Begin typing your search above and press return to search.

కాబోయే భార్య‌ని చిన్న పాపాయిలా చూస్తాడుట‌!

టెలివిజన్ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన జంటలలో కరణ్ కుంద్రా- తేజస్వి ప్రకాశ్ ఒకరు.

By:  Srikanth Kontham   |   23 May 2026 9:00 PM IST
కాబోయే భార్య‌ని చిన్న పాపాయిలా చూస్తాడుట‌!
X

టెలివిజన్ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన జంటలలో కరణ్ కుంద్రా- తేజస్వి ప్రకాశ్ ఒకరు. ఇద్ద‌రి మధ్య ఉన్న కెమిస్ట్రీ, పరస్పర అవగాహన అభిమానులను నిరంత‌రం ఆకట్టుకుంటూనే ఉంటుంది. తాజాగా ఈ జోడీ `దేశీ బ్లింగ్` అనే సరికొత్త టాక్ షోలో సందడి చేశారు. ఈ వేదికపై కరణ్ కుంద్రా వ్యక్తిగత జీవితం - తేజస్వితో తనకున్న బంధం గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. `తేజస్వి ప్రకాశ్‌తో ప్రేమలో మాత్ర‌మే లేను. ఒక రకంగా పేరెంటింగ్ చేస్తున్నానని వ్యాఖ్యానించారు. తేజస్వి స్వభావరీత్యా చాలా అమాయకురాలు. కొన్ని విషయాల్లో చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంది.

రోజువారీ విషయాలను, బాధ్యతలను చూసుకోవడంలో తాను కేర్‌టేకర్ లా వ్య‌వ‌హ‌రిస్తున్నాన‌న్నారు. బంధంలో భాగస్వాములు ఒకరికొకరు స్నేహితులుగా, ప్రేమికులుగా ఉండటం సాధారణం. కానీ కరణ్ కుంద్రా వెల్లడించిన కొత్త కోణం వారి మధ్య ఉన్న గాఢమైన అనుబంధాన్ని తెలియజేస్తోంది. తేజస్వికి ఉన్న చిన్నపిల్లల అలవాట్లు తనను మరింత బాధ్యతాయుతంగా మార్చాయని కరణ్ అభిప్రాయపడ్డారు. ఈ రకమైన ప్రవర్తన వల్ల తమ బంధం మరింత బలోపేతం అయిందని ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఇది ఎంతోఒ సహాయపడిందన్నారు. ఇదే టాక్ షోలో భవిష్యత్తులో పిల్లలను కనడం, వారిని పెంచడం గురించిన చర్చ కూడా ముందుకొచ్చింది.

ఈ తరం మారుతున్న జీవనశైలి, ఆలోచనల నేపథ్యంలో పిల్లల బాధ్యతలను స్వీకరించడంపై కరణ్ ఆందోళ నలను వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన తల్లిదండ్రులు వ్యక్తపరిచిన కొన్ని సందేహాలు వారి జీవితానుభవాల నుండి నేర్చుకున్న విషయాల వల్ల భవిష్యత్తులో తాను ఒక మంచి తండ్రిగా రాణించగలనా? లేదా? అనే సందిగ్ధత ఉన్నాన‌న్నారు. కరణ్ కుంద్రా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. ఈ జంట మధ్య ఉన్న అప్యాయతను చూసి మురిసిపోతున్నారు. కరణ్ ఎంతటి బాధ్యతాయుతమైన భాగస్వామియో ఈ మాటల ద్వారా అర్థమవుతోందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

నేటి ఆధునిక కాలంలో పేరెంటింగ్ , పిల్లల భవిష్యత్తు గురించి వ్యక్తపరిచిన ఆందోళనలు చాలా సహజమైనవని కొందరు అభిప్రాయపడుతున్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు ఎప్పుడూ కెమెరా కంటికి క‌నిపిస్తున్నా? ఇలాంటి టాక్ షోల ద్వారా వారు మనసులోని నిజమైన భావాలను పంచుకోవడం ప్రేక్షకులకు వారిని మరింత దగ్గర చేస్తుంది. కరణ్ కుంద్రా, తేజస్వి ప్రకాశ్ ల బంధం గ్లామర్‌కే పరిమితం కాకుండా నిజ జీవితంలోని బాధ్యతలను, పరస్పర గౌరవాన్ని పంచుకునే విధంగా సాగుతోందని తాజా ఇంటర్వ్యూ నిరూపించింది. త్వ‌ర‌లోనే ఈ జంట వివాహ బంధంతో ఒక‌టి కానున్నారు.