Begin typing your search above and press return to search.

రిషబ్ శెట్టికి ఈసారి అంత ఈజీ కాదబ్బా..!

కాంతారా ప్రీక్వెల్ గా వస్తున్న కాంతారా చాప్టర్ 1 దసరా కానుకగా అక్టోబర్ 2న రిలీజ్ అవుతుంది. మరో రెండు వారాలు మాత్రమే రిలీజ్ ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇంకా మొదలు పెట్టలేదు.

By:  Ramesh Boddu   |   18 Sept 2025 5:00 PM IST
రిషబ్ శెట్టికి ఈసారి అంత ఈజీ కాదబ్బా..!
X

కాంతారా సినిమా వచ్చిన టైం లో ఆ సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు. కానీ సినిమా ఎవరి అంచనాలకు అందని విధంగా సెన్సేషనల్ హిట్ కొట్టింది. ఆ సినిమాతో రిషబ్ శెట్టికి స్టార్ డం వచ్చింది. డైరెక్టర్ కమ్ హీరోగా రిషబ్ శెట్టి కాంతారా సినిమాను మలచిన తీరుకి ఆడియన్స్ అంతా ఆహా ఓహో అనేశారు. ఇక ఇప్పుడు ఆ సినిమా ప్రీక్వెల్ కాంతారా చాప్టర్ 1 వస్తుంది. లెక్క ప్రకారం చెప్పాలంటే ఇది కాంతారా 2 అని చెప్పాలి. కానీ కాంతారా ఫ్రాంచైజీలో భాగంగా చాప్టర్ 1 అంటూ కొత్త అధ్యాయం మొదలు పెట్టాడు రిషబ్ శెట్టి.

ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ మించి..

కాంతారా ప్రీక్వెల్ గా వస్తున్న కాంతారా చాప్టర్ 1 దసరా కానుకగా అక్టోబర్ 2న రిలీజ్ అవుతుంది. మరో రెండు వారాలు మాత్రమే రిలీజ్ ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇంకా మొదలు పెట్టలేదు. ఐతే కాంతారా హిట్ అయ్యింది. అందుకే కాంతారా ప్రీక్వెల్ మీద భారీ హైప్ ఏర్పడింది. ఈ అంచనాలకు తగినట్టుగా సినిమా ఉండాలి. ఎందుకంటే ఒక సూపర్ హిట్ సినిమా సీక్వెల్ అంటే ఆ మాత్రం హైప్ గ్యారెంటీ.

రిషబ్ శెట్టికి ఈసారి కాంతారా చాప్టర్ 1 అంత ఈజీ ఏమి కాదు. సినిమా అంతా కూడా ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ మించి ఉండేలా జాగ్రత్త పడాలి. ఐతే ఇప్పటివరకు సినిమా ప్రమోషన్స్ కూడా మొదలు కాలేదు. కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ కోసం ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తికరంగా ఉన్నారు.

హోంబలే ప్రొడక్షన్ కంటెంట్ ఫుల్ సినిమాలు..

హోంబలే ప్రొడక్షన్ సినిమాలు కంటెంట్ ఫుల్ తో వస్తాయి. అందుకే ప్రమోషన్స్ ఎలా ఉన్నా సినిమాలు క్లిక్ అవుతాయి. అది హోంబలే బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు చూస్తేనే అర్ధమవుతుంది. కానీ కాంతారా 2కి కచ్చితంగా మంచి ప్రమోషన్స్ అవసరం అనిపిస్తుంది. మరి రిషబ్ శెట్టికి ఈ సినిమా ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి. కాంతారా చాప్టర్ 1 లో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం సౌత్ లో అమ్మడి ఫాలోయింగ్ ఒక రేంజ్ లో ఉంది. సినిమాకు ఎంతోకొంత ఆమె కూడా ప్లస్ అయ్యేలా ఉంది.

రిషబ్ శెట్టి మాత్రం కాంతారా చాప్టర్ 1 ముందు సినిమా కన్నా బిగ్గెస్ట్ హిట్ అవుతుందన్న కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరి ప్రమోషనల్ కంటెంట్ వదలకుండానే ఆ రేంజ్ హోప్ ఉంది అంటే మళ్లీ రిషబ్ ఏదో మ్యాజిక్ చేసినట్టే ఉన్నాడు.