Begin typing your search above and press return to search.

హీరోలకు లేని అభ్యంతరం దీపికకు ఎందుకు?

హీరోలకు ఒక న్యాయం.. హీరోయిన్లకు మరో న్యాయం ఉండకూడదని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ అన్నారు. రోజుకు 8 గంటల షిఫ్ట్ మాత్రమే చేయాలన్న దీపిక పదుకొణె నిర్ణయాన్ని సమర్థించారు. 'కాఫీ విత్ కరణ్ సీజన్ 9'లో అక్షయ్ కుమార్, రవి కిషన్‌తో మాట్లాడుతూ మహిళా నటీమణులకు కూడా పని గంటలు నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉండాలని అభిప్రాయపడ్డారు. అక్షయ్ కూడా ఈ విధానానికి మద్దతు తెలిపారు.

By:  Srikanth Kontham   |   25 Nov 2026 1:44 PM IST
హీరోలకు లేని అభ్యంతరం దీపికకు ఎందుకు?
X

పరిశ్రమలో పని గంటల విషయంలో హీరోలకు ఒక న్యాయం.. హీరోయిన్లకు మరో న్యాయం ఉండటం ఏమాత్రం సరికాదని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ అభిప్రాయ‌ప‌డ్డారు. రోజుకు 8 గంటల షిఫ్ట్ మాత్రమే చేస్తానన్న దీపికా పదుకొణె నిర్ణయాన్ని సమర్థించిన క‌ర‌ణ్‌ ఆ హక్కును దీపిక‌ కష్టంతో సంపాదించుకున్నారని కొనియాడారు.`కాఫీ విత్ కరణ్ సీజన్ 9` తాజా ఎపిసోడ్‌లో అక్షయ్ కుమార్- రవి కిషన్ అతిథులుగా పాల్గొనగా ఈ సందర్భంగా కరణ్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అక్షయ్ కుమార్ క్రమశిక్షణ గురించి మాట్లాడుతూ ఆయన ఉదయం 5 గంటలకే మీటింగ్స్ పెడతారని.. స్క్రిప్ట్ పూర్తిగా గుర్తుపెట్టుకుని దర్శకనిర్మాతలకు ఎంతో సహకరిస్తారని కరణ్ ప్రశంసించారు. కొత్త దర్శకులకు అవకాశాలిచ్చే ఏకైక సూపర్ స్టార్ అక్షయ్ అని.. ఆయనకు దక్కాల్సినంత గుర్తింపు దక్కడం లేద‌న్నారు. అదే సమయంలో పరిశ్రమలో పని గంటలపై జరుగుతున్న చర్చను ప్రస్తావించారు. దీపికా పదుకొణె నిర్ణయాన్ని ఎందుకు అంత పెద్ద వివాదంగా మారుస్తున్నారో? అర్థం కావడం లేదని కరణ్ ప్రశ్నించారు. దీపిక తల్లిగా.. భార్యగా.. ప్రొఫెషనల్‌గా ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారన్నారు. హీరోలు అడిగినప్పుడు లేని అభ్యంతరం ఆమె అడిగినప్పుడు ఎందుకు వస్తోందని నిలదీశారు.

మహిళా స్టార్లకు కూడా తమ పని పరిధులను నిర్ణయించుకునే స్వేచ్ఛ సమానంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. కరణ్ మాటలతో అక్షయ్ కుమార్ కూడా ఏకీ భవించారు. 8 గంటల షిఫ్ట్ విధానం వల్ల సెట్స్‌లో అందరికీ మేలు జరుగు తుందని.. సృజనాత్మకతకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. హాలీవుడ్‌లో టామ్ క్రూజ్. క్రిస్టోఫర్ నోలన్ వంటి దిగ్గజాల భారీ ప్రాజెక్టులు కూడా పక్కా ప్రణాళికతో నిర్దిష్ట సమయానికే షూటింగ్ జరుపుకుంటాయని గుర్తు చేసారు.

సందీప్ రెడ్డి వంగా `స్పిరిట్` సినిమా నుంచి అటుపై `కల్కి 2898 AD` సీక్వెల్ నుంచి దీపిక తప్పుకోవడానికి ఈ 8 గంటల షిఫ్ట్ డిమాండే కారణమంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. దీనిపై గతేడాది స్పందించిన దీపిక ఎందరో అగ్ర హీరోలు ఏళ్లుగా 8 గంటల షిఫ్టులే చేస్తున్నా ?ఎవరూ ప్రశ్నిం చరని తాను మహిళను అయినంత మాత్రాన తన అభ్యర్థనను తప్పుబట్టడం సరికాదని బదులిచ్చారు. అప్పట్లో కరీనా కపూర్, అలియా భట్, అనన్య పాండే వంటి తారలు కూడా దీపిక‌కు అండగా నిలిచిన సంగ‌తి తెలిసిందే.