Begin typing your search above and press return to search.

'కార' టీజర్.. ధనుష్ ఏం చెప్పబోతున్నాడు?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అతను ఎంచుకునే కథలు ఎప్పుడూ కూడా డిఫరెంట్ గా ఉంటాయి.

By:  M Prashanth   |   24 April 2026 11:19 PM IST
కార టీజర్.. ధనుష్ ఏం చెప్పబోతున్నాడు?
X

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అతను ఎంచుకునే కథలు ఎప్పుడూ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చేసిన పీరియడ్ డ్రామాలు బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్ ఇస్తున్నాయి. 'అసురన్', 'కెప్టెన్ మిల్లర్' లాంటి చిత్రాలు ధనుష్ కు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తీసుకొచ్చాయి. ఇప్పుడు అదే తరహాలో మరోసారి వెనకటి కాలం నాటి కథతో వస్తున్న సినిమా 'కార'. ‘పోర్ తోళిల్’ చిత్రంతో తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్న దర్శకుడు విఘ్నేష్ రాజా ఈ సినిమాను తెరకెక్కించారు. లేటెస్ట్ గా విడుదలైన ఈ చిత్ర టీజర్ ఇప్పుడు సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.





టీజర్ లో ధనుష్ 'కారస్వామి' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. "నా పేరు కారస్వామి.. నన్ను కార అని పిలుస్తారు" అంటూ ఆయన చెప్పే డైలాగ్స్ చాలా ఇంటెన్సివ్ గా ఉన్నాయి. టీజర్ ప్రారంభంలో వర్షం పడుతున్న అడవిలో టార్చ్ లైట్లు పట్టుకుని కొందరు వ్యక్తులు ధనుష్ కోసం వెతకడం.. ఆ గందరగోళంలో ఆయన చిక్కుకోవడం లాంటి సీన్లు ఉత్కంఠను కలిగిస్తున్నాయి.





యాక్షన్ తో పాటు ఒక రకమైన ఎమోషనల్ బాండింగ్ కూడా ఈ సినిమాలో ఉండబోతుందని టీజర్ లోని కొన్ని సీన్లు చూస్తే అర్థమవుతోంది. మమితా బైజు హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ధనుష్ ఆమెతో కలిసి ఉన్న విజువల్స్ చాలా నేచురల్ గా ఉన్నాయి. టీజర్ లో వినిపిస్తున్న వాయిస్ ఓవర్ లో "పంటో గడ్డో.. పాపమో పుణ్యమో.. తను నాటిందే తను నరుక్కోవాలి" అనే డైలాగ్స్ సినిమా కథా నేపథ్యంపై ఒక క్లారిటీ ఇస్తున్నాయి.





గతాన్ని వెంటాడే మనిషిగా లేదా ఒక భారీ ప్రతీకారంతో రగిలిపోయే వ్యక్తిగా ధనుష్ పాత్ర ఉండబోతుందని తెలుస్తోంది. టీజర్ చివరలో ఆయన తలకి గుడ్డ కట్టుకుని నడుచుకుంటూ వచ్చే సీన్ పక్కా పీరియడ్ డ్రామాను తలపిస్తోంది. ఈమధ్య కాలంలో ధనుష్ కు ఇలాంటి రా అండ్ రస్టిక్ లుక్స్ బాగా సెట్ అవుతున్నాయి. ఈ సినిమాలో కూడా ఆయన బాడీ లాంగ్వేజ్, ఆ సీరియస్ నెస్ కథకు ప్రాణం పోసినట్లు కనిపిస్తోంది. విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. జీవీ ప్రకాశం కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ టీజర్ లోని ఇంటెన్సిటీని మరో లెవల్ కు తీసుకెళ్లింది.

ముఖ్యంగా ధనుష్ కు, జీవీ కి ఉన్న హిట్ ట్రాక్ రికార్డ్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. దర్శకుడు విఘ్నేష్ రాజా మరోసారి ఒక కంటెంట్ ఉన్న సినిమానే తీసినట్లు విజువల్స్ చెబుతున్నాయి. జయరామ్, కేఎస్ రవికుమార్ లాంటి సీనియర్ నటులు ఉండటం వల్ల కథలో డ్రామా కూడా గట్టిగానే ఉండేలా ఉంది. ఇది కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాకుండా ఒక ఇంట్రెస్టింగ్ హీస్ట్ డ్రామా అని ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తోంది.

ఈ చిత్రం ఏప్రిల్ 30న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తెలుగులో కూడా ధనుష్ కి మంచి మార్కెట్ ఉండటంతో ఇక్కడ కూడా సినిమాను భారీగానే ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ కారస్వామి తన ప్రతీకారాన్ని ఎలా తీర్చుకున్నాడు? అసలు ఆ అడవిలో ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.