కరీనా కపూర్ మూడవసారి తల్లి కాబోతుందా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ మళ్లీ వార్తల్లో నిలిచారు. పటౌడీ నవాబ్ సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకున్న ఈ భామకు ఇప్పటికే తైమూర్, జేహ్ అనే ఇద్దరు ముద్దుల కుమారులు ఉన్నారు.
By: Madhu Reddy | 21 Aug 2026 8:20 PM ISTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ మళ్లీ వార్తల్లో నిలిచారు. పటౌడీ నవాబ్ సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకున్న ఈ భామకు ఇప్పటికే తైమూర్, జేహ్ అనే ఇద్దరు ముద్దుల కుమారులు ఉన్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో వల్ల కరీనా మూడోసారి తల్లి కాబోతోందా? అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. నెటిజన్లు రకరకాల కామెంట్లతో ఈ వార్తను ట్రెండ్ చేస్తుండటంతో దీనిపై అసలు నిజం ఏంటో తెలుసుకోవాలనే కుతూహలం అందరిలోనూ నెలకొంది. అదేమిటో మనము తెలుసుకుందాం..
వైరల్ వీడియో.. నెటిజన్ల అనుమానాలు:
కరీనా కపూర్ తన టీమ్‌తో కలిసి కారు వైపు వెళ్తున్న సమయంలో తీసిన ఒక వీడియో నెట్టింట బాగా వైరల్ అయ్యింది. ఆ సమయంలో ఆమె టీమ్ సభ్యుడొకరు గొడుగుతో కెమెరాలకు అడ్డుగా నిలబడటం, కరీనా పొట్ట భాగం కాస్త ముందుకు వచ్చినట్లు కనిపించడంతో నెటిజన్లకు అనుమానం వచ్చింది. దీంతో "కరీనా మళ్లీ తల్లి కాబోతోందా?", "మూడో బాబు రాబోతున్నాడా?" అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించడం మొదలుపెట్టారు.
అసలు నిజం తేల్చేసిన కరీనా టీమ్:
ఈ ప్రచారం బాగా ఎక్కువ కావడంతో కరీనా కపూర్ టీమ్ స్పందించి అసలు విషయాన్ని స్పష్టం చేసింది. ఈ రూమర్లలో ఎంతమాత్రం నిజం లేదని, కరీనా గర్భవతి కాదని తేల్చి చెప్పారు. ఇటీవలే కుటుంబంతో కలిసి వెకేషన్‌కు వెళ్లొచ్చిన కరీనా.. అక్కడ తీసుకున్న ఫుడ్ మరియు కెమెరా యాంగిల్ సరిగ్గా లేకపోవడం వల్లే అలా కనిపించిందని, అంతకుమించి ఏమీ లేదని సన్నిహిత వర్గాలు సరదాగా వివరణ ఇచ్చాయి.
సైఫ్ బర్త్‌డే వేడుకలు..:
ఇటీవలే ఆగస్టు 16న సైఫ్ అలీ ఖాన్ 56వ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ దంపతులు తమ పిల్లలతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లారు. అక్కడ దిగిన ఫోటోలను కూడా కరీనా షేర్ చేశారు. ఇక సైఫ్‌కు తన మొదటి భార్య అమృతా సింగ్ ద్వారా సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ అనే పిల్లలు కూడా ఉన్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ప్రెగ్నెన్సీ రూమర్లకు చెక్ పడటంతో కరీనా కపూర్ తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టారు. మేఘనా గుల్జార్ దర్శకత్వంలో రాబోతున్న క్రిమి డ్రామా ‘దాయరా’తో పాటు, పి.ఎస్. మిథ్రన్ దర్శకత్వంలో ధనుష్ సరసన ఒక పౌరాణిక అడ్వెంచర్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి వార్తలు ఎలా వచ్చినా, కరీనా నయా లైనప్‌తో రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం ఖాయం..
