బాహుబలి, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలు తీయలేనంటున్న కరణ్ జోహార్..కారణం?
కరణ్ జోహార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నేను ఎప్పటికీ బాహుబలి, కేజిఎఫ్, ఆర్ఆర్ఆర్ వంటి గొప్ప సినిమాలను చేయలేను.
By: Madhu Reddy | 17 Aug 2025 10:00 PM ISTబాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహార్ అంటే తెలియని వారు ఉండరు. ఆయన కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీకే పరిమితం అవ్వలేదు. సౌత్ ఇండస్ట్రీలో కూడా సుపరిచితులే.అయితే అలాంటి ఈయన నిర్మాతగానే కాదు సినిమాలకు దర్శకత్వం కూడా చేశారు. అలాగే స్క్రీన్ రచయితగా కూడా కొన్ని సినిమాలకు కథ అందించారు. అలాగే పలు టీవీ షోలకు వ్యాఖ్యతగా వ్యవహరించారు. అయితే అలాంటి కరణ్ జోహార్ తాజాగా తనను తాను కించపర్చుకుంటూ మాట్లాడిన మాటలు బీటౌన్ లో వైరల్ గా మారాయి. తనకు అలాంటి సినిమాలు తీసేంత సీన్ లేదని, అలాంటి సినిమాలు తాను ఎప్పటికీ తీయలేను అంటూ అవమానించుకున్నారు. మరి ఇంతకీ కరణ్ జోహార్ ఎలాంటి జానర్ లో వచ్చే సినిమాలు తీయలేనని స్పష్టం చేశారు? ఎందుకు ఆయన్ని ఆయనే కించపర్చుకున్నారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
కరణ్ జోహార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నేను ఎప్పటికీ బాహుబలి, కేజిఎఫ్, ఆర్ఆర్ఆర్ వంటి గొప్ప సినిమాలను చేయలేను. నాకు అంత సామర్థ్యం లేదు" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ మధ్యకాలంలో కరణ్ జోహార్ చేసిన ఈ వ్యాఖ్యలు బీ టౌన్ లో వైరల్ గా మారాయి. కానీ కరణ్ జోహార్ మాట్లాడిన మాటల్ని చాలామంది మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే వాళ్లకంటే మేమేం తక్కువ అనుకునే దర్శక నిర్మాతలు ఉన్న ఇండస్ట్రీలో ఉన్నారు.కానీ కరణ్ జోహార్ మాత్రం నేను ఎప్పటికీ వాళ్ళలా సినిమాను తీయలేనని నిజాయితీగా ఒప్పుకోవడంతో ఈయన నిజాయితీని చాలామంది ప్రశంసిస్తున్నారు. అయితే మన ఇండియన్ సినీ హిస్టరీలో రెండు దశాబ్దాలుగా పైగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అలాంటి కరణ్ జోహార్ తనని తానే కించపర్చుకోవడం చాలా మందికి నచ్చడం లేదు. ఎందుకంటే కరణ్ జోహార్ ఒక ప్రత్యేక జానర్ లో సినిమాలు తీస్తూ ఉంటారు. ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఉంది.
కరణ్ జోహార్ చేసే సినిమాల్లో చాలావరకు లోతైన భావోద్వేగ కథలతో పాటు స్టైలిష్ కథలు కూడా ఉంటాయి. ఇలాంటి కథలు ఎంతోమంది అభిమానులను అలరించాయి. అంతేకాదు గతంలో ఈయన తీసిన చాలా సినిమాలు రెండు దశాబ్దాలైనా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలానే ఉంటాయి. అలా కరణ్ జోహార్ డైరెక్షన్ చేసిన కుచ్ కుచ్ హోతా హై మూవీ విడుదలై 27 సంవత్సరాలైనా కూడా ఇంకా ఈ సినిమాని ఇప్పటి జనరేషన్ వాళ్లు కూడా ఆదరిస్తారు.
కరణ్ జోహార్ సినిమాల్లో బలమైన భావోద్వేగం, నాటకం,సంగీతం, కుటుంబ బంధాలు ప్రతి ఒక్కటి ఉంటాయి. కరణ్ జోహార్ చేసిన ఖుషి కభీ ఘమ్, మై నేమ్ ఈజ్ ఖాన్ వంటి సినిమాలు ఈయన బ్రాండ్ ఇమేజ్ ని సూచిస్తాయి. ఈయన నిర్మాతగా, దర్శకుడిగా మాత్రమే కాకుండా కల్ హో నా హో అనే సినిమాకి రచయితగా కూడా వర్క్ చేశారు. ఈ సినిమా ఇప్పటికీ ఎంతోమందిని మెప్పిస్తోంది. అలా తన సినిమాలతో ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న కరణ్ జోహార్ ఇతర దర్శకులతో పోల్చుకొని అలాంటి సినిమాలు ఎప్పటికీ చేయలేనంటూ చెప్పి తన నిజాయితీ ఏంటో అందరికీ తెలిసి వచ్చేలా చేశారు.
