Begin typing your search above and press return to search.

ఆ సంచ‌ల‌నానికి కూడా రాజ‌మౌళి గురువే!

పాన్ ఇండియా చిత్రాల‌కు రాజ‌మౌళి ఓ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మారిపోయారు. పాన్ ఇండియా సినిమా తీస్తే ఆయ‌నే తీసి హిట్ కొట్టాలి అన్నంత‌గా అన్ని భాష‌ల్లోనూ ఫేమ‌స్ అయిపోయారు

By:  Srikanth Kontham   |   6 Sept 2025 7:00 PM IST
ఆ సంచ‌ల‌నానికి కూడా రాజ‌మౌళి గురువే!
X

పాన్ ఇండియా చిత్రాల‌కు రాజ‌మౌళి ఓ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మారిపోయారు. పాన్ ఇండియా సినిమా తీస్తే ఆయ‌నే తీసి హిట్ కొట్టాలి అన్నంత‌గా అన్ని భాష‌ల్లోనూ ఫేమ‌స్ అయిపోయారు. అందుకే అన్ని భాష‌ల హీరోలు కూడా రాజ‌మౌళితో ఒక్క సినిమాకైనా ప‌ని చేయాల‌ని ఆస‌క్తితో ముందుకొస్తున్నారు. ప్రత్యే కించి బాలీవుడ్ బిగ్ స్టార్స్ అయితే క్యూలో నే ఉన్నారు. అక్క‌డ నిర్మాణ సంస్థ‌లు కూడా రాజ‌మౌళితో క‌లిసి ప‌ని చేయాల‌ని ఎంతో ఆస‌క్తిగా ఉన్నాయి. కానీ జ‌క్క‌న్నే ఆ ఛాన్స్ మాత్రం ఇవ్వ‌డం లేదు.

తాను తెలుగు డైరెక్ట‌ర్ గానే ప్ర‌తీ సంద్భంలోనూ హైలైట్ అవుతారు. వాస్త‌వానికి `బాహుబ‌లి` త‌ర్వాత బాలీవుడ్ లో ఎన్నో ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కానీ వాట‌న్నింటిని తిర‌స్క‌రించి తాను కేవ‌లం తెలుగు వాటిని మాత్రమ‌నే నని.. ప్ర‌పంచంలో ఎలాంటి సంచ‌ల‌నాలు న‌మోదు చేసినా? అది తెలుగు నుంచే త‌ప్ప మ‌రో భాష నుంచి కాద‌ని చాటి చెప్ప‌దిన దిగ్గ‌జం. జ‌క్క‌న్న అంత స్ట్రాంగ్ టాలీవుడ్ వైపు నిల‌బ‌డ్డారు కాబ‌ట్టే? తెలుగు ప‌రిశ్ర‌మ గురించి మిగ‌తా ఇండ‌స్ట్రీలు మాట్లాడుకుంటున్నాయి.

తాజాగా బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ కం ప్రొడ్యూస‌ర్ క‌ర‌ణ్ జోహార్ ఏకంగా రాజ‌మౌళిని త‌న గురువుగానే స్వీక‌రిం చారు. రాజ‌మౌళి మాస్టారు అయితే మేమంతా ఆయ‌న ద‌గ్గ‌ర శిష్యులం అన్నారు. ఇండియ‌న్ సినిమాకు రాజ‌మౌళిని ఓ బెంచ్ మార్క్ గా అభివర్ణించారు. ఆయ‌న‌తో త‌మ‌ని పోల్చుకోవ‌డం స‌రికాద‌న్నారు. త‌మ‌కి రాజ‌మౌ ళి అంటే ఎంతో గౌర‌వం ఉంద‌న్నారు. ఆయ‌న సినిమాల‌తో మిగ‌తా సినిమాల‌ను పోల్చాల్సిన ప‌ని లేద‌న్నారు.

డైరెక్ట‌ర్ గా రాజ‌మౌళి క‌న్నా? రెండు..మూడేళ్లు క‌ర‌ణ్ జోహార్ సీనియ‌ర్. 1998 లో క‌ర‌ణ్ `కుచ్ కుచ్ హోతా హై`తో డైరెక్ట‌ర్ అయ్యారు. అటుపై 2001లో `స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్` తో రాజ‌మౌళి డైరెక్ట‌ర్ అయ్యారు. కానీ క‌ర‌ణ్ కంటే రాజ‌మౌళినే ఎక్కువ సినిమాలు డైరెక్ట్ చేసారు. అయితే క‌ర‌ణ్ నిర్మాత‌గా ఎక్కువ సినిమాల‌కు ప‌ని చేసారు. నూత‌న ప్రతిభావంతుల్ని...ఇండ‌స్ట్రీ స్టార్ కిడ్స్ ను ప‌రిచ‌యం చేయడంలో క‌ర‌ణ్ స్పెష‌లిస్ట్ గా మారారు. `బాహుబ‌లి` హిట్ అనంత‌రం రాజ‌మౌళిని బాలీవుడ్ కి తీసుకెళ్లిపోవాల‌ని క‌ర‌ణ్ గ‌ట్టి ప్ర‌య త్నాలు చేసారు కానీ ప‌న‌వ్వ‌లేదు. అలాగే టాలీవుడ్ లో రాజ‌మౌళి ద‌గ్గ‌ర మేము శిష్యులుగా ప‌నిచేసామ‌ని గ‌ర్వంగా చెప్పుకునే శిష్యులు కూడా ఆయ‌న‌కు లేరన్న‌ది గుర్తించాలి.