భారతదేశంలో అత్యంత ధనికుడైన దర్శకనిర్మాత?
భారతదేశంలో అత్యంత ధనికుడైన సినీహీరో ఎవరో స్పష్ఠంగా ప్రజలకు తెలుసు. అతడు షారూఖ్ ఖాన్. భారతదేశంలో అత్యంత ధనికురాలైన సినీనటి ఎవరో కూడా తెలుసు
By: Sivaji Kontham | 5 Oct 2025 5:00 PM ISTభారతదేశంలో అత్యంత ధనికుడైన సినీహీరో ఎవరో స్పష్ఠంగా ప్రజలకు తెలుసు. అతడు షారూఖ్ ఖాన్. భారతదేశంలో అత్యంత ధనికురాలైన సినీనటి ఎవరో కూడా తెలుసు. ఆమె జూహీ చావ్లా. అయితే భారతదేశంలో అత్యంత ధనికుడైన దర్శకనిర్మాత (ఫిలింమేకర్) ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం ఆదిత్య చోప్రా, సంజయ్ లీలా భన్సాలీ, రోహిత్ శెట్టి, రాజ్ కుమార్ హిరాణీ వీళ్లలో ఎవరూ కాదు.
అతడు కరణ్ జోహార్. కరణ్ సినీనిర్మాతగా, విజయవంతమైన దర్శకుడిగా సుపరిచితుడు. అతడి ఆల్ రౌండర్ నైపుణ్యం. నిర్వాహణా సామర్థ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ధర్మ ప్రొడక్షన్స్ ని అత్యుత్తమ బ్యానర్ గా నిలబెట్టిన ఘనత కరణ్ కే దక్కుతుంది. హురూన్ 2025 జాబితా ప్రకారం.. భారతదేశంలోని కొంతమంది ధనవంతుల జాబితాను రూపొందించగా, దానిలో టాప్ 5లో కరణ్ పేరు కూడా ఉంది.
కరణ్ జోహార్ నికర ఆస్తుల విలువ సుమారు 1880 కోట్లు. తన నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ కారణంగా ఈ సంపదలు సాధ్యమయ్యాయి. ఇక ఇదే జాబితాలో కరణ్ జోహార్ తో పాటు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సంజయ్ లీలా భన్సాలీ, ఆదిత్య చోప్రా వంటి ప్రముఖ దర్శకనిర్మాతల పేర్లు ఉన్నాయి.
నిజానికి కరణ్ జోహార్ బాలీవుడ్‌లో టాప్ 5 ధనవంతులలో ఒకరు. అతడు జాబితాలో 4వ స్థానంలో ఉండగా, షారుఖ్ ఖాన్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. జూహి చావ్లా తన రెండవ స్థానాన్ని నిలబెట్టుకోగా, హృతిక్ రోషన్ మూడవ స్థానంలో నిలిచారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 5వ అత్యంత సంపన్న సెలబ్రిటీగా రికార్డుల్లో నిలిచారు.
షారూఖ్ - 12,490 కోట్ల నికర ఆస్తులను కలిగి ఉండగా, జూహీ చావ్లా-7790 కోట్లు, హృతిక్ -2,160కోట్లు, కరణ్ జోహార్ -1880 కోట్లు, అమితాబ్ -1630 కోట్లతో టాప్ 5లో ఉన్నారు. వీరంతా సినీనిర్మాతలుగానే కాకుండా రకరకాల వ్యాపారాల ద్వారా ఆర్జిస్తున్నారు. రియల్ ఎస్టేట్, ఫ్యాషన్ రంగంలోను కొందరు భారీ మొత్తాలను ఆర్జిస్తున్నారు.
దివంగత నిర్మాత యష్ జోహార్ కుమారుడు కరణ్ జోహార్ 1998లో రొమాంటిక్ కామెడీ డ్రామా `కుచ్ కుచ్ హోతా హై` తో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. కభీ ఖుషీ కభీ ఘమ్, కభీ అల్విదా నా కెహ్నా, మై నేమ్ ఈజ్ ఖాన్, మై నేమ్ ఈజ్ ఖాన్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, ఏ దిల్ హై ముష్కిల్, షేర్షా సహా పలు భారీ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీకి చివరిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం. ఇటీవల విడుదలైన చిత్రం సన్నీ సంస్కారి కీ తులసి కుమారికి కరణ్ నిర్మాత. జాన్వి కపూర్, వరుణ్ ధావన్, సన్యా మల్హోత్రా, రోహిత్ సరాఫ్ నటించిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందనలు వచ్చాయి. మారిన పరిస్థితుల కారణంగా, కరణ్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్స్ నుంచి మెజారిటీ వాటాను ఆధార్ పూనవాలాకు విక్రయించిన సంగతి తెలిసిందే.
