30 వేల కోట్ల ఆస్తి పోరాటంలో లాయర్ల కీచులాట!
నిర్మాత, పారిశ్రామిక వేత్త సంజయ్ కపూర్ 30,000 కోట్ల ఆస్తుల కోసం కుటుంబంలో బిగ్ ఫైట్ నడుస్తున్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 12 Sept 2025 9:45 PM ISTనిర్మాత, పారిశ్రామిక వేత్త సంజయ్ కపూర్ 30,000 కోట్ల ఆస్తుల కోసం కుటుంబంలో బిగ్ ఫైట్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దిల్లీ హైకోర్టులో ఈ ఆస్తుల వ్యవహారంపై న్యాయ విచారణ సాగుతోంది. కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఎంత వాటా వెళ్లాల్సి ఉంటుంది? అసలు మొత్తం స్థిర చరాస్తుల వివరాలేమిటి? అంటూ న్యాయమూర్తి ఆరాలు తీసారు. వివరాల్ని సమర్పించాల్సిందిగా దివంగత కపూర్ ప్రస్తుత భార్య ప్రియా సచ్ దేవ్ కపూర్ ని కోర్టు ఆదేశించింది. అలాగే సంజయ్ కపూర్ విల్లు రాసారని ప్రియా సచ్ దేవ్ వాదించగా, ఎలాంటి విల్లు రాయలేదని కోర్టులో నిరూపణ అయినట్టు కథనాలొచ్చాయి.
సంజయ్ రెండో భార్య కరిష్మాకపూర్ తన పిల్లలకు దక్కాల్సిన వాటాను ఇవ్వాల్సిందిగా వారసుల తరపున పోరాటం సాగిస్తున్నారు. కానీ కరిష్మా వారసులకు సంజయ్ కపూర్ పెద్ద మొత్తంలో ట్రస్టు ఆస్తుల్ని దఖలు పరిచారని, ఇంకా ఏడుపు దేనికి? అని ప్రశ్నించారు ప్రియా సచ్ దేవ్. ఆ ఇద్దరి పోరాటం మధ్యలో సంజయ్ కపూర్ తల్లి రాణీ కపూర్ తన వాటా తనకు కావాలని పోరాడుతున్నారు. కానీ ఈ కేసులో త్వరగా తేలని సమస్యలు ఎన్నో ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ వివాదం ఇలా ఉండగానే, ఇప్పుడు కోర్టు విచారణ సమయంలో ఇరువురి తరపు న్యాయవాదులు ఒకరిపై ఒకరు అరుచుకోవడం చర్చగా మారింది. ``నాపై అరవకండి.. తోటి న్యాయవాది విషయంలో మర్యాదగా ప్రవర్తించండి...`` అంటూ కరిష్మా కపూర్ న్యాయవాది - మహేష్ జెఠ్మలానీ సీరియస్ అవ్వగా, ప్రియా సచ్ దేవ్ న్యాయవాది రాజీవ్ నాయర్ `మీరు అలా మాట్లాడవద్దు` అని అన్నారు. అందుకు సంబంధించిన వీడియోని ఆర్ అండ్ బెచ్ వెబ్ సైట్ షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారుతోంది.
కరిష్మా న్యాయవాది వెర్షన్ :
తన మాజీ భర్త దివంగత సంజయ్ కపూర్ ఆస్తిపై జరుగుతున్న న్యాయ పోరాటంలో నటి కరిష్మా కపూర్ తన వైఖరిని స్పష్టం చేశారు. తన న్యాయవాది ప్రకారం ఈ పోరాటం వ్యక్తిగత సంపద గురించి కాదు.. తన ఇద్దరు పిల్లలు సమైరా - కియాన్‌లకు నిజమైన వారసత్వాన్ని నిర్ధారించడం నాకు ముఖ్యం అని వాదిస్తున్నారు. కరిష్మా ఆమె పిల్లలకు మాజీ భర్త సంజయ్ కపూర్ 1900కోట్లు కేటాయించారని ప్రియా సచ్ దేవ్ వాదదించగా, దానిని న్యాయవాది జెఠ్మలానీ తోసిపుచ్చారు.
లాయర్ గట్టోడే..
30,0000 కోట్లు సంజయ్ కపూర్ కి ఉండి ఉంటే, కరిష్మా పిల్లలకు 1900 కోట్లు మాత్రమే లభిస్తే, మొత్తం ఆస్తిని ఐదుగురు వారసులు తల్లి, ముగ్గురు పిల్లలు, ప్రియ వారి మధ్య ఆస్తుల్ని పంచాల్సి ఉంటుంది. ఆమె వీలునామాను ఎందుకు బయటపెట్టలేదు? అది నిజమైనదైతే శ్రీమతి ప్రియా కపూర్ ఆస్తులను పిల్లలు పొందడం లేదు. ఇవి సంజయ్ కపూర్ ఆస్తులు.. ఎవరూ మాకు సహాయం చేయడం లేదు. 1900 కోట్లు కరీనాకు వెళితే మిగిలిన రూ28,000 కోట్లను ప్రియా సచ్‌దేవ్ వదులుకుంటుందా? ఎంత చెత్త ఆలోచన.. పిల్లల హక్కు కోసం మేము పోరాడుతున్నాము అని కరిష్మా లాయర్ కోర్టులో వాదించారు.
ఏదీ కోరుకోవడం లేదు...!
కరిష్మా కపూర్ తనకోసం ఏదీ కోరుకోవడం లేదు, ఈ వ్యాజ్యం లక్ష్యం తన దివంగత మాజీ భర్త కోరుకున్న విధంగా పిల్లలను సురక్షితంగా ఉంచడమే.. ఇది భారతదేశంలోని ఆయన ఆస్తులు, భారతదేశంలోని అతడి కార్పొరేట్ ఆస్తులు , విదేశాలలో ఆస్తుల వివరాలున్న ట్రస్ట్ డీడ్ ప్రకారం... ఒక వీలునామా రాసి ఉంది. ఈ వీలునామా ఎప్పుడూ బహిర్గతం చేయలేదు.. పరిశీలనకు లేదు అంటే విల్లు రాయలేదని అర్థం... అని జెఠ్మలానీ వాదించారు.
