హీరోయిన్లకు నిర్మాత క్లాస్ పీకాడా?
హీరోయిన్లు కారణంగా ఇబ్బంది పడిన నిర్మాతలు బహిరంగంగానే విమర్శలకు దిగిన సందర్భాలు కోకొల్లలు.
By: Srikanth Kontham | 17 Sept 2025 8:00 AM ISTసినిమా ప్రమోషన్ అంటే కొంత మంది భామలు భారంగా భావిస్తుంటారు. షూటింగ్ కి హాజరైనంత ఉత్సా హంగా హాజరు కారు. ప్రమోషన్ కంటూ ప్రత్యేక ప్యాకేజీ ఆఫర్ చేస్తే తప్ప ఆ ఉత్సాహం కనిపించదు. కానీ నిర్మాతలు అలాంటి అవకాశం అందరికీ ఇవ్వరు. సినిమాతో పాటు, ప్రచారానికి హాజరు కావాలనే కండీషన్ ఉంటుంది. ఆ ప్రకారం నాయికలు అటెండ్ అవుతుంటారు. ఈ క్రమంలో కొంత మంది భామలు ప్రచారా నికి ఢుమ్మా కొడుతుంటారు. ఇలాంటి సన్నివేశాలు ఎక్కువగా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో ఎదురవుతుంటాయి.
హీరోయిన్లు కారణంగా ఇబ్బంది పడిన నిర్మాతలు బహిరంగంగానే విమర్శలకు దిగిన సందర్భాలు కోకొల్లలు. తాజాగా ఇలాంటి పరిస్థితులను ఉద్దేశించి బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ కొంత మంది భామలకు క్లాసీ పీకినట్లు తెలుస్తోంది. నవతరం భామలు ఇండస్ట్రీలో ఎలా మెలగాలి? షూటింగ్ అనతరం ప్రచారం అన్నది ఎంత బాధ్యత తీసుకుని ముందుకు తీసుకోవాలి? వంటి అంశాలపై మాట్లాడినట్లు తెలుస్తోంది. కోట్ల రూపాయల పెట్టుబడితో సినిమా నిర్మాణం జరుగుతుందన్నారు.
కానీ కొంత మంది తాము తీసుకున్న పారితోషికం కేవలం నటనకు మాత్రమేనని..మిగతా ఏ పనితోనూ తమకు సంబంధం లేదని భావిస్తుంటారన్నారు. `అది తప్పు. ఒక సారి సినిమాకు సైన్ చేసిన తర్వాత రిలీజ్ వరకూ అటుపై..అదే సినిమాకు సంబంధించిన ఇంకే వేడుక నిర్వహించినా విధిగా నటి ప్రచారానికి హాజరు కావాలన్నారు. ఈ విషయంలో దీపికా పదుకొణే, అలియాభట్, కరీనా కపూర్ లాంటి వాళ్లను నవతరం చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు.
ఆ ముగ్గురు తన షోకు గర్భంతో ఉన్న సమయంలో వచ్చారని, ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. తాము రాలేని పరిస్థితుల్లో ఉన్నా సినిమాకు తాము అండగా ఉన్నామని ఇబ్బందికర పరిస్థితుల్లో ముందు కొచ్చారు. ఇలా కొందరు భామలు ఆలోచించలేకపోతున్నారన్నారు. నిర్మాతల ఇబ్బందులను కూడా గుర్తించినప్పుడే మంచి ఫలి తాలు సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు.
