Begin typing your search above and press return to search.

బండానా లుక్‌తో కొత్త వైబ్…హాట్ టాపిక్ గా మారిన కరీనా కపూర్ స్టైల్ !

బాలీవుడ్ అల్టిమేట్ ఫ్యాషన్ దివా కరీనా కపూర్ ఖాన్ తన స్టైలిష్ లుక్స్‌తో ఎప్పుడూ ట్రెండ్ సెట్ చేస్తూనే ఉంటుంది.

By:  Madhu Reddy   |   9 July 2026 9:00 PM IST
బండానా లుక్‌తో కొత్త వైబ్…హాట్ టాపిక్ గా మారిన కరీనా కపూర్ స్టైల్ !
X

బాలీవుడ్ అల్టిమేట్ ఫ్యాషన్ దివా కరీనా కపూర్ ఖాన్ తన స్టైలిష్ లుక్స్‌తో ఎప్పుడూ ట్రెండ్ సెట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన "బండానా" ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. భర్త సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి సముద్ర తీరంలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న కరీనా.. తన సరికొత్త ఫ్యాషన్ అటెంప్ట్‌తో అభిమానులను ఫిదా చేస్తోంది. ఒకప్పుడు సైఫ్‌తో కలిసి ఇవే బండానా లుక్స్‌లో మెరిసిన బెబో, ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అదే స్టైల్‌ను రీ క్రియేట్ చేస్తూ కొత్త వైబ్స్ ఇస్తోంది. ఆ విశేషాలు చూద్దాం..




సముద్ర తీరంలో వెకేషన్ హంగామా:

ప్రస్తుతం కరీనా కపూర్ తన భర్త సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి ఓ అందమైన బీచ్ రిసార్ట్‌లో హాలిడే ఎంజాయ్ చేస్తోంది. సైఫ్ సముద్రంలో నుంచి నడుచుకుంటూ వస్తున్న ఒక హాట్ ఫోటోను షేర్ చేస్తూ.. "సమ్మర్ బాగా సాగుతోంది" అంటూ లవ్, ఫైర్ ఎమోజీలను జత చేసింది. ఆ వెంటనే తన బండానా లుక్స్‌ను పోస్ట్ చేస్తూ.. "మీరు చూస్తున్నట్లుగా, ప్రస్తుతం నాకు ఈ బండానా స్టైల్ బాగా నచ్చింది" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఆమె బ్లూ డ్రెస్ లో ఎంతో స్టైల్ గా వుంది అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.




టాప్ క్రైమ్ థ్రిల్లర్ 'దాయ్రా':

ఇక సినిమాల విషయానికి వస్తే.. కరీనా కపూర్ చేతిలో వరుస క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో మొదటిది మేఘనా గుల్జార్ దర్శకత్వంలో వస్తున్న దాయ్రా .మూవీ ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో కరీనా కపూర్ మొదటిసారి మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఇందులో పృథ్వీరాజ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా నటిస్తుండగా, కరీనా కూడా ఒక పవర్‌ఫుల్ అండ్ మిస్టరీ క్యారెక్టర్‌లో కనిపించనుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.




రియా కపూర్ కాంబినేషన్ రిపీట్:

గతంలో కరీనా కపూర్, సోనమ్ కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన "వీరే ది వెడ్డింగ్" సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే ప్రొడ్యూసర్ రియా కపూర్ నిర్మాణంలో కరీనా మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ సినిమా 2018 నాటి చిత్రానికి పూర్తిగా భిన్నంగా, సరికొత్త కథాంశంతో ఉంటుందని కరీనా స్వయంగా ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది.

ఒకవైపు భర్త సైఫ్ అలీ ఖాన్‌ తో ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ, మరోవైపు సినిమాలతో కరీనా బిజీగా ఉంది. తాజాగా ఆమె ‘బండానా స్టైల్’ ఫ్యాషన్ అభిమానులను ఆకట్టుకుంటోంది.గ్లామర్ రోల్స్ అయినా పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ అయినా కరీనా తర్వాతే ఎవరైనా అని ఈ ముద్దుగుమ్మ మరోసారి నిరూపిస్తోంది.