Begin typing your search above and press return to search.

ఓటీటీ ఫ్లాప్ గా నిలిచిన కపిల్ షో.. వెల్లువెత్తుతున్న విమర్శలు!

ఒకప్పుడు రియాల్టీ షోలకు, స్టాండ్ అప్ కామెడీ షోలకి మంచి ప్రేక్షకాదరణ లభించేది. కానీ రాను రాను ఆ క్రేజ్ తగ్గిపోతోంది అనే వార్తలు వ్యక్తం అవుతున్నాయి.

By:  Madhu Reddy   |   5 Aug 2025 1:44 PM IST
ఓటీటీ ఫ్లాప్ గా నిలిచిన కపిల్ షో.. వెల్లువెత్తుతున్న విమర్శలు!
X

ఒకప్పుడు రియాల్టీ షోలకు, స్టాండ్ అప్ కామెడీ షోలకి మంచి ప్రేక్షకాదరణ లభించేది. కానీ రాను రాను ఆ క్రేజ్ తగ్గిపోతోంది అనే వార్తలు వ్యక్తం అవుతున్నాయి. ఒకప్పుడు తమ షోలతో ఇండియాలోనే బెస్ట్ టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకున్న షోలు కూడా ఇప్పుడు మినిమం రేటింగ్ సాధించడంలో కూడా వెనకడుగు వేస్తున్నాయి అంటే.. ఇక ప్రేక్షకులను మెప్పించడంలో ఆ షోలు ఎంతగా వెనకబడిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. సరిగా ఇప్పుడు కూడా ఒక షో అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. గతంలో నంబర్ వన్ షోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న కపిల్ శర్మ షో ఇప్పుడు విమర్శలు ఎదుర్కోవడమే కాదు.. ఓటీటీ ఫ్లాప్ షో అంటూ నిందలు కూడా మోస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

డబ్బింగ్ ఆర్టిస్ట్ , స్టాండప్ కమెడియన్, టెలివిజన్ పోస్ట్, నటుడు, నిర్మాత, గాయకుడిగా కూడా పేరు సొంతం చేసుకున్న కపిల్ శర్మ.. "ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో " అనే టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 2016 ఏప్రిల్ 23న ప్రారంభం అయ్యింది. మొదట్లో మంచి ప్రజాధారణ పొందిన ఈ షో.. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ షో పట్ల ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు సోషల్ మీడియా ద్వారా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు కూడా.. ఒకప్పుడు ది కపిల్ శర్మ షో ప్రేక్షకులను ఎంతలా ఆకర్షించిందో..ఆ ఆకర్షణ ఇప్పుడు కరువైంది అని చాలామంది ఎత్తిచూపుతున్నారు.

ఈ షో ప్రారంభమైనప్పుడు పెద్ద సంఖ్యలో గొప్ప నటీనటులు అతిథులుగా వచ్చారు. ముఖ్యంగా సునీల్ గ్రోవర్ తిరిగి రావడంతో సానుకూల దృష్టిని ఆకర్షించింది ఈ షో. కానీ కాలక్రమమైన ప్రేక్షకులు ఈ కామెడీకి కనెక్ట్ అవుతున్నట్లు అనిపించడం లేదు. ఒకప్పుడు కపిల్ శర్మ తెరపైకి తెచ్చిన తాజాదనం ఇప్పుడు పూర్తిగా కనుమరుగయింది అని కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ కపిల్ శర్మ షోకి రాఘవ్ చద్దా.. పరిణితి చోప్రా వంటి వారు విచ్చేసినా.. ఈ ఎపిసోడ్ మాత్రం చాలా నిస్తేజంగా ఉందని చెబుతున్నారు. ఇక మరి కొంతమంది అతిథులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నా.. గంటల తరబడి ఈ షో పైనే దృష్టి పెట్టేంత ఎంటర్టైన్మెంట్ అందివ్వలేకపోతున్నారు అని వీక్షకులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

వాస్తవానికి ప్రముఖ టీవీ ఛానల్ సోనీ లైవ్ లో ఇది ప్రసారమైనప్పుడు ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాలక్రమేనా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవడం మొదలైన దగ్గర నుంచీ క్రమంగా వీక్షకులు తగ్గిపోతున్నారని నివేదికల కూడా చెబుతున్నాయి. ఏది ఏమైనా సామాజిక మాధ్యమాలలో పెరుగుతున్న విమర్శలను దృష్టిలో పెట్టుకొని ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో భవిష్యత్తు లోనైనా పూర్తి ప్రణాళికలతో ముందడుగు వేయాలి అని, కపిల్ శర్మ అలాగే అతని బృందం కొత్త కామెడీతో ప్రేక్షకులను అలరించాలి అని వీక్షకులు కామెంట్లు చేస్తున్నారు. మరి భవిష్యత్తులోనైనా ఈ షో తిరిగి పూర్వ వైభవాన్ని పొందుతుందో లేదో చూడాలి.