ఫోటో స్టోరి: బ్లాక్ ఔట్‌ఫిట్‌లో బెబో దుమారం
షారుఖ్ ఖాన్ ‘కింగ్’ సినిమా కోసం కరీనా కపూర్ చేసిన రెండు విభిన్న లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టైలిస్ట్ రియా కపూర్ షేర్ చేసిన ఫొటోలకు కత్రినా కైఫ్, జాన్వీ కపూర్, సుహానా ఖాన్ ప్రశంసలు కురిపించారు. తన లుక్‌పై కరీనా చేసిన ఫన్నీ కామెంట్ కూడా అభిమానులను ఆకట్టుకుంది.
By: Sivaji Kontham | 29 Nov 2026 9:16 PM ISTబెబో కరీనా కపూర్ ఖాన్ ఎనర్జిటిక్ డ్యాన్సులు.. ఫ్యాషన్ సెన్స్ ఎప్పుడూ ప్రత్యేకమైనవే. మరోసారి కరీనా ఫ్యాషన్ సెన్స్, డ్రెస్ సెలక్షన్‌పై నెటిజనుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. కరీనా ఇటీవల షారూఖ్ `కింగ్` చిత్రంలో నటిస్తూ నిరంతరం మీడియా హెడ్ లైన్స్‌లో నిలుస్తోంది. ఈ సినిమా కోసం ఎంపిక చేసుకున్న డిజైనర్ దుస్తులు ప్రత్యేకంగా చర్చకు తెర తీస్తున్నాయి.
కరీనా స్టైలింగ్‌కు సంబంధించి ప్రముఖ స్టైలిస్ట్, నిర్మాత రియా కపూర్ షేర్ చేసిన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కింగ్ సినిమా కోసం `డాడీ కూల్` అనే పాటను షూట్ చేయగా.. దాని కోసం కరీనాను తయారు చేసిన బిహైండ్ ది సీన్స్ (బీటీఎస్) విశేషాలను రియా కపూర్, సన్యా కపూర్ కలిసి `ది మేకింగ్ ఆఫ్ ఎ మూమెంట్ విత్ కరీనా కపూర్ ఖాన్` అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. ఈ పోస్ట్‌లో కరీనా రెండు విభిన్నమైన అదిరిపోయే స్టైలింగ్ లుక్స్‌లో కనిపించగా.. ఆభరణాలు- మేకప్- బ్లాక్ అవుట్‌ఫిట్ వివరాలను కూడా రియా ట్యాగ్ చేశారు.
ఈ పోస్ట్‌పై బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా కరీనా కపూర్ స్వయంగా స్పందిస్తూ ``కానీ నా ఫిష్ బర్గర్.. బోలెడంత మయోనైస్.. ఫ్రైస్ ఎక్కడ?`` అంటూ తనలోని ఫుడీని బయటపెడుతూ ఫన్నీ కామెంట్ చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. మరోవైపు కత్రినా కైఫ్ హార్ట్-ఐస్ ఎమోజీలతో.. జాన్వీ కపూర్ ``ఇది నార్మల్ కాదు కదా?`` అంటూ,.. సుహానా ఖాన్ ``అన్ బిలీవబుల్`` అంటూ ప్రశంసించారు. షనాయా కపూర్, మహీప్ కపూర్, తహిరా కశ్యప్, వైభవి మర్చంట్, సుమోనా చక్రవర్తి, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రతినిధులు సహా పలువురు సెలబ్రిటీలు కరీనా లుక్‌ను ఆకాశానికెత్తారు.
అభిమానుల కామెంట్లలో కూడా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కరీనా వయసు పెరుగుతున్నా గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని.. ``కాలం మాకు మాత్రమే గడుస్తోందా? మేము పుట్టకముందు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు`` అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. అలాగే `డాడీ కూల్` పాటలో కరీనా పర్ఫార్మెన్స్ చూడటానికే థియేటర్‌కు వెళ్తామని కొందరు ఫ్యాన్స్ కామెంట్లు పెడుతుండగా బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కరీనా `అసలైన ఐకాన్` అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరోవైపు కరీనా కపూర్ ఖాన్ రెడ్ ఔట్ ఫిట్‌లో అదిరిపోయే స్టెప్పులు వేస్తున్న వీడియోను కూడా ఇన్ స్టాలో షేర్ చేయగా, అది దుమారం రేపుతోంది. బెబో ఎనర్జిటిక్ స్టెప్పులకు యూత్ ఫిదా అయిపోతోంది. షారూఖ్ ఖాన్ , సుహానా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన కింగ్ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ థియేటర్లలోకి విడుదల కానుంది. ఇందులో కరీనా పెర్ఫామెన్స్ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
