Begin typing your search above and press return to search.

ఒంట‌రిత‌నంతో వేగిపోతున్న డైరెక్ట‌ర్

జీవితంలోని ర‌క‌ర‌కాల ద‌శ‌ల‌లో ఒంట‌రిత‌నాన్ని ఎదుర్కొంటున్న సెల‌బ్రిటీల గురించి ప‌రిశీలిస్తే, క‌రణ్ జోహార్, స‌ల్మాన్ ఖాన్, ప్ర‌భాస్, శ్రుతిహాసన్ .. ఇలా చాలా పేర్లు వ‌రుస‌లో ఉన్నాయి

By:  Sivaji Kontham   |   22 Nov 2025 9:23 AM IST
ఒంట‌రిత‌నంతో వేగిపోతున్న డైరెక్ట‌ర్
X

ల‌వ్ బ్రేక‌ప్.. ప్ర‌జ‌లు వివిధ‌ ద‌శ‌ల‌లో దీనిని ఎదుర్కోవాల్సి రావొచ్చు. జీవితంలోని ర‌క‌ర‌కాల ద‌శ‌ల‌లో ఒంట‌రిత‌నాన్ని ఎదుర్కొంటున్న సెల‌బ్రిటీల గురించి ప‌రిశీలిస్తే, క‌రణ్ జోహార్, స‌ల్మాన్ ఖాన్, ప్ర‌భాస్, శ్రుతిహాసన్ .. ఇలా చాలా పేర్లు వ‌రుస‌లో ఉన్నాయి. కొంద‌రు మాత్ర‌మే కాదు.. చాలా మంది ఒంట‌రిత‌నంతో నిస్సారంగా ఉన్నారు.

ఇప్పుడు ఒంట‌రిత‌నంలో వెత‌ల గురించి క‌ర‌ణ్ జోహార్ బ‌హిరంగంగా మాట్లాడిన విష‌యాలు అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతున్నాడు. అత‌డు చాలా నిజాయితీగా మాట్లాడుతూ.. తాను వ‌న్ సైడ్ ల‌వ‌ర్ ని అని అది ఫెయిలైన‌ప్పుడు హృద‌య‌విదార‌కంగా ఏడ్చాన‌ని తెలిపాడు. ఆ దశ ఆధారంగా తాను ఓ సినిమా తీశానని, అది తనకు త‌గిలిన గాయాన్ని నయం చేసుకోవడానికి సహాయపడిందని చెప్పాడు. జీవితంలో ఎప్పుడూ ఒంటరిగా తినడం తనకు అత్యంత ఒంటరివాడిని అనిపించింద‌ని కూడా తెలిపాడు. ఒంట‌రిత‌నంలోని బాధ‌ను తీవ్రంగా అనుభ‌వించాన‌ని అత‌డు నిజాయితీగా అంగీక‌రించాడు. అంతేకాదు.. ఇప్ప‌టికీ స‌రైన భాగ‌స్వామిని క‌నుగొన‌లేక‌పోయాన‌ని అన్నాడు.

వంద‌ల కోట్ల ఆస్తులు ఉన్నా క‌ర‌ణ్ జోహార్ ఏం కోల్పోయాడో దీనిని బ‌ట్టి అంద‌రూ అర్థం చేసుకోవ‌చ్చు. అత‌డికి కేవ‌లం అత‌డి త‌ల్లి, ఇంట్లో పెట్స్ మాత్ర‌మే తోడుగా ఉన్నాయి. భార్య లేదు గ‌నుక స‌రోగ‌సీలో జ‌న్మించిన‌ పిల్ల‌ల‌ను పెంచుకుంటున్నాడు. స్టార్ల పిల్ల‌ల‌ను ఎప్పుడూ త‌న పిల్ల‌లుగానే చూసుకునే క‌రణ్ జోహార్ కి ప‌రిశ్ర‌మ‌లో స‌త్సంబంధాలు ఉన్నాయి. షారూఖ్ స‌హా ప‌లువురు అగ్ర క‌థానాయ‌కులు అత‌డికి ఆప్త‌మిత్రులుగా ఉండ‌టం కొంత‌వ‌ర‌కూ ఊర‌ట‌.

గుజ‌రాతీలో ఆరంగేట్రం:

క‌ర‌ణ్ జోహార్ కి చెందిన ధర్మ ప్రొడక్షన్స్ `ది గోస్ట్ ఆఫ్ లఖ్‌పత్` అనే చిత్రంతో గుజరాతీ సినిమాల్లోకి అడుగుపెడుతున్నట్లు సమాచారం. నవంబర్ 2025లో కచ్ ప్రాంతంలో అధికారికంగా షూటింగ్ ప్రారంభమైంది. ఇది భారీ బడ్జెట్ మూవీ. యుక్తి రాండేరియా, ఈషా కన్సారా సంయుక్తంగా దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు.

చారిత్రాత్మక నేప‌థ్యం ఉన్న‌ లఖ్‌పత్ గ్రామంలో సాగే సినిమా ఇది. ఇది ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న ఓడరేవు,.. 1819 భూకంపం సింధు నది మార్గాన్ని మార్చిన తర్వాత దెయ్యాల పట్టణంగా మారింది. ఈ దెయ్యాల దిబ్బ గురించిన సినిమా ర‌క్తి క‌ట్టిస్తుంద‌ని భావిస్తున్నారు.