ఆ హీరోయిన్ దృష్టిలో తమ్ముడే అత్యుత్తమ నటుడు!
బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో కపూర్ ఖాన్దాన్ వారసత్వానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
By: Srikanth Kontham | 24 March 2026 6:00 PM ISTబాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో కపూర్ ఖాన్దాన్ వారసత్వానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తరతరాలుగా నటననే శ్వాసగా కుటుంబం కొనసాగుతోంది. కపూర్ వారసుల్లో? కరీనా కపూర్ ఖాన్, రణబీర్ కపూర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు వరుసగా అక్కా-తమ్ముడు. ఇద్దరు కలిసి సినిమాలు చేయడం సంగతి అటుంచితే? తమ్ముడంటే? కరీనాకి ఎంత ఇష్టమంటే? ఆమె మాటల్లోనే అర్దమవుతుంది. కరీనా కపూర్ దృష్టిలో తన తమ్ముడు రణబీర్ కపూర్ మాత్రమే అత్యుత్తమ నటుడుగా పేర్కొంది. తన తమ్ముడి నటనపై ప్రశంసల వర్షం కురిపించడం ఇదేం తొలిసారి కాదు.
కాకపోతే ఈసారి అతడొక్కడే గొప్ప నటుడు అన్నట్లు వ్యాఖ్యానించింది. రణబీర్ కపూర్ ని మించిన నటుడు ప్రస్తుత తరం బాలీవుడ్‌లో లేడని మరోసారి బాహాటంగా ప్రకటించింది. నటీనటుల మధ్య పోటీ ఉండటం సహజం. కానీ కరీనా విషయంలో అది వేరు. రణబీర్ కపూర్ కెరీర్ ప్రారంభంలో `సావరియా` వంటి పరాజయాలను చవిచూసినా? `రాక్ స్టార్`, `బర్ఫీ`, `సంజు` వంటి చిత్రాలతో తన నటనా విశ్వరూపాన్ని చూపించినప్పుడు కరీనా ఎంతో గర్వపడింది. రణబీర్ కేవలం ఒక స్టార్ మాత్రమే కాదు. అతడు ఒక గొప్ప కళాకారుడు అని పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. తన కుటుంబానికి చెందిన వాడనే కాకుండా, ఒక సహ నటిగా కూడా రణబీర్ నటనలోని పరిణతిని ఆమె ఎప్పుడూ గౌరవిస్తుంది.
రణబీర్ కపూర్ పాత్రల ఎంపిక ఆ పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసే విధానం కరీనాను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా యానిమల్ వంటి చిత్రాల్లో రణబీర్ నటనకు కరీనా ఫిదా అయిపోయింది. బాలీవుడ్‌లో అగ్ర హీరోలు ఎందరో ఉన్నప్పటికీ రణబీర్ పోషించే వైవిధ్యమైన పాత్రలు , ఎమోషనల్ పర్ఫార్మెన్స్ అతడిని అందరికంటే ముందు వరుసలో నిలబెడుతుందని కరీనా నమ్మకం. అందుకే ఆమె ఎప్పుడూ రణబీర్‌ను ఒక అల్టిమేట్ యాక్టర్ గా కీర్తిస్తుంది. వృత్తిపరంగా రణబీర్ సాధిస్తున్న విజయాలు కరీనాకు ఎంతో ఉత్సాహాన్నిస్తాయి.
కపూర్ కుటుంబం నుంచి వచ్చిన వారసుల్లో రణబీర్ తన తాత రాజ్ కపూర్ వారసత్వాన్ని సరైన రీతిలో ముందుకు తీసుకెళ్తున్నాడని ఆమె భావిస్తుంది. అందుకే తన దృష్టిలో నంబర్ వన్ నటుడు ఎవరైనా ఉన్నారంటే అది రణబీర్ మాత్రమేనని ఆమె నిర్మొహమాటంగా చెబుతుంది. ఈ అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న అనుబంధం కేవలం వ్యక్తిగతమే కాకుండా, ఒకరి నటనపై మరొకరికి ఉన్న అపారమైన గౌరవం వారిని మరింత దగ్గర చేస్తుంది. కరీనా కపూర్ లాంటి సీనియర్ నటి ఒక నటుడిని అత్యుత్తమమైన వాడు అని సర్టిఫై చేసిందంటే, రణబీర్ కపూర్ ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
