Begin typing your search above and press return to search.

మన చాంపియన్ తో కరీనా.. స్టన్నింగ్ గ్లామర్ ట్రీట్!

బాలీవుడ్ స్టార్ నటి కరీనా కపూర్ ఖాన్ ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉండేలా తన ఫ్యాషన్ సెలెక్షన్లతో ఆకట్టుకుంటుంది.

By:  M Prashanth   |   4 Aug 2025 9:00 PM IST
Kareena Kapoor Glamorous Gym Look with PV Sindhu
X

బాలీవుడ్ స్టార్ నటి కరీనా కపూర్ ఖాన్ ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉండేలా తన ఫ్యాషన్ సెలెక్షన్లతో ఆకట్టుకుంటుంది. తాజాగా ఆమె జిమ్ లుక్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. వర్కౌట్ కోసం తీర్చిదిద్దిన స్టైలిష్ అథ్లెజర్ లుక్‌లో కరీనా అటు ఫిట్‌నెస్ విషయంలోనూ, ఇటు గ్లామర్ పరంగానూ మెరిసిపోతూ కనిపించింది. మరింత ఆసక్తికరంగా.. ఆమెతో కలిసి షాట్‌లో బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా ఉన్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.


ఫోటోలలో కరీనా వైన్మెంట్ కలర్ బాడీకాన్ లెగింగ్స్, స్టైలిష్ స్పోర్ట్స్ బ్రాతో యాక్టివ్‌వేర్‌ను కాస్త గ్లామర్ టచ్‌లో చూపించింది. మరో అవుట్ ఫిట్‌లో మెరూన్ టోన్ స్పోర్ట్స్ సెట్‌లోనూ మెరిసింది. స్పోర్ట్స్ షూస్, హైసోక్స్ కలయికలో ఆమె లుక్ యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇట్స్ జిమ్ క్లాస్, టుడే అండ్ ఎవరిడే.. అని క్యాప్షన్ కూడా పెట్టింది.


ఇవి ఫిట్‌నెస్‌పై ఆమె ఆసక్తిని తెలియజేస్తున్నాయనడంలో సందేహం లేదు. కరీనా తన వయస్సులోనూ ఫిట్‌గా ఉండటం, అందాన్ని ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయడం ఇదే కాదు మొదటిసారి కాదు. కరీనా కెరీర్ విషయానికి వస్తే.. 2000లో రెఫ్యూజీ సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ, తన నటనతో ఎన్నో హిట్ సినిమాలు అందించింది. జబ వి మెట్, తషన్, త్రీ ఇడియట్స్, బజరంగీ భాయిజాన్, ఉడ్తా పంజాబ్, గుడ్ న్యూస్, లాల్ సింగ్ ఛడ్డా వంటి చిత్రాల్లో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి.

స్టార్ హీరోలతో పాటు కంటెంట్ ఆధారిత పాత్రలను కూడా చేసి తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే, గ్లామర్‌కి తగ్గట్టే పర్ఫామెన్స్ చూపించగలిగే తక్కువమంది నటీమణుల్లో కరీనా ఒకరు. తాజాగా ఆమె ఓపెన్‌గా సోషలైఫ్, వర్క్‌లైఫ్ బ్యాలెన్స్ పై ఫోకస్ చేస్తూ, తన ఫిట్‌నెస్ షెడ్యూల్‌ను అందరితో షేర్ చేస్తూ మరింతగా మోటివేట్ చేస్తోంది. గతంలో ప్రసవాల అనంతరం బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్‌తో ఆమె అందించిన మెసేజ్ ఎంతో మందికి ప్రేరణగా మారింది. ఇక ఇప్పుడు జిమ్ లుక్ ఫోటోలతో మళ్లీ చర్చలోకి వచ్చింది.