నువ్వు హీరో ఏంట్రా అని ఎగా దిగా చూసింది!
బాలీవుడ్ లో కరణ్ జోహార్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. అక్కడాయన సక్సెస్ పుల్ డైరెక్టర్ కం ప్రొడ్యూసర్.
By: Srikanth Kontham | 13 Jan 2026 6:00 PM ISTబాలీవుడ్ లో కరణ్ జోహార్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. అక్కడాయన సక్సెస్ పుల్ డైరెక్టర్ కం ప్రొడ్యూసర్. దర్శకుడిగా కొన్ని సినిమాలే చేసినా ఆల్ టైమ్ క్లాసిక్ హిట్స్ అవన్నీ. నిర్మాతగా మాత్రం ఎన్నో సినిమాలు నిర్మించారు. ధర్మ ప్రొడక్షన్స్ లో నిర్మాతగా ఆయన చేయని ప్రయోగం లేదు. అలాగే నటుడిగానూ కొన్ని సినిమాల్లో కనిపించారు. కానీ నిర్మాతగా వచ్చిన గుర్తింపు నటుడిగా దక్కించుకోలేదు. ఆయన నటన సీరియస్ గా తీసుకున్నది లేదు. కెరీర్ ఆరంభంలో కీలక పాత్రలు పోషించినా కాల క్రమంలో గెస్ట్ పాత్రలకే పరిమితయ్యారు.
అయితే కరణ్ జోహార్ హీరో అవ్వాలనుకునే వారు? అన్నది ఎంత మందికి తెలుసు అవును. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించారు. చిన్నప్పుడు హీరో అవ్వాలని కలలు కనేవాడుట. లావుగా ఉన్న అందంగా ఉండటంతో తండ్రి కూడా కచ్చితంగా హీరో అవుతావని ప్రోత్సహించేవారుట. కానీ కరణ్ జోహార్ తల్లి మాత్రం కింద నుంచి పై వరకూ చూసి నువ్వు హీరో అవుతావా? అని సరదాగా ఎగతాళి చేసే వారుట. నీ పర్సనాల్టీ అద్దంలో చూసుకున్నావా? అని అనేవారుట నవ్వుతూ.
దీంతో బరువు తగ్గాలని డైటింగ్ చేయడం..కొన్ని రోజుల తర్వాత బ్రేక్ ఇవ్వడం చేసేవారుట. ఓసారి మాత్రం డైట్ సీరియస్ గా చేసాడుట. కాలీజీకి వచ్చే వారు అంతా సన్నగా ఉంటే తాను మాత్రమే లావు గా ఉన్నానని ఈసారి ఎలాగైనా వెయిట్ తగ్గాలని సీరియస్ గా సంక్పలించారు. కొన్ని రోజుల పాటు చేసిన తర్వాత కాలేజీలో కళ్లు కూడా తిరిగి పడిపోయాడుట. దీంతో వెంటనే విషయం తల్లికి తెలియడంతో కాలీజీకి వచ్చి ఇంటికి తీసుకెళ్లి డైట్లు అవీ చేయోద్దని సూచించారుట. ఆ తర్వాత ఆరోగ్యం కుదుటుకున్న తర్వాత తిరిగి డైట్ ప్రారంభించి బరువు తగ్గినట్లు తెలిపారు.
చాలా మంది తనని మందుల వల్ల, సర్జరీ వల్ల బరువు తగ్గాననుకుంటారని అనుకుంటారు. కానీ అందులో వాస్తవం లేదన్నారు. సన్నగా మారిన తర్వాత ఆరోగ్యం కూడా బాగుందన్నారు. చక్కెరకు పూర్తిగా దూరమవ్వడం..రైస్ వంటి వాటిని అరుదుగా తీసుకోవడం..కార్పోహైడ్రేట్లు ఉన్న పదార్దాలు తక్కువగా తినడం వంటివి ఆరోగ్యానికి మేలు చేసేవి అని అన్నారు. రోజు వర్కౌట్లు చేయడం, ఈత కోట్టడం, అప్పుడప్పుడు రన్నింగ్ కి వెళ్లడం, ఆటలు ఆడటం వంటివి క్రమం తప్పకుండా చేస్తున్నానన్నారు. ఇలాంటి వాటితో చాలా వరకూ బరువు పెరగకుండా స్మార్ట్ లుక్ మెయింటెన్ చేయోచ్చని సూచించారు. మొత్తానికి కరణ్ జోహార్ కూడా ఫిట్ నెస్ ప్రీక్ అని ఈ సందర్భంగా తేట తెల్లమవుతోంది.
