముఖ హాలీవుడ్ సిస్టర్స్ కిమ్ కర్దాషియన్.. కెండల్ జెన్నర్‌లతో కరిష్మా.. కరీనాలను పోలుస్తూ అభిమాని రాసిన కామెంట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఫోటో కలెక్షన్‌లో కరీనా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మరికొన్ని ఆత్మీయ క్షణాలను కూడా అభిమానులతో పంచుకున్నారు. చిరుతపులి ప్రింట్ గౌన్‌లో ఉన్న గ్లామరస్ ఫోటోతో పాటు.. పిల్లలతో గడిపిన సరదా సెలవుల చిత్రాలను పోస్ట్ చేశారు.
మరో రెండు ఫోటోల్లో భర్త సైఫ్ అలీ ఖాన్ చిన్న కుమారుడు జే తో ఆడుకుంటూ కనిపించగా.. ఇంకో చిత్రంలో దంపతులిద్దరూ ఇంట్లో దీపం వెలిగిస్తూ సంప్రదాయబద్ధంగా దర్శనమిచ్చారు. అలాగే తల్లిదండ్రులు రణధీర్ కపూర్.. బబితల 55వ వివాహ వార్షికోత్సవ వేడుకలకు సంబంధించిన ఫోటోలు కూడా ఈ డంప్‌లో ఉన్నాయి.
ఇక సినిమాల విషయానికొస్తే కరీనా చివరిసారిగా మేఘనా గుల్జార్ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కలిసి నటించిన క్రైమ్ థ్రిల్లర్ `దాయ్రా`లో డీసీపీ అజూనీ కోహ్లీగా కనిపించారు. సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం కరీనా షారుఖ్ ఖాన్ భారీ చిత్రం `కింగ్` లోనటిస్తోంది. దీంతో పాటు `గుట్కా` అనే మరో ప్రాజెక్ట్ కూడా అమ్మడి లైనప్‌లో ఉంది. అయితే కరీనా ఎంట్రీ గురించి టాలీవుడ్ లో మాత్రం పెద్దగా వినిపించడం లేదు. సీనియర్ నాయికను ఓ పెద్ద స్టార్ సరసన రంగంలోకి దించితే? బఆగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
