Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్ వార‌సుడు ఎంట్రీ!

బాలీవుడ్ భార్యాభ‌ర్త‌లు సైఫ్ అలీఖాన్- క‌రీనా క‌పూర్ వృత్తి-వ్య‌క్తిగ‌త జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది. షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా? ఫ్యామిలీ లైఫ్ కంటూ కొంత స‌మ‌యాన్ని కేటాయిస్తున్నారు.

By:  Srikanth Kontham   |   27 Dec 2025 10:11 AM IST
స్టార్ హీరోయిన్ వార‌సుడు ఎంట్రీ!
X

బాలీవుడ్ భార్యాభ‌ర్త‌లు సైఫ్ అలీఖాన్- క‌రీనా క‌పూర్ వృత్తి-వ్య‌క్తిగ‌త జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది. షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా? ఫ్యామిలీ లైఫ్ కంటూ కొంత స‌మ‌యాన్ని కేటాయిస్తున్నారు. ఈ దంత‌ప‌లుకు ఇద్ద‌రు కుమారులు కూడా ఉన్న సంగ‌తి తెలిసిందే. పెద్ద కుమారుడు తైమూర్ అలీఖాన్. అత‌డి వ‌య‌సు ఎనిమిదేళ్లు. ముంబైలోని టాప్‌ స్కూల్స్‌లో ఒకటైన ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదు వుతున్నాడు. ఇక్క‌డ కేవ‌లం చదువు మాత్ర‌మే కాదు, పిల్లలు అన్ని విధాలుగా ఎదగడానికి సహాయపడే స్కూల్.

క్రీడలు, కళలు వంటి కార్యకలాపాలపై కూడా దృష్టి పెడుతుంది. సెల‌బ్రిటీ పిల్ల‌లంతా ఇక్క‌డే చ‌దువుతున్నారు. తైమూర్‌తో పాటు, తైమూర్ త‌మ్ముడు అబ్ర‌మ్ ఖాన్, ఆరాధ్య బచ్చన్, మిషా కపూర్ (షాహిద్ కపూర్ కుమారుడు), స‌హా ఇతర స్టార్ పిల్లలు చదువుతున్నారు. బాలీవుడ్ లో హీరోయిన్ల‌గా రాణిస్తోన్న చాలా మంది పిల్ల‌లు కూడా స్కూల్లో ఓన‌మాలు నేర్చుకున్నవారే. బాల్యంలోనూ న‌ట‌న‌పై కూడా కొంత బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ త‌ర్వాత పిల్ల‌లు.. త‌ల్లిదండ్రుల ఆస‌క్తిని బ‌ట్టి వారి పిల్ల‌ల‌కు ఏ రంగ‌మైతే బాగుంటుందో? కూడా అంబానీ స్కూల్ ఓ స‌ల‌హా ఇస్తుంది.

ఈ నేప‌థ్యంలో తైమూర్ అలీఖాన్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం వైర‌ల్ అవుతోంది. తైమూరు బాల న‌టుడిగా మ్యాక‌ప్ వేసుకుంటున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకు స్కూల్ ఇచ్చిన ప్రోత్సాహం ఒక ఎత్తైతే? ఆ స‌ల‌హా న‌మ్మి మామ్ క‌రీనా క‌పూర్ కూడా మూవ్ అవుతుంది. అదీ క‌రీనా క‌పూర్ న‌టిస్తోన్న చిత్రంలోనే కావ‌డం మ‌రో విశేషం. ప్ర‌స్తుతం క‌రీనా క‌పూర్ `దైరా` అనే చిత్రంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. ఇందులో బాల న‌టుడి పాత్ర‌కు తైమూర్ ని ఎంపిక చేసిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

మామ్ తో కొన్ని కాంబినేష‌న్స్ ఉన్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. మ‌రి ఈ ప్రచారంలో నిజ‌మెంతో తేలాల్సి ఉంది. `దైరా` చిత్రాన్ని మేఘనా గుల్జార్ క్రైమ్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తున్నారు. నేరం, శిక్ష‌, న్యాయం అంశాల‌తో పాటు కొన్ని వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా తెర‌కెక‌క్కిస్తున్నారు. ఇందులో మ‌ల‌యాళ‌ న‌టుడు పృధ్వీరాజ్ సుకుమార‌న్ పోలీస్ ఆఫీసర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. అత‌డికి జోడీగా క‌రీనాక‌పూర్ న‌టిస్తుంది. మ‌రి ఈ సినిమాలో తైమూర్ ప్ర‌త్యేక‌త ఏంటి? అన్న‌ది తేలాల్సి ఉంది. ఈ మ‌ధ్య కాలంలో స్టార్ కిడ్స్ ను చాలా మంది సెల‌బ్రిటీలు

సినిమాల‌కు దూరంగా ఉంచుతున్నారు. చ‌దువు అనంత‌ర‌మే ఈ రంగంవైపు వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.కానీ సైఫ్ అలీఖాన్-క‌రీనా క‌పూర్ మాత్రం అందుకు భిన్నంగా ఇప్ప‌టి నుంచే తైమూర్ కెరీర్ ని ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.