కరీనాకపూర్ తాగే లీటర్ వాటర్ బాటిల్ ధర తెలిస్తే షాక్!
సాధారణంగా మనమందరం దాహం వేస్తే రూ.20 పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కుని తాగుతాం.
By: Madhu Reddy | 26 Oct 2026 1:41 PM ISTసాధారణంగా మనమందరం దాహం వేస్తే రూ.20 పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కుని తాగుతాం. కానీ సెలబ్రిటీలు, ధనవంతుల రేంజే వేరు.. బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఖాన్ కుటుంబంలో నెలకు అయ్యే ఖర్చుల్లో ఏకంగా 85 శాతం వాటా వాటర్ బాటిళ్లకే సరిపోతుందని సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. వారానికి ఆరుసార్లు ఆమె ప్రత్యేకమైన జపాన్ వాటర్ బాటిళ్లను కొనుగోలు చేస్తారట. ఆ లగ్జరీ వాటర్ బాటిల్ ధర, విశేషాలు ఇప్పుడు చూద్దాం.
ఏమిటీ 'ఫిలికో జ్యువెలరీ వాటర్'?:
కరీనా కపూర్ ఇంటికి వచ్చే ఈ విలాసవంతమైన నీటిని 'ఫిలికో జ్యువెలరీ వాటర్' అని పిలుస్తారు. జపాన్‌కు చెందిన ఈ వాటర్ బాటిల్ ధర తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.. కేవలం ఒక లీటర్ వాటర్ బాటిల్ ధర సుమారు రూ. 8,000 నుండి రూ. 10,000 వరకు ఉంటుంది. మన దగ్గర లభించే సాధారణ నీటితో పోలిస్తే ఇది అత్యంత ఖరీదైన డ్రింక్ అని చెప్పవచ్చు.
ఇంత ఖరీదు ఎందుకు? దీని ప్రత్యేకత ఏంటి:
ఈ నీరు ఇంత ఖరీదైనది కావడానికి ప్రధాన కారణం దాని తయారీ విధానం మరియు డిజైన్. జపాన్‌లోని కోబ్‌లో ఉన్న ప్రసిద్ధ 'నునోబికి' సహజ మైదానాల నుండి సేకరించే అత్యంత స్వచ్ఛమైన మినరల్ వాటర్‌ను ఈ బాటిళ్లలో నింపుతారు. అంతకంటే ముఖ్యంగా, ఈ బాటిళ్లను కిరీటాలు, ఖరీదైన క్రిస్టల్స్‌తో రాజసం ఉట్టిపడేలా పూర్తిగా చేతితోనే తయారు చేస్తారు. పరిమిత ఉత్పత్తి కావడం వల్ల నెలకు కేవలం 5,000 బాటిళ్లు మాత్రమే ఉత్పత్తి చేస్తారు.
సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన క్లెయిమ్:
సాధారణ ప్రజలు దాహం తీర్చుకోవడానికి నీళ్లు తాగితే, ఉన్నత వర్గాలు తమ హోదాను చాటుకోవడానికి ఇలాంటి విలాసవంతమైన డ్రింక్స్ తాగుతారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక కరీనా కపూర్ ఫ్యామిలీ నెలకు ఈ వాటర్ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తుందనే క్లెయిమ్‌పై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి.
వరుస క్రేజీ ప్రాజెక్టులతో కరీనా బిజీ:
ఇక సినిమాల విషయానికి వస్తే కరీనా కపూర్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మేఘనా గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'దాయిరా' సెప్టెంబర్ 18, 2026న థియేటర్లలో విడుదలైంది. అలాగే సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో సౌత్ సూపర్ స్టార్ ధనుష్‌తో కలిసి కరీనా ఒక భారీ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇక వీటితో పాటు సూపర్ హిట్ మూవీ సీక్వెల్ 'వీరే ది వెడ్డింగ్ 2' కూడా శశాంక ఘోష్ దర్శకత్వంలో పట్టాలెక్కనుంది.
ఇక మొత్తానికి చూస్తే, అటు నటిగా విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూనే, ఇటు లగ్జరీ లైఫ్‌స్టైల్‌తో వార్తల్లో నిలుస్తున్నారు కరీనా కపూర్. ఒక లీటర్ వాటర్ బాటిల్ ధర రూ. 10 వేలు అంటే సామాన్యులకు ఊహకందని విషయమే అయినా, సెలబ్రిటీల రాయల్ లైఫ్‌కు ఇది ఒక ఉదాహరణగా నిలుస్తోంది.
