స్టార్‌డమ్‌పై కరీనా షాకింగ్ స్టేట్మెంట్!
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న కరీనా కపూర్ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి దేశ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది స్టార్ హీరోయిన్ అనిపించుకుంది.
By: Ravindar Gorantla | 1 April 2026 11:00 PM ISTబాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న కరీనా కపూర్ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి దేశ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. గత కొంత కాలంగా సెలెక్టీవ్‌గా సినిమాలు చేస్తున్న కరీనా తాజాగా ది ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్టార్ డమ్‌పై కరీనా షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చి షాక్ ఇచ్చారు. స్టార్స్ వసూళ్లని రాబట్టలేకపోతే మనం రచయితలపై దృష్టి పెట్టాలి. సరికొత్త వినూత్నమైన ఆలోచనల కోసం అన్వేషించాలి` అంటూ బాంబ్ పేల్చారు.
మోడ్రన్ సినిమాలో బాక్సాఫీస్ వసూళ్లని తెచ్చి పెట్టేది కేవలం స్టార్ పేరు మాత్రమే కాదని, బలమైన కథ, అందుకు తగిన కంటెంట్ అని పేర్కొన్నారు. 5 కోట్ల మంది ఫాలోవర్స్ ఉండటం సక్సెస్‌కు హామీని ఇవ్వలేదని, ఇప్పుడు స్టార్‌డమ్ నుంచి రచయితలు, ప్రతిభ, ప్రాముఖ్యతవైపు అందరి దృష్టి మళ్లుతోందన్నారు. అంతే కాకుండా స్టార్స్, స్టార్‌డమ్ గురించి కరీనా షాకింగ్ విషయాలని ఈ సందర్భంగా బయటపెట్టడం గమనార్హం.
నా దృష్టిలో నో స్టార్స్...
ఈ రోజుల్లో నా దృష్టిలో స్టార్స్ అనే వాళ్లు లేరు. ఉన్నది అంతా యాక్టర్లే. స్టార్ పవర్ ఇకపై బ్లాక్ బస్టర్‌లకు హామీ ఇవ్వలేదని కుండబద్దలు కొట్టారు. అంటే కథకు ప్రాధాన్యనిచ్చే సినిమాలకే ప్రేక్షకులు బాక్సాఫీస్ వద్ద పట్టం కడుతున్నారు. అందులో స్టార్స్ ఉన్నారా? లేరా అని చూడటం లేదు. కథబలమున్న సినిమాలే బాక్సాఫీస్ వద్ద ఆడుతున్నాయి. కోట్లు కొల్లగొడుతున్నాయి. రీసెంట్‌గా విడుదలైన సినిమాలే ఇందుకు చక్కని ఉదాహరణ. ఎలాంటి అంచనాలు లేకుండా కంటెంటే హీరోగా విడుదలై సంచలనం సృష్టిస్తున్న మూవీ `ధురంధర్`, ధురంధర్ 2`.
కరీనా మరిన్ని విశేషాలు ఈ సందర్భంగా పంచుకున్నారు. సోషల్ మీడియాలో స్టార్లకు ఉండే ప్రజాదారణ, పాపులారిటీ బాక్సాఫీస్ విజయంగా మారదని, స్టార్‌డమ్ కంటే ఆసక్తికర కథలు, అబ్బుర పరిచే స్క్రిప్ట్‌లకే ప్రాధాన్యత ఉంటుందని కరీనా కపూర్ బలంగా వాదిస్తున్నారు. కరీనాకు ఇప్పుడు 45 ఏళ్లు. ఈ వయసులో మహిళా ప్రధాన కంటెంట్ నేపథ్యంలో రూపొందిన `క్రూ` మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా వంద కోట్లకు పైనే ఈ సినిమాతో రాబట్టి ఔరా అనిపించారు.
ఇండస్ట్రీలో బంధుప్రీతి...
ఈ సందర్భంగా కరీనా కపూర్ మరో ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేశారు. ఇకపై తన స్టార్ డమ్‌తో కాకుండా తాను నటించే పాత్రలతో, తన ప్రతిభతో గుర్తింని పొందాలనుకుంటున్నట్టుగా వివరించారు. ఇండస్ట్రీలో బంధుప్రీతి ఒక్క సినిమా అవకాశాన్ని అందించగలదు కానీ కఠోర శ్రమ, ప్రతిభ, ప్రేక్షకుల ఆమోదం మాత్రమే కెరీర్‌ను డిసైడ్ చేస్తాయని తాను నమ్ముతున్నానని తెలిపారు. కరీనా స్టార్‌డమ్‌పై ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
