Begin typing your search above and press return to search.

కాంతార 1 ట్రైలర్ కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. వచ్చేది ఎప్పుడంటే..

ఇక తాజాగా సినిమా టీమ్ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. సెప్టెంబర్ 22న మధ్యాహ్నం 12:45కు ట్రైలర్ విడుదల కానున్నట్టు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

By:  M Prashanth   |   19 Sept 2025 4:05 PM IST
కాంతార 1 ట్రైలర్ కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. వచ్చేది ఎప్పుడంటే..
X

కన్నడ సినీ పరిశ్రమ నుంచి వచ్చి అత్యద్భుత విజయం అందుకున్న సినిమా కాంతార. రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఆ చిత్రం కేవలం 15 కోట్ల బడ్జెట్‌తో రూపొందినా, పాన్ ఇండియా స్థాయిలో 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మైథాలజీ, ఫోక్ కల్చర్, నేటివిటీతో ఆ సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి విజయానికి ఇప్పుడు ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్ 1 తెరకెక్కుతుండటంతో అంచనాలు రెట్టింపయ్యాయి.


రిషబ్ శెట్టి ఈసారి కూడా రైటర్, డైరెక్టర్‌గా వ్యవహరించడం మాత్రమే కాకుండా హీరోగా కూడా స్క్రీన్‌పై కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రంపై వేరే లెవెల్ బజ్ క్రియేట్ అయ్యింది. అక్టోబర్ 2న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్ కోసం మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ముఖ్యంగా దసరా సీజన్‌లో రావడం వలన బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు ఎలాంటి అడ్డుకులేకుండా రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక తాజాగా సినిమా టీమ్ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. సెప్టెంబర్ 22న మధ్యాహ్నం 12:45కు ట్రైలర్ విడుదల కానున్నట్టు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

ట్రైలర్ పోస్టర్‌లో డోలు వాయిస్తున్న రిషబ్ శెట్టి పవర్‌ఫుల్ లుక్‌తో కనిపించగా, ఆ అగ్రెసివ్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రైలర్‌తో మేకర్స్ అంచనాలను మల్టీపుల్‌గా పెంచబోతున్నారని నమ్మకం ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ఫస్ట్ లుక్‌లు సినిమాపై హైప్‌ను రెట్టింపు చేశాయి.

కాంతార చాప్టర్-1 పై ఉన్న మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, ఇది కన్నడ సినీ ఇండస్ట్రీలో తొలిసారి వరల్డ్‌వైడ్ ప్రీమియర్స్‌తో వస్తోందని టాక్. అక్టోబర్ 1న సాయంత్రం 7 గంటలకు ప్రపంచవ్యాప్తంగా స్పెషల్ షోలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇది నిజమైతే, శాండల్‌వుడ్‌లో కొత్త ట్రెండ్‌ను స్టార్ట్ చేసినట్టే అవుతుంది. తెలుగు, తమిళ సినిమాలు ఇలాంటి ప్రమోషనల్ స్ట్రాటజీలతో మంచి ఫలితాలను సాధించిన నేపథ్యంలో, కాంతార మేకర్స్ కూడా అదే రూట్ ఫాలో అవుతున్నారని తెలుస్తోంది.

రిషబ్ శెట్టి ఈసారి కథను మరింత విస్తృతంగా, సాంప్రదాయ నమ్మకాలతో మిక్స్ చేసి చూపించనున్నారని చెబుతున్నారు. సినిమాకు సంబంధించిన విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పటికే టీజర్‌లోనే బలంగా ఆకట్టుకున్నాయి. దీంతో ట్రైలర్‌లో మరింత ఎమోషనల్‌గా, గ్రాండియర్‌గా ఉండే సన్నివేశాలు చూపించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. కేవలం కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం సహా పలు భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.