Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

భారతదేశంలో మొట్టమొదటి సైజ్ జీరో బ్యూటీ ఎవరు? అంటే కచ్చితంగా బెబో కరీనా కపూర్ పేరునే సూచిస్తారు అభిమానులు.

By:  Sivaji Kontham   |   2 Nov 2026 7:22 PM IST
ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!
X

భారతదేశంలో మొట్టమొదటి సైజ్ జీరో బ్యూటీ ఎవరు? అంటే కచ్చితంగా బెబో కరీనా కపూర్ పేరునే సూచిస్తారు అభిమానులు. ఫ్యాష‌న్ ప్ర‌పంచాన్ని త‌న ఎరాలో ఏలారు క‌రీనా. స్టైల్ ఐకాన్ లేదా ఫ్యాషన్ ఐకాన్ అనే బిరుదుకు ప్రతిరూపంగా నిలిచిన‌ కరీనా.. మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా కొత్తదనాన్ని పరిచయం చేయడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. పెళ్లయి ఇద్ద‌రు కిడ్స్‌కి జ‌న్మ‌నిచ్చాక కూడా సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ నవతారానికి గట్టి పోటీనిస్తూ.. ఫ్యాషన్ రంగంలో గేమ్ ఛేంజర్‌గా నేటిత‌రం భామ‌ల‌కు సవాల్ విసురుతున్న ఈ బ్యూటీ తాజాగా షేర్ చేసిన ఫోటోషూట్ నెట్టింట తెగ వైరలవుతోంది.




ఈ తాజా లుక్‌లో కరీనా కపూర్ ఖాన్ తన రాయల్ లుక్‌తో ఫ్యాషన్ ప్రియులను ఫిదా చేస్తున్నారు. ప్రఖ్యాత‌ సెలబ్రిటీ స్టైలిస్ట్ లక్ష్మీ ల్యాహర్ రూపొందించిన ఈ లుక్.. క్లాసిక్ సబ్యసాచి డిజైన్‌కు ఆధునిక హై-ఫ్యాషన్ ట‌చ్‌ని జోడించి అద్భుతంగా నిలిచింది. సబ్యసాచి బ్రాండ్ ప్యాటర్న్‌ సిల్క్ షర్ట్, వైడ్-లెగ్ ట్రౌజర్స్, సిగ్నేచర్ బెల్ట్ - ఎలైట్ జ్యువెలరీ కాంబినేషన్‌లో రాజసం ఉట్టిపడేలా క‌రీనా కనిపించారు.




ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్టుగా ఎంచుకున్న యాక్సెసరీస్ లుక్‌ను మరింత హైలైట్ చేశాయి. సబ్యసాచి డ్రెస్‌కి సరిపోయేలా హీల్స్‌ను ఎంపిక చేశారు. ఆ మినిమల్ మేకప్ టచ్ కరీనా సహజమైన సౌందర్యాన్ని రెట్టింపు చేశాయి.




ఫొటోగ్రాఫర్ సారంగ్ గుప్తా కెమెరాలో బంధించిన ఈ ఫొటోలు.. బాలీవుడ్‌లో కరీనా ఎందుకు ఎప్పటికీ చెక్కుచెదరని ఫ్యాషన్ ఐకాన్‌గా నిలుస్తుందో మరోసారి రుజువు చేస్తున్నాయి. ఈ కొత్త‌ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ ఫోటోగ్రాఫ్స్ చూడ‌గానే బెబో కిల్లింగ్.. బెబో స్ట్రైక్స్ ఎగైన్! అంటూ అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఈ ఫోటోషూట్ ని వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు.

మరోవైపు ఫ్యాషన్ ట్రెండ్స్‌తో పాటు బుల్లితెరపై కూడా కరీనా తన హవా కొనసాగిస్తున్నారు. కరీనా కపూర్ -సైఫ్ అలీ ఖాన్ జంట పాపుల‌ర్ టాక్ షో `కాఫీ విత్ కరణ్ సీజ‌న్ 9` గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ``నేనే నంబర్ వన్ స్టార్`` అంటూ కరీనా కాన్ఫిడెంట్ కామెంట్స్.. సైఫ్ సమయస్ఫూర్తి.. ఫన్నీ బజర్ గేమ్‌లతో నిండిన ఈ ప్రత్యేక ఎపిసోడ్ ఈ బుధవారం జియో హాట్‌స్టార్‌ లోని ది పీకాక హ‌బ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.