స్టార్ కమెడియన్ రెస్టారెంట్‌లో నాల్గవ సారి కాల్పులు
స్టార్ కమెడియన్, కమ్ హోస్ట్ అయిన కపిల్ శర్మను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసి దాడులు చేయడం మీడియాలో చూస్తూనే ఉన్నాం.
By: Ramesh Palla | 17 Oct 2025 10:42 AM ISTస్టార్ కమెడియన్, కమ్ హోస్ట్ అయిన కపిల్ శర్మను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసి దాడులు చేయడం మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇండియాలో కపిల్ శర్మ హై సెక్యూరిటీతో ఉంటున్నారు. సల్మాన్ ఖాన్ తర్వాత కపిల్ శర్మకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ప్రమాదం పొంచి ఉందని పోలీసు వర్గాల వారు చెబుతున్నారు. కపిల్ శర్మను టార్గెట్ చేస్తున్నట్లుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. అన్నట్లుగానే ఆయనకు సంబంధించిన రెస్టారెంట్ పై వరుసగా మూడు సార్లు దాడులు చేశారు. కేవలం నాలుగు నెలల గ్యాప్‌లో కెనడాలోని కపిల్ శర్మ యొక్క రెస్టారెంట్ పై కాల్పులు జరపడం చర్చనీయాంశం అయింది. ఆయన వ్యాపారాన్ని దెబ్బ తీసే విధంగా ఈ దాడులు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. కెనడా ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది.
కపిల్ శర్మ రెస్టారెంట్‌పై కాల్పులు
కపిల్ శర్మకు చెందిన కెనడా రెస్టారెంట్ పై కాల్పులు జరిపింది తామే అని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇద్దరు సభ్యులు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కెనడా ప్రభుత్వం ఈ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది. అయినా కూడా ప్రభుత్వం నుంచి తప్పించుకుని కపిల్ శర్మ రెస్టారెంట్‌పై వరుస దాడులకు పాల్పడుతున్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సెలబ్రిటీలను భయపెడుతున్నారు. పలువురు స్టార్స్ ను చంపేస్తామంటూ హెచ్చరిస్తూ ఆ మధ్య మెయిల్స్, సోషల్ మీడియా మెయిల్స్ చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వరుసగా కపిల్ శర్మ రెస్టారెంట్ పై దాడికి పాల్పడింది.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పోస్ట్
రెస్టారెంట్ పై కాల్పుల తర్వాత లారెన్స్ బిష్ణోయ్‌కి చెందిన గ్యాంగ్ సభ్యులు కొందరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. ఆ వెంటనే ఆ పోస్ట్‌లు డిలీట్ చేసినా వాటిని కొందరు స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అందులో... తాము కపిల్ శర్మకు ఫోన్ చేశాం, అతడు ఫోన్ కు రెస్పాన్స్ కావడం లేదు. ముందు ముందు కూడా అతడి నుంచి స్పందన రాకుంటే కచ్చితంగా ముంబైలో అతడిపై ఇలాంటి తరహా దాడులు జరుగుతాయని హెచ్చరిస్తున్నాం. తదుపరి చర్య ముంబైలో ఉండక ముందే కపిల్ రెస్పాండ్ కావాలని లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తమ టార్గెట్ సాధారణ ప్రజలు అస్సలు కాదని, వారితో మాకు ఎలాంటి శత్రుత్వం లేదు. కనుక సామాన్యులను మేము ఎప్పటికీ చంపం. కానీ కపిల్ శర్మ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.
వరుసగా మూడు సార్లు రెస్టారెంట్‌పై కాల్పులు
కపిల్ శర్మ రెస్టారెంట్‌పై మొదటి సారి జులై నెలలో కాల్పులు జరిపారు. ఆ సమయంలోనే కస్టమర్స్, ఉద్యోగులు భయభ్రంతులకు గురి అయ్యాయి. ఆ సమయంలో ఎవరికి ఎలాంటి గాయం కాలేదు. ఆ తర్వాత ఆగస్టు నెలలో మరోసారి కపిల్ శర్మ రెస్టారెంట్‌ను టార్గెట్ చేసి కాల్పులు జరిపారు. ఆ సమయంలో ఏకంగా 25 రౌండ్ల కాల్పులు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈసారి ఉన్న సెక్యూరిటీ కారణంగా దుండగులు ఎక్కువ సమయం రెస్టారెంట్‌లో ఉండలేక పోయారని, వారు వెంటనే కొన్ని రౌండ్ల కాల్పులు జరిపిన తర్వాత పారిపోయారు అని ప్రత్యక్ష సాక్ష్యులు, రెస్టారెంట్ లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు అంటున్నారు. మరోసారి రెస్టారెంట్‌పై దాడి జరగకుండా కెనడా ప్రభుత్వం భద్రత కట్టుదిట్టం చేసిందట, అంతే కాకుండా ప్రవాస భారతీయుల రక్షణ కోసం ప్రత్యేక సెక్యూరిటీని సైతం అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.
