మిరాయ్ రిజల్ట్ ను ముందే ఊహించిన కరణ్
ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ లో కరణ్ రిలీజ్ చేసిన తెలుగు సినిమాలన్నీ ఆయనకు మంచి లాభాలనే అందించాయి.
By: Sravani Lakshmi Srungarapu | 15 Sept 2025 2:00 AM ISTకరణ్ జోహార్. బాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన కరణ్ కు బాక్సాఫీస్ మీద మంచి పట్టు ఉందనే సంగతి తెలిసిందే. అలా అని ఆయన ఖాతాలో అన్నీ సక్సెస్‌లే ఉన్నాయని కాదు. అందరితో పోలిస్తే ఆయనకు ఈ విషయంలో కాస్త గ్రిప్ ఎక్కువ అని అంతే. అందులోనూ కరణ్ కు సౌత్ సినిమాలపై ఇంకాస్త మంచి అవగాహన ఉంది. అందరి కంటే ముందే బాహుబలి సినిమా అంత పెద్ద సక్సెస్ అవుతుందని ఊహించిందే కరణే.
బాహుబలి సినిమాలతో కరణ్ కు మంచి లాభాలు
బాహుబలిని బాలీవుడ్ లో భారీగా రిలీజ్ చేసి ఆ మూవీతో మంచి రిజల్ట్ తో పాటూ లాభాలను కూడా అందుకున్నారు కరణ్. ఆ తర్వాత బాహుబలి2ను కూడా ఆయనే రిలీజ్ చేసి మరో బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. బాహుబలి ఫ్రాంచైజ్ సినిమాల తర్వాత కూడా కరణ్ పలు సౌత్ సినిమాలను హిందీలో రిలీజ్ చేసి మంచి ఫలితాలను రాబట్టుకున్నారు.
మిరాయ్ తో మరో హిట్
ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ లో కరణ్ రిలీజ్ చేసిన తెలుగు సినిమాలన్నీ ఆయనకు మంచి లాభాలనే అందించాయి. ఇప్పుడు కాస్త గ్యాప్ తర్వాత కరణ్ జోహార్ మరో తెలుగు సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నారు. అదే మిరాయ్. వాస్తవానికి మిరాయ్ పెద్ద సినిమా ఏమీ కాదు, స్టార్ హీరోలు లేరు. కానీ ఆ సినిమాకు సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు చూసి ఇంప్రెస్ అయిన కరణ్ ఆ సినిమాను బాలీవుడ్ లో రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారు.
హిందీలో రెండో రోజు డబుల్ కలెక్షన్లు
కరణ్ ఊహించినట్టే మిరాయ్ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. బాలీవుడ్ లో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మొదటి షో నుంచే ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్న మిరాయ్, రెండో రోజుకు డబుల్ కలెక్షన్లు వచ్చాయంటే బాలీవుడ్ లో ఈ మూవీ కి ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో అర్థం చేసుకోవచ్చు. రెండో రోజు పెరిగిన కలెక్షన్లు చూస్తుంటే బాలీవుడ్ ఆడియన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారని అర్థమవుతుంది. పైగా సినిమాలో రాముడితో కనెక్షన్ పెట్టారు. విజువల్ పరంగా కూడా సినిమా బావుంది. వీటన్నింటినీ బట్టి చూస్తుంటే మిరాయ్ కు హిందీలో లాంగ్ రన్ ఉండేలానే ఉందని, కరణ్ మరోసారి తెలుగు సినిమాతో జాక్ పాట్ కొట్టాడని అంటున్నారు.
