Begin typing your search above and press return to search.

ఆ విష‌యంలో కాంతార టీమ్ ఫెయిలైన‌ట్టే!

ఈ నేప‌థ్యంలో చాలా మంది ప్ర‌మోష‌న్స్ పై స్పెష‌ల్ కేర్ తీసుకుంటే మ‌రికొంద‌రు మాత్రం ఉన్న హైప్ చాల‌నుకుని స‌రిపెట్టేసుకుంటారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   23 Sept 2025 9:00 PM IST
ఆ విష‌యంలో కాంతార టీమ్ ఫెయిలైన‌ట్టే!
X

ఎలాంటి సినిమాకైనా ప్ర‌మోష‌న్లు అవ‌స‌ర‌మని సినీ ఇండ‌స్ట్రీలో త‌ల‌లు పండిన పెద్ద‌లే ఒప్పుకున్నారు. సినిమా ఫ‌లితాలు, ఓపెనింగ్స్ లో ప్ర‌మోష‌న్లు చాలా కీల‌క పాత్ర వ‌హిస్తాయ‌ని ఎన్నో సినిమాలు నిరూపించాయి. ఈ నేప‌థ్యంలో చాలా మంది ప్ర‌మోష‌న్స్ పై స్పెష‌ల్ కేర్ తీసుకుంటే మ‌రికొంద‌రు మాత్రం ఉన్న హైప్ చాల‌నుకుని స‌రిపెట్టేసుకుంటారు.

కాంతార‌కు ప్రీక్వెల్ గా కాంతార చాప్ట‌ర్1

క‌న్న‌డ సినిమా కాంతార చాప్ట‌ర్1 కూడా అలానే చేస్తోంది. 2022లో వ‌చ్చిన కాంతార సినిమా భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలవ‌గా, ఇప్పుడు ఆ సినిమాకు ప్రీక్వెల్ గా కాంతార చాప్ట‌ర్1 వ‌స్తోంది. మొద‌టి సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన రిష‌బ్ శెట్టినే ఈ సినిమాకు కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ న‌టిస్తుండ‌గా, అక్టోబ‌ర్ 1న ఈ క్రేజీ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

కాంతార చాప్ట‌ర్1 ట్రైల‌ర్ కు మిక్డ్స్ రెస్పాన్స్

రిలీజ్ కు ప‌ట్టుమ‌ని రెండు వారాలు కూడా లేదు. అయినా స‌రే మేక‌ర్స్ ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ ను వేగ‌వంతం చేయ‌డం లేదు. దానికి తోడు రీసెంట్ గా కాంతార చాప్ట‌ర్1 నుంచి రిలీజైన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ అనుకున్న రెస్పాన్స్ ను అందుకోలేక‌పోయింది. ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను మ‌రింత పెంచుతుంద‌నుకుంటే ఆ ట్రైల‌ర్ ఆడియ‌న్స్ నుంచి మిక్డ్స్ రెస్పాన్స్ ను అందుకుంది.

హైప్ ను వాడుకోవ‌డంలో ఫెయిల్ అవుతున్న కాంతార టీమ్

మామూలుగా ఏదైనా సినిమాకు సీక్వెల్ గానీ, ప్రీక్వెల్ గానీ వ‌స్తుంటే సాధార‌ణంగానే ఆ మూవీపై మంచి క్రేజ్ ఉంటుంది. కాంతార లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీకి ప్రీక్వెల్ వ‌స్తుంద‌న్న‌ప్పుడు కూడా అదే ర‌క‌మైన హైప్ ఏర్ప‌డింది. కానీ కాంతార చాప్ట‌ర్1 మేక‌ర్స్ ఆ హైప్ ను స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నారు. సినిమా ప్ర‌మోష‌న్స్ లో చిత్ర యూనిట్ చాలా వెనుక‌బ‌డి ఉంది.

కాంతార మేక‌ర్స్ ఇక‌నైనా మొద‌లుపెడితే బెట‌ర్

అస‌లే ఈ సినిమాకు యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. దాంతో పాటూ టాలీవుడ్ నుంచి ఈ వారం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా ఓజి రిలీజ‌వుతుంది. ఒక‌వేళ ఓజి బ్లాక్ బ‌స్ట‌ర్ అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా కాంతార ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ ప‌డే ఛాన్సుంది. కాబ‌ట్టి కాంతార సినిమాలానే ఈ ప్రీక్వెల్ తో కూడా భారీ ఓపెనింగ్స్ అందుకోవాలంటే రీసెంట్ రిలీజ్ చేసిన ట్రైల‌ర్ ఒక్క‌టే సరిపోదు. భారీ ఓపెనింగ్స్ రావాలంటే మేక‌ర్స్ ఇక‌నైనా సాలిడ్ గా ప్ర‌మోష‌న్స్ ను మొద‌లుపెట్టాలి. ట్రైల‌ర్ లో రుక్మిణి క్యారెక్ట‌ర్ మెయిన్ హైలైట్ గా నిలవ‌గా, ఆమెను కూడా ప్ర‌మోష‌న్స్ లో ఎక్కువ‌గా భాగం చేస్తే అది సినిమాకు బాగా ఉప‌యోగ‌ప‌డే అవ‌కాశ‌ముంది.