Begin typing your search above and press return to search.

బాలీవుడ్ కింగ్ కరణ్ కే చెమటలు పట్టిస్తున్న కాంతార 2.. పక్కన పెట్టేశారా?

ఒకప్పుడు వరుస హిట్స్ తో దూసుకుపోయిన వాళ్ళు కూడా ఆ తర్వాత వరుస ఫ్లాప్ లను ఎదుర్కోవాల్సి వస్తుంది.

By:  Madhu Reddy   |   1 Oct 2025 4:43 PM IST
బాలీవుడ్ కింగ్ కరణ్ కే చెమటలు పట్టిస్తున్న కాంతార 2.. పక్కన పెట్టేశారా?
X

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం చాలా కష్టం. ఒకప్పుడు వరుస హిట్స్ తో దూసుకుపోయిన వాళ్ళు కూడా ఆ తర్వాత వరుస ఫ్లాప్ లను ఎదుర్కోవాల్సి వస్తుంది. స్టార్ దర్శకులు కూడా సినిమాలు లేక ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. హిట్ సినిమాలు తీసి కోట్లు సంపాదించిన నిర్మాతలు కూడా అప్పుడప్పుడు నష్టాల పాలవ్వాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం బాలీవుడ్లో స్టార్ నిర్మాత, దర్శకుడు, నటుడు కరణ్ జోహార్ పరిస్థితి కూడా అలాగే అనిపిస్తోంది. నిర్మాత కరణ్ జోహార్ బాలీవుడ్ లో ఎంత ఫేమసో చెప్పనక్కర్లేదు. కానీ అలాంటి ఈయన ప్రస్తుతం బాలీవుడ్ లో గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ సినీ పరిశ్రమనే తన కను సైగలతో శాసించిన కరణ్ జోహార్ కి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటి? అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కరణ్ జోహార్ మూవీకే థియేటర్లు దొరకడం లేదా?

అసలు విషయంలోకి వెళ్తే.. జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ కాంబినేషన్ లో వస్తున్న 'సన్నీ సంస్కారీకీ తులసి కుమారి' సినిమా అక్టోబర్ 2న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాకి బాలీవుడ్ లో థియేటర్లు కరువయ్యాయట. ఎందుకంటే అక్టోబర్ 2న రిషబ్ శెట్టి నటించిన 'కాంతార:చాప్టర్ 1' సినిమా వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. ఇప్పటికే కాంతార: చాప్టర్ 1 మూవీని ఎక్కువ మల్టీప్లెక్స్ స్క్రీన్ లలో పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నారు. దీంతో అదే రోజు విడుదల కాబోతున్న కరణ్ జోహార్ మూవీకి థియేటర్లు దొరకడం లేదు. దాంతో కరణ్ జోహార్ కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియా వర్గాల నుండి వార్తలు వినిపిస్తున్నాయి.

కాంతార చాప్టర్ 1 విడుదలే ప్రధాన కారణం..

అయితే బాహుబలి చిత్రాన్ని బాలీవుడ్ లో రిలీజ్ చేసి పాన్ ఇండియా మూవీకి శ్రీకారం చుట్టిన కరణ్ జోహార్ కి అదే పాన్ ఇండియా మూవీ వల్ల థియేటర్లు కరువయ్యాయట. అలా కాంతార: చాప్టర్ 1 మూవీతో కరణ్ జోహార్ సినిమాకి పెద్ద దెబ్బ పడేలా ఉందని బీ టౌన్ మొత్తం మాట్లాడుకుంటుంది. కనీసం తనకి కొన్ని థియేటర్లైనా కేటాయించండి అంటూ నిర్మాత కరణ్ జోహార్ బ్రతిమలాడాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఇది చూసిన నెటిజన్స్ కూడా బాలీవుడ్ కింగ్ కరణ్ కే కాంతార చాప్టర్ 1 విడుదల.. చెమటలు పట్టిస్తోందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సందిగ్ధంలో పడ్డ బాలీవుడ్ జనాలు..

మరోవైపు జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ లు సినిమా కోసం గట్టి ప్రమోషన్స్ చేస్తున్నారు.కానీ ఎంత ప్రమోషన్స్ చేస్తే ఏం లాభం థియేటర్లు దొరకకపోతే అంటూ ఈ సినిమాను ఉద్దేశించి మాట్లాడుకుంటున్నారు బాలీవుడ్ జనాలు.. మరి కరణ్ జోహార్ విన్నపాన్ని విని తన సన్నీ సంస్కారీకీ తులసి కుమారి సినిమాకి థియేటర్లు కేటాయిస్తారా.. లేక థియేటర్ యాజమాన్యం మొత్తం కాంతార: చాప్టర్ 1 మూవీని రిలీజ్ చేయడానికే ఆసక్తి చూపిస్తారా? అనేది మరికొద్ది గంటల్లో తేలిపోతుంది. ఏదేమైనా ఈ విషయంపై బాలీవుడ్ సినిమా ఆడియన్స్ కూడా సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది.