ఐ ప్యాచెస్ తో కరీనా కపూర్.. ప్రమోషనా లేక?
ప్రస్తుత కాలంలో హీరో హీరోయిన్స్ సినిమాల ద్వారానే కాకుండా పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తూ భారీగా ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు.
By: Madhu Reddy | 7 Oct 2025 1:39 PM ISTప్రస్తుత కాలంలో హీరో హీరోయిన్స్ సినిమాల ద్వారానే కాకుండా పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తూ భారీగా ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఇంకొంతమంది బ్రాండ్ ప్రమోటర్స్ గా మారి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు ఈ బ్రాండ్ ప్రమోషన్స్ లో భాగంగా సెలబ్రిటీలు చేసే పనులు అటు అభిమానులను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న కరీనాకపూర్ చేసిన ఒక పని అభిమానులలో పలు రకాల ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ఒకవైపు సినిమాలు మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరించే కరీనా కపూర్.. తాజాగా ఐ ప్యాచెస్ పెట్టుకుని పలు రకాల ఫోటోలు షేర్ చేసింది. అయితే ఇందులో ఆ ఐ ప్యాచెస్ కూడా రకరకాలు ఉండడం గమనార్హం. దీంతో ఇది చూసిన నెటిజన్స్ ఆమె కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ వచ్చాయా? లేక ప్రమోషన్స్ చేస్తోందా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే క్వెంచ్ & కరీనాకపూర్ ఖాన్ లిమిటెడ్ (ఎడిషన్ ఐ ప్యాచెస్) లో సహ యజమానిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఇటీవల కరీనా కపూర్ తన పుట్టినరోజు (సెప్టెంబర్ 21) వేడుకను ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా క్వెంచ్ అనే చర్మ సంరక్షణ బ్రాండ్ ద్వారా విడుదల చేసిన పరిమిత ఎడిషన్ ఉత్పత్తులను ఆమె తన కంటి కింద ప్యాచ్ గా పెట్టుకొని వాటిని మార్కెట్లోకి విడుదల చేసింది. ముఖ్యంగా కరీనాకపూర్ తన పుట్టినరోజును జరుపుకోవడమే కాకుండా. ఆమెకు ఒక ప్రత్యేకమైన బహుమతిగా కూడా క్వెంచ్ సంస్థ వీటిని అందించింది. పైగా ఇవి మెడికల్ గ్రేడ్ సిలికాన్ తో తయారు చేయబడ్డాయి. తన సంస్థ ప్రమోషన్స్ లో భాగంగానే ఇప్పుడు మరొకసారి తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఇలా పలు రకాల ఐ ప్యాచెస్ ను ధరించి.. విభిన్నమైన ఫోటోలను షేర్ చేసింది కరీనాకపూర్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
కరీనాకపూర్ విషయానికి వస్తే.. ప్రముఖ బాలీవుడ్ నటులు రణధీర్ కపూర్ , బబితల కుమార్తె.. కరీనాకపూర్ కి కరిష్మా కపూర్ అనే చెల్లెలు కూడా ఉంది. రొమాంటిక్, కామెడీ మూవీ నుంచి క్రైమ్ డ్రామాల వరకు ఎన్నో రకాల సినిమాలు చేసి ఆడియన్స్ మెప్పించింది కరీనాకపూర్. ముఖ్యంగా తన నటనతో ఎన్నో అవార్డులు అందుకున్న ఈమె, అందులో 6 ఫిలింఫేర్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. అంతేకాదు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్గా కూడా పేరు సొంతం చేసుకుంది కరీనాకపూర్. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె 2000 సంవత్సరంలో రెఫ్యూజీ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత 2001లో చారిత్రాత్మక చిత్రం అశోకలో కూడా నటించింది. ఇక అదే ఏడాది ఆమె నటించిన కభీ ఖుషి కభీ ఘమ్ అనే సినిమాతో భారీ పాపులారిటీ అందుకుని కమర్షియల్ సక్సెస్ కూడా సొంతం చేసుకుంది.
