మళ్లీ ప్రేమలో పడ్డ అగ్ర దర్శకనిర్మాత
అదంతా సరే కానీ, కరణ్ దేనినైనా స్పోర్టివ్ గా తీసుకుంటారు. ఎంతో పరిణతితో అన్నిటికీ సమాధానాలివ్వగలరు. ఇప్పుడు ఆయన మరోసారి ప్రేమలో పడ్డానని చెప్పారు.
By: Sivaji Kontham | 1 Dec 2025 3:00 AM ISTతాను ఒక కథానాయికను ప్రేమించానని ఇంతకుముందు చెప్పాడు కరణ్ జోహార్. అయితే తన ప్రేమ తిరస్కారానికి గురయ్యాక ఇక ఒంటరిగా మిగిలిపోవాలని నిర్ణయించుకున్నట్టు భగ్నప్రేమ గురించి చెప్పాడు. ఆ తర్వాత కరణ్ కొన్నాళ్లపాటు షారూఖ్ ఖాన్ తో ప్రేమలో ఉన్నాడని కూడా ప్రచారమైంది. కొన్ని గే సినిమాలు తీయడంతో అతడిపై చాలా కామెంట్లు వినిపించాయి.
అదంతా సరే కానీ, కరణ్ దేనినైనా స్పోర్టివ్ గా తీసుకుంటారు. ఎంతో పరిణతితో అన్నిటికీ సమాధానాలివ్వగలరు. ఇప్పుడు ఆయన మరోసారి ప్రేమలో పడ్డానని చెప్పారు. ఈసారి ఎవరితో ప్రేమలో పడ్డాడు? అంటే.. కచ్ఛితంగా ఏఐతో ప్రేమలో పడ్డానని చెప్పాడు. ఆరంభం కృత్రిమ మేధస్సు (ఏఐ) గురించి తనకు ఏమీ తెలియదని, కానీ దాని గురించి తెలిసాక చాలా ఇష్టపడుతున్నానని అన్నాడు. చాట్ జీపీటీని తన కొత్త ప్రేమికుడు అని సరదాగా వ్యాఖ్యానించాడు. తాను ఘాఢమైన ప్రేమలో ఉన్నట్టు తెలిపాడు.
ఇటీవల చాట్ జీపీటీని చాలా ఇష్టపడుతున్నానని అతడు చెప్పాడు. ప్రేమ ఏకపక్షం కాదని, చాట్ జీపీటీ అతడిని తిరిగి ప్రేమిస్తుందని కూడా కొందరు సరదాగా రిప్లయ్ ఇస్తున్నారు. ఒక స్టైలిష్ మిర్రర్ సెల్ఫీని షేర్ చేసిన కరణ్ ఎప్పటిలానే తనలోని హాస్య చతురతను ప్రదర్శించిన తీరు ఆకట్టుకుంది.
ఇక కెరీర్ మ్యాటర్ కి వస్తే, తన ధర్మ ప్రొడక్షన్స్ ని ఆధార్ పూనవల్లాకు అమ్మేసిన తర్వాత, కరణ్ కొంత అలసట లేకుండా ఉన్నాడు. ఇటీవల `హోంబౌండ్` అనే అవార్డుల సినిమాని నిర్మించాడు. దీనిని మే 21న 2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని అన్ సెర్టైన్ రిగార్డ్ విభాగంలో ప్రపంచ ప్రీమియర్‌ను ప్రదర్శించగా ప్రదర్శన తర్వాత తొమ్మిది నిమిషాల స్టాండింగ్ ఒవేషన్ అందుకున్నామని మేకర్స్ తెలిపారు. నీరజ్ ఘయ్వాన్ దీనికి దర్శకరచయిత. ఈసారి ఫీచర్ ఫిలిం కేటగిరీలో ఆస్కార్ అవార్డులకు కూడా `హోంబౌండ్` పోటీపడుతోంది.
ఈ చిత్రం ఇద్దరు బాల్య స్నేహితులు జాతీయ పోలీసు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ప్రయత్నించిన తర్వాత ఏం జరిగింది? అనే కథతో రూపొందింది. ఇందులో ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా, జాన్వి కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. కొన్ని రోజుల క్రితం లండన్ లోను హోమ్ బౌండ్ ని స్క్రీనింగ్ చేయగా కరణ్ దీనికి హాజరయ్యారు. దీనికి ముందు ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేసిన మార్టిన్ స్కోర్సెస్ న్యూయార్క్ నగరంలో `హోమ్‌బౌండ్` ప్రదర్శనను నిర్వహించారు. అక్కడా మంచి స్పందన వచ్చింది. కరణ్ నిర్మించిన సినిమా ఆస్కార్ గెలవాలని అందరూ ప్రార్థిస్తున్నారు.
