ఆ నీడలో ఉన్నది మాజీ ప్రియుడా? కన్ఫ్యూజన్‌లో నటి ఫ్యాన్స్!
అయితే ఈ ఫోటో నెట్టింట వైరల్ కాగానే కామెంట్ సెక్షన్‌లో ఊహించని చర్చ మొదలైంది.
By: Sivaji Kontham | 3 Nov 2026 9:50 AM ISTసందర్భం ఏదైనా.. సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు చేసే చిన్న చిన్న పోస్ట్‌లు లేదా విభిన్నమైన ఫోటోలు కొన్నిసార్లు నెటిజన్లను విపరీతంగా కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లు.. అభిమానులు ఒకరిని ఊహించుకుంటే మరొకరు తెరపైకి రావడం చూస్తుంటాం. సరిగ్గా ఇలాంటి విచిత్రమైన కన్ఫ్యూజనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ లేటెస్ట్ పోస్ట్ విషయంలోనూ జరిగింది. బెబో కరీనా షేర్ చేసిన ఒక షేడెడ్ ఫోటోగ్రాఫ్ చూసి అభిమానులు తొలుత తన మాజీ ప్రియుడు అనుకుని ఒక్కసారిగా ఖంగు తిన్నారు. అసలు ఈ పొరపాటు ఎక్కడ జరిగింది? జనాలు ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారు? అనే విషయాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన కోణాలు చర్చకొచ్చాయి.
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ పుట్టినరోజును పురస్కరించుకుని కరీనా కపూర్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ``సామ్రాజ్యానికి ఎప్పటికీ మహారాజు`` అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం `కింగ్` క్రిస్మస్ కానుకగా 24 డిసెంబర్ 2026న విడుదల కానుంది. ఈ చిత్రంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక ప్రత్యేకమైన డాన్స్ సాంగ్‌కు సంబంధించిన `సిల్హౌట్` (నీడ) ఫోటోను కరీనా ఈ పోస్ట్‌లో షేర్ చేసారు.
అయితే ఈ ఫోటో నెట్టింట వైరల్ కాగానే కామెంట్ సెక్షన్‌లో ఊహించని చర్చ మొదలైంది. ఫోటోలోని నీడ రూపం.. హెయిర్ స్టైల్.. అలాగే సైడ్ ప్రొఫైల్ కోణం అచ్చం కరీనా మాజీ సహనటుడు, ప్రియుడు అయిన షాహిద్ కపూర్ లాగా కనిపించడంతో అభిమానులు తీవ్రంగా కన్ఫ్యూజ్ అయ్యారు. షాహిద్ పోలికలు ఆ నీడలో స్పష్టంగా ప్రతిబింబించడంతో మొదట అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆ తర్వాత క్యాప్షన్ చదివి అది షారుఖ్ ఖాన్ అని తెలుసుకున్న నెటిజన్లు ఊపిరి పీల్చుకుని సరదా కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తించారు. లైటింగ్ యాంగిల్ .. నీడ పడిన తీరు కారణంగా షాహిద్‌ను తలపించేలా ఆ పొరపాటు జరిగింది. అలాగే ఖాన్ ఏజ్ తగ్గిస్తూ ఈ పోస్టర్ ని రూపొందించడం వల్ల కూడా షాహద్ అని పొరబడ్డారు.
ఈ పోస్ట్ కింద షారుఖ్ సతీమణి గౌరీ ఖాన్‌తో పాటు లక్షలాది మంది అభిమానులు స్పందిస్తూ వీరి కాంబినేషన్‌పై హర్షం వ్యక్తం చేశారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన `రా వన్` చిత్రంలోని `ఛమ్మక్ ఛల్లో`, `బిల్లు` చిత్రంలోని `మర్జానీ` వంటి సెన్సేషనల్ చార్ట్‌బస్టర్ పాటలను ఫ్యాన్స్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు అలాంటి ఒక ఎనర్జిటిక్ సాంగ్ తెరపై రాబోతోందని సంతోషం వ్యక్తం చేస్తూ ఈ స్టార్ కపుల్‌పై తమ అంచనాలను వెలువరిస్తున్నారు.
2026 చివరిలో విడుదల కానున్న అత్యంత భారీ చిత్రాలలో ఒకటైన `కింగ్` సినిమాకు ఈ పోస్ట్ ద్వారా అద్భుతమైన హైప్ వచ్చింది. సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్, దీపికా పదుకొణె వంటి తారాగణం నటిస్తున్న ఈ చిత్రంలో కరీనా కపూర్ స్పెషల్ అప్పీరియన్స్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. చిన్న కన్ఫ్యూజన్‌తో మొదలైన ఈ సోషల్ మీడియా చర్చ ఇప్పుడు చిత్ర యూనిట్‌కు బిగ్గెస్ట్ ప్రమోషన్‌గా మారి సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసింది.
