Begin typing your search above and press return to search.

బ్లాక్ డ్రెస్ లో ఆకట్టుకుంటున్న కరీనాకపూర్!

తాజాగా బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చిన కరీనాకపూర్.. అందులో తన అందాలను హైలైట్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

By:  Madhu Reddy   |   10 Oct 2025 1:41 PM IST
బ్లాక్ డ్రెస్ లో ఆకట్టుకుంటున్న కరీనాకపూర్!
X

కరీనాకపూర్.. అద్భుతమైన నటనతోనే కాదు అంతకుమించి గ్లామర్ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న కరీనాకపూర్ తాజాగా మరోసారి ట్రెండీ అవుట్ ఫిట్ లో కనిపించి, అందరి దృష్టిని ఆకట్టుకుంది. తాజాగా బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చిన కరీనాకపూర్.. అందులో తన అందాలను హైలైట్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

కరీనాకపూర్ కెరీర్ విషయానికి వస్తే.. 1980లో ప్రముఖ నటుడు రణధీర్ కపూర్, బబిత దంపతులకు ముంబై, మహారాష్ట్రలో జన్మించింది. ఈమె చెల్లెలు ఎవరో కాదు ప్రముఖ హీరోయిన్ కరిష్మా కపూర్. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న కరీనాకపూర్.. 2000 సంవత్సరంలో వచ్చిన హిందీ సినిమా రెఫ్యూజీ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 2001లో చారిత్రాత్మక చిత్రం అశోకలో కూడా నటించింది. కానీ అదే ఏడాది వచ్చిన కభీ ఖుషి కభీ ఘమ్ అనే సినిమాలో నటించి, మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో కరీనాకపూర్ కి కూడా మంచి క్రేజ్ లభించింది.

అయితే ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించడంతో ఆ తర్వాత అన్నీ కూడా ఒకేలాంటి పాత్రలు చేసింది. దీంతో కొన్ని చిత్రాలు పెద్దగా ఆడలేదు. ఫలితంగా విమర్శలు కూడా ఎదుర్కొంది. అయితే 2004 సంవత్సరం ఈమె కెరీర్ కు మైల్స్టోన్ అనే చెప్పుకోవాలి. ఆ ఏడాది వచ్చిన చమేలీ, దేవ్ వంటి చిత్రాలు ఈమెకు మంచి విజయాన్ని అందించాయి. ఈ సినిమాలతో పాటు ఓంకార అనే చిత్రంలో ఈమె తన నటనతో అందరినీ అబ్బురపరిచింది. దీంతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

ఇకపోతే కరీనా కపూర్ నటి మాత్రమే కాదు సహా రచయిత కూడా. హీరోయిన్ గా స్టేజ్ పెర్ఫార్మర్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె.. మూడు పుస్తకాలకు సహా రచయితగా పనిచేసింది. అందులో ఒకటి తన జీవిత చరిత్ర కాగా.. మరో రెండు పోషక విలువలకు సంబంధించిన పుస్తకాలకు ఆమె సహరచయితగా పనిచేశారు. అంతర్జాతీయ బ్రాండ్ గ్లోబల్స్ తో కలిసి సొంతంగా ఒక బట్టల బ్రాండ్ ను కూడా ప్రారంభించింది కరీనాకపూర్.

కరీనాకపూర్ ఎక్కువగా హిందీలోనే సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయిపోయింది. ఈమె ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ను ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పటికే సైఫ్ అలీఖాన్ కి అమృత సింగ్ తో వివాహం జరిగి , ఇద్దరు పిల్లలు జన్మించిన తర్వాత ఆయన విడాకులు తీసుకున్నారు 2012లో కరీనాకపూర్ ను వివాహం చేసుకున్నారు.