Begin typing your search above and press return to search.

స్వ‌లింగ సంప‌ర్కం క‌థ‌తో ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ స‌ర్‌ప్రైజ్

కరణ్ జోహార్ నిర్మించిన తాజా చిత్రం `అక్యూజ్డ్` ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

By:  Sivaji Kontham   |   21 Feb 2026 7:28 PM IST
స్వ‌లింగ సంప‌ర్కం క‌థ‌తో ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ స‌ర్‌ప్రైజ్
X

స్వ‌లింగ సంప‌ర్కుల క‌థ‌తో బాలీవుడ్ లో చాలా సినిమాలు వ‌చ్చాయి. ప్రాంతీయ భాష‌ల‌లోను ఈ త‌ర‌హా సినిమాలు వ‌చ్చి పెద్ద డిబేట్ కి తెర తీసాయి. క‌ర‌ణ్ జోహార్ లాంటి నిర్మాత త‌న బ్యాన‌ర్ సినిమాల్లో ఎల్జీబీటీక్యూ పాత్ర‌ల‌ను కూడా ప్ర‌వేశ పెట్ట‌డం ఎప్పుడూ చ‌ర్చ‌నీయాంశం. అత‌డు నిర్మించిన దోస్తానా చిత్రంలో క‌థానాయ‌కులు ఎల్జీబీటీక్యూ అనే డ్రామాను న‌డిపించ‌డం అప్ప‌ట్లో చాలా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇప్పుడు ఇదే ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ లో మ‌రో ఎల్జీబీటీక్యూ (స్వ‌లింగ సంప‌ర్కం)పై సినిమా వ‌స్తోంది.

కరణ్ జోహార్ నిర్మించిన తాజా చిత్రం `అక్యూజ్డ్` ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా క‌థాంశం ఆస‌క్తిని రేకెత్తించింది. ఇది ఇద్దరు లెస్బియన్ మహిళల చుట్టూ తిరిగే కథ. గీతిక (కొంకణ), మీరా (ప్రతిభా రాంటా) ఒక జంటగా విదేశాల్లో నివసిస్తూ బిడ్డను దత్తత తీసుకోవాలని ప్లాన్ చేస్తారు. అయితే ఒక డాక్టర్ అయిన గీతికపై సెక్సువల్ ప్రిడేటర్ (లైంగిక వేధింపుల) ఆరోపణలు వస్తాయి. ఈ ఆరోపణలు వారి మధ్య ఉన్న బంధాన్ని, వారి గౌరవాన్ని ఎలా దెబ్బతీశాయి అనేది ఈ సినిమా మూలకథ. ట్రైల‌ర్ ఆద్యంతం కొంక‌ణా పాత్ర స‌స్పెన్స్ తో ర‌క్తి క‌ట్టిస్తోంది. ఆమె ట‌చ్ ని అదృశ్య‌రూపంలో ఒక శ‌క్తి గ‌మ‌నిస్తూ ఉండ‌టం కూడా ఇందులో స‌స్పెన్స్ ఎలిమెంట్ ని బ‌ల‌ప‌రిచింది. ట్రైల‌ర్ ఆద్యంతం థ్రిల్ల‌ర్ స‌స్పెన్స్ మోడ్ లో ఆక‌ట్టుకుంది. ఫిబ్రవరి 27న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

క‌ర‌ణ్ జోహార్ తన సినిమాలు దోస్తానా, కపూర్ అండ్ సన్స్, అజీబ్ దాస్తాన్స్ లో స్వలింగ సంపర్కుల పాత్రలను ప్రవేశపెట్టడం ద్వారా ఈ అంశంపై చర్చ మొదలుపెట్టారు. `అక్యూజ్డ్` వంటి సినిమాలను నిర్మించడం ద్వారా ఆయన సమాజంలో ఉన్న సంక్లిష్టమైన అంశాలను వెండితెరపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇది రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ కంటే భిన్నంగా ఉందని నెటిజ‌నుల్లో కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు.

కరణ్ జోహార్ ఇటీవ‌ల వైవిధ్య‌మైన క‌థ‌ల‌కు మ‌ద్ధ‌తుగా నిలుస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో రొమాంటిక్ కామెడీల‌తో పాటు, భారీ యాక్ష‌న్ సినిమాల‌ను ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌యోగాత్మ‌క క‌థ‌ల‌తోను సినిమాల‌ను నిర్మిస్తూ నిరంత‌రం చ‌ర్చ‌ల్లో నిలుస్తున్నారు.