Begin typing your search above and press return to search.

ట్రెండీ లుక్‌లో కరీనా కపూర్.. ఆరెంజ్ అవుట్‌ఫిట్‌లో మెరుపులు!

బాలీవుడ్ స్టైలిష్ స్టార్ కరీనా కపూర్ ఖాన్ మరోసారి తన అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌తో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించారు.

By:  Madhu Reddy   |   21 Oct 2026 7:30 PM IST
ట్రెండీ లుక్‌లో కరీనా కపూర్.. ఆరెంజ్ అవుట్‌ఫిట్‌లో మెరుపులు!
X

బాలీవుడ్ స్టైలిష్ స్టార్ కరీనా కపూర్ ఖాన్ మరోసారి తన అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌తో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రముఖ సెలబ్రిటీ స్టైలిస్ట్ తన్యా ఘవ్రీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన కరీనా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. పాపులర్ ఫుట్‌వేర్ బ్రాండ్ 'ఫిజ్జీ గ్లాబ్లెట్' కోసం బెబో చేసిన ఈ గ్లామరస్ ఫోటో షూట్ విశేషాలు ఇప్పుడు చూద్దాం..




దేవనాగరి లేబుల్.. ఆరెంజ్ కుర్తా సెట్:

ఈ ఫొటోషూట్‌లో కరీనా ధరించిన డ్రెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ ఇండియన్ లగ్జరీ లేబుల్ 'దేవనాగరి'కి చెందిన 'తారా రస్ట్ ఆరెంజ్ కుర్తా సెట్'లో ఆమె రాజసంగా మెరిసిపోయారు. ఈ ట్రెడిషనల్ అటైర్‌కు తగినట్లుగా ఫిజ్జీ గ్లాబ్లెట్ బ్రాండ్‌కు చెందిన ఎంబెల్లీష్డ్ ట్రెడిషనల్ జుత్తీస్, హీల్స్‌ను ధరించి పర్ఫెక్ట్ లుక్‌ను క్రియేట్ చేశారు.ఇక సెలబ్రిటీ స్టైలిస్ట్ తన్యా ఘవ్రీ ఈ అద్భుతమైన లుక్‌ను క్యూరేట్ చేయడం విశేషం.




బ్రాండ్‌లో వ్యూహాత్మక ఇన్వెస్టర్‌గా కరీనా:

ఇది కేవలం సాధారణ ప్రమోషనల్ క్యాంపెయిన్ మాత్రమే కాదు. కరీనా కపూర్ కేవలం మోడల్‌గా మాత్రమే కాకుండా, ఆ ఫుట్‌వేర్ బ్రాండ్‌లో ఒక స్ట్రాటజిక్ ఇన్వెస్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక ట్రెడిషనల్ ఇండియన్ ఫుట్‌వేర్ కాన్సెప్ట్‌లకు కంటెంపరరీ టచ్ ఇస్తూ ఈ బ్రాండ్ ప్రమోషన్స్‌లో కరీనా పాల్గొంటున్నారు. ఆమె గ్రేస్, స్టైల్ ఈ బ్రాండ్‌కు మరింత వాల్యూను తెచ్చిపెడుతున్నాయి.




అంచలంచెలుగా ఎదుగుతూ.. పవర్‌హౌస్‌గా మారిన బెబో:

ఇక 'రెఫ్యూజీ' చిత్రంతో నటిగా అరంగేట్రం చేసిన కరీనా.. 'కభీ ఖుషీ కభీ గ్హం', 'జబ్ వి మెట్', '3 ఇడియట్స్', 'వీరే ది వెడ్డింగ్', 'క్రూ' వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్లతో స్టార్ హీరోయిన్‌గా నిలదొక్కుకున్నారు. ఇక ఇటీవల మేఘనా గుల్జార్ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కలిసి నటించిన ఇన్వెస్టిగేటివ్ డ్రామా 'డైరా' చిత్రంలో ఒక కాంప్లెక్స్ పోలీస్ ఆఫీసర్‌గా నటించి ప్రశంసలు అందుకున్నారు. ఇక త్వరలోనే షారుఖ్ ఖాన్ 'కింగ్' మూవీలోనూ ఆమె కనిపించనున్నారు.

ఇక మొత్తానికి చూస్తే, అటు వెండితెరపై విభిన్న పాత్రలతో అలరిస్తూనే, ఇటు ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన శైలిని ప్రదర్శిస్తున్న కరీనా కపూర్ ట్రెండ్‌సెట్టర్‌గా దూసుకెళ్తున్నారు. ఇక ఈ ఆరెంజ్ కుర్తా సెట్ లుక్ ఫ్యాషన్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.