Begin typing your search above and press return to search.

రిలీజ్‌కి రెండు రోజులే.. అయినా సందడి ఏది?

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన 'దాయారా' విడుదలకు సిద్ధం అయింది.

By:  Ramesh Palla   |   15 Sept 2026 1:02 PM IST
రిలీజ్‌కి రెండు రోజులే.. అయినా సందడి ఏది?
X

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన 'దాయారా' విడుదలకు సిద్ధం అయింది. బాలీవుడ్‌ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రముఖ రచయిత, అవార్డ్‌ విన్నింగ్‌ రైటర్‌ అయిన మేఘనా గుల్జార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన నేపథ్యంలో బాలీవుడ్‌ వర్గాల్లో అంచనాలు పెరిగాయి. సినిమాను సస్పెన్స్‌, థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నట్లు మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఒక క్రైమ్‌ కేసు ఇన్వెస్టిగేషన్‌ నేపథ్యంలో కథ సాగుతుందని ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్‌ను చూస్తే అర్థం అవుతుంది. దాయరా ట్రైలర్‌కు క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలకు నచ్చే ప్రేక్షకులకు నచ్చిందనే టాక్‌ వచ్చింది. అయితే సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్నా ఇప్పటి వరకు సందడి లేదు, సోషల్‌ మీడియా హడావిడి లేకపోవడం విడ్డూరంగా ఉంది.

దాయరా సినిమా రిలీజ్‌ డేట్‌...

'దాయరా' మేకర్స్ సినిమాను చేసుకుంటూ వెళ్తారు, కానీ సినిమాను ప్రమోట్‌ చేయడం మాత్రం మొదటి నుంచి చేయలేదు. ట్రైలర్ విడుదలకు ముందు మేకర్స్‌ సినిమా ప్రమోషన్‌ ను మొదలు పెట్టినట్లు బాలీవుడ్‌ వర్గాల వారు చెబుతున్నారు. సినిమాను సెప్టెంబర్‌ 18, 2026న విడుదల చేయబోతున్నారు. సినిమా విడుదలకు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే బుకింగ్‌ ప్రారంభించినప్పటికీ పెద్దగా స్పందన లేదు. ట్రైలర్‌ కి పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చినప్పటికీ సినిమాకు కావాల్సిన బజ్‌ క్రియేట్‌ చేయడంలో యూనిట్‌ సభ్యులు విఫలం అయ్యారు. అందుకే సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేక పోయిందని, అందుకే ఓపెనింగ్‌ వసూళ్లు పెద్దగా ఉండక పోవచ్చు అని బాక్సాఫీస్‌ వర్గాల వారు, ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కరీనా కపూర్ ఖాన్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌...

కరీనా కపూర్‌ ఖాన్‌ కి బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. ఆమె ప్రధాన పాత్రలో సినిమా అంటే కచ్చితంగా ఒక వర్గం ప్రేక్షకులు అయినా ఆసక్తి చూపించడం ఖాయం. కానీ ఈ సినిమాను పెద్దగా ప్రమోట్‌ చేయక పోవడం వల్ల అసలు రెండు రోజుల్లో సినిమా వస్తున్న సంగతి కూడా చాలా మందికి తెలియదు. ఇంకా కొందరికి అసలు సినిమా గురించే తెలియదు. ప్రస్తుతం ఉన్న పోటీ నేపథ్యంలో సినిమాను మొదటి నుంచి ప్రమోట్‌ చేసుకుని, సోషల్‌ మీడియాలో వారం వారం ట్రెండ్‌ అయ్యేలా చేస్తే తప్ప జనాల దృష్టిని ఆకర్షించే పరిస్థితి లేదు. కనుక కరీనా కపూర్‌ ఖాన్‌ క్రేజ్‌ ను వినియోగించుకుని సినిమాను షూటింగ్‌ అయిన వెంటనే ప్రమోట్‌ చేసి ఉంటే బాగుండేది అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విడుదల తర్వాత పాజిటివ్‌ టాక్‌ వస్తే అప్పుడు జనాలు థియేటర్లకు క్యూ కట్టే అవకాశాలు ఉంటాయి.

బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ రిపోర్ట్‌...

బాలీవుడ్‌ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 'దాయరా' సినిమా దాదాపుగా రూ.80 కోట్ల బడ్జెట్‌తో రూపొందినట్లు చెబుతున్నారు. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ కు బాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. కనుక ఆయన ప్రజెన్స్ తప్పకుండా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందనే విశ్వాసంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. కరీనా కపూర్‌ ఖాన్‌ కు ఉన్న ఇమేజ్‌, ఆమె పరిచయాలతో దాయరా సినిమాకు కావాల్సినంత ప్రమోషన్‌ చేయవచ్చని, కానీ ఆమె ప్రమోషన్‌ గురించి పట్టించుకోలేదని కొందరు విమర్శిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా మినిమం బజ్ క్రియేట్‌ కాకపోవడంతో మొదటి రోజు కనీసం రూ.5 కోట్ల వసూళ్లు అయినా వచ్చేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరో రెండు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో మేకర్స్‌ ఏమైనా అద్భుతం క్రియేట్‌ చేసి సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్తారేమో చూడాలి.