స్టైలిష్ లుక్ లో స్పెషల్ అట్రాక్షన్..
సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ సోషల్ మీడియా ద్వారా పలు రకాల ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
By: Madhu Reddy | 13 Dec 2025 7:00 PM ISTసినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ సోషల్ మీడియా ద్వారా పలు రకాల ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మరికొంతమంది ఎక్కడైనా ఈవెంట్ కు వెళ్తే చాలు అందరిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడం కోసం ఏవేవో చేస్తున్న విషయం తెలిసిందే. ఇంకొంతమంది తమ వస్త్రధారణతో కూడా అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. ఇంకొంతమంది స్టైలిష్ ఫోజులతో అందరిలో అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు ఈ క్రమంలోనే తన అందంతోనే కాదు స్టైలిష్ లుక్ తో కూడా అందరి దృష్టిని ఆకర్షించింది ప్రముఖ హీరోయిన్ కరీనాకపూర్.
తాజాగా ఒక ఈవెంట్ లో పాల్గొన్న కరీనా కపూర్.. తన అందంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. వైట్ అండ్ వైట్ లో.. జేబులో చేతులు పెట్టుకొని మరీ స్టైలిష్ గా నడుచుకుంటూ ఈవెంట్ కు హాజరైన తీరుకు అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. హుందాతనంగా నడుచుకున్న తీరు అందరి దృష్టిని ఆకట్టుకుంది. మొత్తానికైతే కరీనాకపూర్ షేర్ చేసిన ఈ ఇంస్టాగ్రామ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
కరీనాకపూర్ విషయానికి వస్తే.. బాలీవుడ్ నటిగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. ప్రముఖ నటుడు రణధీర్ కపూర్, బబితల కుమార్తె. ఈమె సోదరి ప్రముఖ హీరోయిన్ కరిష్మా కపూర్. రొమాంటిక్ కామెడీ మొదలు క్రైమ్ డ్రామా వరకు ఎన్నో రకాల సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించిన ఈమె మరెన్నో అవార్డులు కూడా అందుకుంది. ముఖ్యంగా తన అద్భుతమైన నటనతో ఆరు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న కరీనాకపూర్.. బాలీవుడ్లో అత్యధిక పారితోషకం తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా చోటు దక్కించుకుంది.
2000 సంవత్సరంలో రెఫ్యూజీ అనే సినిమాతో అరంగేట్రం చేసిన ఈమె.. 2001లో వచ్చిన అశోక అనే హిస్టారికల్ మూవీ లో నటించిన అదే ఏడాది కభీ ఖుషి కభీ గమ్ అనే సినిమాలో నటించి, మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక తర్వాత ఒకే తరహా పాత్రులు చేయడంతో సరైన అవకాశాలు లభించలేదు. 2004 ఏడాది మాత్రం ఈమె కెరియర్లో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఈమె నటించిన చమేలీ, దేవ్ వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఓంకార అనే సినిమాలో ఈమె నటనకు ప్రశంసల వర్షం కురిసింది.
కరీనాకపూర్ వైవాహిక జీవిత విషయానికొస్తే.. సైఫ్ అలీ ఖాన్ ను వివాహం చేసుకుంది. ఒకప్పుడు స్టేజ్ పెర్ఫార్మెన్స్ లు ఇచ్చిన ఈమె ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా మారింది. అంతేకాదు సహా రచయితగా కూడా పనిచేసింది. అంతర్జాతీయ బ్రాండ్ గ్లోబస్ తో కలిసి సొంతంగా ఒక బట్టల బ్రాండ్ ను కూడా ప్రారంభించింది కరీనాకపూర్. అలా ఒకవైపు వ్యాపార రంగంలో మరొకవైపు సినిమా రంగంలో బిజీబిజీగా గడిపేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది కరీనాకపూర్. ఇక ప్రస్తుతం కరీనాకపూర్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
